జైలు నుంచి ఇంటర్వ్యూ.. పోలీసులపై వేటు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్న పేరు లారెన్స్ బిష్ణోయ్. సల్మాన్ ఖాన్ పై బెదిరింపులకు పాల్పడటం, బాబా సిద్ధిఖి హత్య నేపథ్యంలో ఇతడి పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడీ గ్యాంగ్ స్టర్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా…

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్న పేరు లారెన్స్ బిష్ణోయ్. సల్మాన్ ఖాన్ పై బెదిరింపులకు పాల్పడటం, బాబా సిద్ధిఖి హత్య నేపథ్యంలో ఇతడి పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడీ గ్యాంగ్ స్టర్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారాడు. రెండేళ్ల కిందటి కేసు సంగతి ఇది.

జైలు నుంచే వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చాడు లారెన్స్. 2022లో జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. దీనిపై పంజాబ్ హైకోర్టు సిట్ ఏర్పాటు చేసింది.

ఈ ఘటనను పూర్తిస్థాయిలో విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. పంజాబ్ జైలు నుంచే లారెన్స్ ఇంటర్య్వూ ఇచ్చినట్టు తేల్చింది. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాల్ని కోర్టుకు సమర్పించింది. జైళ్లో ఉన్న లారెన్స్ కు పోలీసులు సహకరిస్తున్నారనే ఆరోపణలకు ఈ కేసుతో మరింత ఊతం దొరికింది.

కేసు పూర్వాపరాల్ని పరీశిలించిన హైకోర్టు.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు పోలీసుల్ని సస్పెండ్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఆదేశాలు ఈరోజు వెలువడ్డాయి. సస్పెండ్ అయిన అధికారుల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ర్యాంక్ అధికారులు ఇద్దరు ఉండడడం గమనార్హం.

2022 సెప్టెంబర్ లో ఈ ఘటన జరగ్గా.. ఇప్పటికీ లారెన్స్ బిష్ణోయ్ కు పోలీసులు సహకరిస్తున్నారని.. అతడు జైలు నుంచే అన్ని కార్యకలాపాలు సాగిస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల సహకారంతో జైలు నుంచే అతడు తన గ్యాంగ్ ను నడిపిస్తున్నాడనేది ప్రధానమైన ఆరోపణ.

3 Replies to “జైలు నుంచి ఇంటర్వ్యూ.. పోలీసులపై వేటు”

Comments are closed.