భలే చిక్కాడు: జగన్ చేతిలో నిమ్మగడ్డ ‘యాప్’

నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియంతృత్వానికి తొలిసారి భారీ భంగపాటు ఎదురైంది. ఈనెల 9వ తేదీ వరకు ఎన్నికల కోసం నిమ్మగడ్డ తయారు చేయించిన ఈ-వాచ్ యాప్ వాడేందుకు వీల్లేదంటూ కోర్టు తేల్చి చెప్పింది.  Advertisement…

నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియంతృత్వానికి తొలిసారి భారీ భంగపాటు ఎదురైంది. ఈనెల 9వ తేదీ వరకు ఎన్నికల కోసం నిమ్మగడ్డ తయారు చేయించిన ఈ-వాచ్ యాప్ వాడేందుకు వీల్లేదంటూ కోర్టు తేల్చి చెప్పింది. 

ఇక్కడి వరకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. యాప్ తయారుచేయించింది నిమ్మగడ్డే అయినా, దాని పిలక మాత్రం సీఎం జగన్ చేతిలో చిక్కుకుంది. ఇప్పుడు సీఎం కనుసైగ చేస్తేనే యాప్ విడుదలవుతుంది, లేకపోతే అది ఎప్పటికీ బయటకు రాదు.

సర్టిఫికెట్ తప్పనిసరి..ఈ-వాచ్ యాప్ కు సెక్యూరిటీ ఆడిట్ సర్టిఫికేషన్ తప్పనిసరి అని కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో వ్యవహారం మెలికపడింది. ఏపీ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) సంస్థ ఈ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. 

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సదరు సంస్థ అనుమతి ఇస్తుందని చెప్పలేం. ఒకవేళ ఇచ్చినా.. సెక్యూరిటీ పరంగా మరింత మెరుగు పరచాలని ఓ కొర్రీవేస్తే చాలు నిమ్మగడ్డ దిగిపోయినా యాప్ కి దిక్కూ మొక్కూ ఉండదు.

వాస్తవంగా యాప్ కి సర్టిఫికెట్ ఇవ్వడానికి 5 రోజుల సమయం పడుతుంది. ఈనెల 4న ఈ సర్టిఫికెట్ కోసం ఈసీ నుంచి దరఖాస్తు వెళ్లింది. అంటే 9వతేదీ వరకు అనుమతి రాదు, ఆ తర్వాత అనుమతి ఇవ్వాలా లేదా అనేది ఏపీటీఎస్ సంస్థ ఇష్టం. అందుకే ఇప్పుడు నిమ్మగడ్డ తెగ టెన్షన్ పడిపోతున్నారు. కోర్టులో ఎదురు దెబ్బ తగలడం ఒక కారణం అయితే.. తన జుట్టు జగన్ చేతిలో చిక్కడం మరో కారణం.

ఇక ఎస్ఈసీ సొంతగా ప్రైవేటు యాప్ తీసుకురావడంపై హైకోర్టులో మూడు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిఘా యాప్ ని ఎందుకు ఉపయోగించడంలేదంటూ కోర్టు నిమ్మగడ్డ తరపు లాయర్ ని ప్రశ్నించింది. ప్రభుత్వ యాప్ లపై ఆధారపడకుండా.. సొంతగా యాప్ లు రూపొందించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రోత్సహించిందని లాజిక్ లేకుండా సమాధానమిచ్చారు లాయర్. 

ఆరేడు నెలల నుంచి ఈ యాప్ పై కసరత్తు చేస్తున్నట్టు కూడా చెప్పారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘంతో ఎస్ఈసీ జరిపిన సంప్రదింపుల వివరాలను సీల్డ్ కవర్లో కోర్టు ముందుంచుతామని చెప్పగా ధర్మాసనం అందుకు నిరాకరించినట్టు సమాచారం.

మొత్తమ్మీద యాప్ తో హడావిడి చేద్దామనుకున్న నిమ్మగడ్డ మాస్టర్ ప్లాన్ కు కోర్టు చెక్ పెట్టింది. అదే సమయంలో అసలు యాప్ కే అనుమతి లేకుండా నిమ్మగడ్డకు భారీ షాక్ ఇవ్వబోతోంది ప్రభుత్వం. ఇప్పటివరకూ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెడుతున్న నిమ్మగడ్డకు.. ఇప్పుడీ యాప్ తో బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్టేనని అంటున్నారు.

మెగాఫ్యామిలీ మొత్తానికి నచ్చేసింది

గెట‌ప్ శీను యాక్టింగ్ సినిమాకే హైలెట్