వైఎస్సార్ ఆత్మ మౌన‌మెందుకు?

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, ష‌ర్మిల మ‌ధ్య ఆస్తుల త‌గాదా… సామాజిక స‌మ‌స్య‌గా మారింది. ష‌ర్మిల‌కు ఏనాడో ఆస్తుల పంప‌కం జ‌రిగిందని, తాను సంపాదించిన ఆస్తుల్లో వాటా ఇస్తానందుకే ఈ గొడ‌వ అని వైఎస్ జ‌గ‌న్ చెబుతున్నారు.…

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, ష‌ర్మిల మ‌ధ్య ఆస్తుల త‌గాదా… సామాజిక స‌మ‌స్య‌గా మారింది. ష‌ర్మిల‌కు ఏనాడో ఆస్తుల పంప‌కం జ‌రిగిందని, తాను సంపాదించిన ఆస్తుల్లో వాటా ఇస్తానందుకే ఈ గొడ‌వ అని వైఎస్ జ‌గ‌న్ చెబుతున్నారు. అయితే తాను కోరుకున్న‌ట్టు ఆస్తులు ఇవ్వ‌ని జ‌గ‌న‌న్నను ఎలాగైనా నాశ‌నం చేయాల‌నే రీతిలో ష‌ర్మిల రోజుకో కొత్త అంశంతో విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది.

ఈ ఎపిసోడ్‌లో వైఎస్సార్ ఆత్మ కేవీపీ రామ‌చంద్ర‌రావు మౌనం పాటించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. వీళ్లంద‌రిలో కంటే కేవీపీ ఏదైనా చెబితే విలువ వుంటుంది. ఇక్క‌డో విష‌యంపై చ‌ర్చించుకోవాల్సి వుంటుంది. ష‌ర్మిల శ‌నివారం మీడియా స‌మావేశంలో క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు. వైవీ సుబ్బారెడ్డి, సాయిరెడ్డిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఇదే సంద‌ర్భంలో తానో విష‌యాన్ని మ‌రిచిపోయారు. బ‌హిరంగ లేఖ‌లో తానే ప్ర‌స్తావించిన కేవీపీ రామ‌చంద్ర‌రావు ఎందుకు మాట్లాడ‌లేదో స‌మాధానం చెప్పాల్సి వుంటుంది.

ముందుగా ష‌ర్మిల బ‌హిరంగ లేఖ‌లో ఏముందో తెలుసుకుందాం.

“రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలే. అవి జగన్ మోహన్ రెడ్డి గారి సొంతం కాదు. ఉన్న అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ గారు ‘గార్డియన్ మాత్రమే. అన్ని వ్యాపారాలు నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా పంచి పెట్టలనేది జగన్ మోహన్ రెడ్డి గారి భాధ్యత. ఇది రాజశేఖర్ రెడ్డి గారి మేండేట్. వైఎస్ఆర్ ఈ ఉద్దేశ్యాన్ని ఆయన బిడ్డలమైన మాకు, ఆయన భార్యకు, సన్నిహితులందరికీ, స్పష్టంగా తెలిసిన విషయం. (Induding: కేవీపీ రామచందరరావు గారు, వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు)”

మీడియా స‌మావేశంలో ష‌ర్మిల ఏమ‌న్నారో చూద్దాం.

“ఆస్తుల వ్యవహారానికి సంబంధించి వైఎస్‌ రాజశేఖర రెడ్డి అభిమానులకు రాసిన లేఖలో ఉద్దేశపూర్వకంగానే, బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్లు రాశాను. జగన్‌ మోచేతి నీళ్లు తాగుతున్నారని తెలిసే ఆ లేఖలో వైవీ పేరు ప్రస్తావించాను. నా లేఖకు వైవీ స్పందించిన తీరుతోనే ఆయన నైజం .. నిజస్వరూపం అమ్మకు తెలిసిపోయాయి” అని షర్మిల విమర్శించారు.

