అది అవమానమైతే.. ఇది ఘోర అవమానం!

కొన్ని రోజుల కిందటి సంగతి. ఓ సినిమా ప్రెస్ మీట్ లో హీరోయిన్ అనన్య నాగళ్లకు కాస్టింగ్ కౌచ్ పై ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె తెగ ఫీల్ అయిపోయింది. ఐదేళ్లుగా తను సంపాదించుకున్న…

కొన్ని రోజుల కిందటి సంగతి. ఓ సినిమా ప్రెస్ మీట్ లో హీరోయిన్ అనన్య నాగళ్లకు కాస్టింగ్ కౌచ్ పై ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె తెగ ఫీల్ అయిపోయింది. ఐదేళ్లుగా తను సంపాదించుకున్న పరువు మొత్తం పోయిందన్నట్టు వ్యవహరించింది. తన ఐదేళ్ల కష్టం, ఒక్క ప్రశ్నతో ఆవిరైందని ఆవేదన వ్యక్తం చేసింది.

కట్ చేస్తే, ఇప్పుడు అదే సినిమా ప్రెస్ మీట్ లో నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ నోరు పారేసుకున్నాడు. సమీక్షకులపై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. ఇక్కడ రాయడానికి కూడా వీల్లేని అసభ్యకరమైన పదజాలం అది. అప్పుడు అనన్య నాగళ్లకు జరిగింది అవమానమైతే, ఇప్పుడి రివ్యూ రైటర్స్ కు జరిగింది అంతకంటే పెద్ద అవమానం కదా.

ఈ రెండూ జరిగింది ఒకే సినిమాకు సంబంధించి కాబట్టి కచ్చితంగా అనన్య నాగళ్ల అంశాన్ని ప్రస్తావించాల్సిందే. అప్పుడు అనన్యను మీడియా అవమానించిందని భావిస్తే, ఇప్పుడు శ్రీకాంత్ అయ్యంగార్, మీడియాను అంతకంటే ఘోరంగా అవమానించాడు కదా. ఇప్పుడేం చేద్దాం.

తప్పుడు క్వశ్చన్ అడిగితే మీటింగ్స్ పెట్టుకొని, సరిదిద్దుకుంటున్నాయి జర్నలిస్ట్ సంఘాలు. మరోసారి ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడుతున్నాయి. మరి తప్పుడు మాటలు మాట్లాడిన ఇలాంటి వ్యక్తులపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీటింగ్ పెడుతుందా.. ఇలాంటి వ్యక్తుల నోట్లో గడ్డి పెడుతుందా? మీడియా-సినిమా ఒకే కుటుంబమని చెప్పే సినీపెద్దలు శ్రీకాంత్ అయ్యంగార్ విషయంలో ఏం చేస్తారో చూడాలి.

ప్రతి మేకర్ తన సినిమాను ఆణిముత్యంగా ఫీలవుతాడు. అందులో తప్పులేదు. అయితే ఆ ముత్యం నిజంగానే మెరిసిందా లేదా అనేది సమీక్షకుడు చెబుతాడు. సినిమా తీయడం వాళ్ల డ్యూటీ అయితే, రివ్యూ రాయడం సమీక్షకుల డ్యూటీ. దీన్ని ఆపాలనుకోవడం మూర్ఖత్వం.

ఇతడిలా నోటికొచ్చినట్టు మాట్లడ్డం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా పలు సందర్భాల్లో తన నోటి దురద చూపించాడు. ఇప్పుడది మరింత శృతిమించింది. అసలీ రివ్యూ రైటర్స్ ను ఆపేయాలన్నాడు శ్రీకాంత్. అంతకంటే ముందు మైక్ పుచ్చుకొని నోటికొచ్చినట్టు వాగుతున్న శ్రీకాంత్ అయ్యంగార్ లాంటోళ్లను ఆపాలి.

10 Replies to “అది అవమానమైతే.. ఇది ఘోర అవమానం!”

  1. ఎన్నో రాత్రులు.పగల్లు ఆస్తులు తకాట్టు పెట్టి జీవితాలు త్యాగం చేసుకొని సినిమా లు తీస్తే మీరు ఒక్క పూట లో A C room lo కూర్చొని. కళ్ళు కడప కుండా రివ్యూ లు రార్షారు . వాడికి కడుపు మండింది ఒక మాట అన్నాడు .రాలు ఇసరడమే మీడియా పని . అనన్య కు ఎందుకు అడిగారు ఒక్క ఆమె కే కాదు కనిపించిన ప్రతి అమ్మాయి కి అడుగుతున్నారు ఇదే ప్రశ్న . తప్పు కాదా అది .ఎవరి తింగ్ ఇస్ ఫెయిర్ ఇన్ వార్ .

  2. మూర్తి తాతయ్యగారు, నాదొక కొస్చెన్. ప్రతి ప్రెస్‌మీట్‌లో సినిమా వాళ్లు మిమ్మల్నీ, సురేష్‌కొండేటిని, ఇంకొంతమంది జర్నలిస్టులని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు. కానీ మీరందరూ మాత్రం మళ్లీ మళ్లీ కొత్త ప్రెస్‌మీట్స్‌కి సిగ్గులేకుండా – సారీ సిగ్గు పడకుండా – వెళుతుంటారు. ఎందుకని?

Comments are closed.