వైవీ సుబ్బారెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు. జ‌గ‌న్ మోచేతి నీళ్లు తాగుతున్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు. మ‌రి తాను రాసిన లేఖ‌లో కేవీపీ రామ‌చంద్ర‌రావు పేరు కూడా ప్ర‌స్తావించారు క‌దా! కేవీపీ కాంగ్రెస్ నాయ‌కుడు. అంతేకాదు, త‌న తండ్రి స్వ‌యంగా ఆత్మ‌గా చెప్పుకున్న వ్య‌క్తి అని ష‌ర్మిల మ‌రిచిన‌ట్టున్నారు. ష‌ర్మిల ఏపీ కాంగ్రెస్‌కు సార‌థి. కేవీపీ ఆమెకు మ‌ద్ద‌తుగా మాట్లాడాలి క‌దా! మ‌రెందుక‌ని ఆయ‌న నోరు మెద‌ప‌డం లేదు. ఇప్పుడిదే చ‌ర్చ‌.

16 Replies to “వైఎస్సార్ ఆత్మ మౌన‌మెందుకు?”

  1. పాపపు సొమ్ము కోసం ఈ పవిత్ర ఆత్మలు గొడవ పడటం తో పరలోకమునకు ఎగిన తండ్రి విలపించు చున్నాడు .

  2. అక్రమసంపాదనలో వాటాల తేడాతో రోడ్డెక్కిన మహా కుటుంబం అని ఒక ఆర్టికల్ రాయాలి

  3. మాట్లాడిన మరియు క్షణం వివేకా కి పట్టిన గతి పడుతుందేమో అని భయం

  4. 8 ఎకరాల ఆకరమాల కోసం శిబూ సోరేన్ ను లోపలేశారు మరో 1500 ఎకరాలు భూమి ఇది. పైగా వేల కోట్ల విలువయిన సునపు రాళ్ళ నిక్షేపాలు

  5. అబద్ధం చెప్పలేక నిజం చెబితే ఎక్కడ గొడ్డలి పోటు పుడుతుందో అని భయం తో మౌనం గా ఉన్నాడు

  6. వైఎ*స్ఆర్ ఫ్యా*న్స్ అందరూ మా*డ గే లు లాగ వున్న రు.

    వైఎ*స్ఆర్ సొం*త భార్య మీద కే*సు పెట్టిన వాడిని కనీసం నో*రెత్తి అడగదర్నికి కూడా ఉ*చ్చ పో*స్టుకుంటున్నారు, ఇంకా కడ*ప రె*డ్డి జనా*లు మ*గాళ్ళు అని ఇంకోసారి చెప్పుకోకండు. ఆడొ*ల్లకి కూ*డా అం*డగా నిలబడలేని ఆ మ*గతనం ఎం*దుకురా మా*డ గూట్లే*స్.

  7. బ్లూ మీడియా ఇన్ని రాతలు రాస్తోంది. ఇంతకు ముందు కూడా వీళ్ళ మీడియా ఒక హీరో తో ఈమెకి ముడి పెట్టి రాతలు రాశారు(తరువాత మిగతా వాళ్ళు కంటిన్యూ చేశారు). కానీ టిడిపి అని గోల పెట్టారు. అసలు మొదలు పెట్టిందే జగన్ టీమ్.ఒకవేళ వీళ్ళిద్దరూ ఫ్యూచర్ లో కలిసిపోతే పచ్చ మీడియా ప్రచారం అని యే మాత్రం సిగ్గు లేకుండా రాసేస్తారు.

  8. ఎందుకు విప్పాలి నోరు…. బాత్రూంలో గొడ్డలి దాడికి గురయ్యి గుండెపోటుతో చావడానికా??? ఊరుకున్నంత ఉత్తమం లేదు…. బొడిగుండంత సుఖం లేదు అని సామెత.

Comments are closed.