వామ్మో.. నిమ్మగడ్డకు ఇంత కడుపుమంటా..?

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రతి విషయంలో ప్రభుత్వానికి అడ్డుపడుతుంటే.. అందరూ ఏమో అనుకున్నారు. తనని పదవి నుంచి దింపేసి.. రిటైర్ట్ జడ్జి కనగరాజ్ కి పదవి ఇచ్చారనే ఆక్రోశం అయనలో ఎంతో కొంత ఉండొచ్చని…

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రతి విషయంలో ప్రభుత్వానికి అడ్డుపడుతుంటే.. అందరూ ఏమో అనుకున్నారు. తనని పదవి నుంచి దింపేసి.. రిటైర్ట్ జడ్జి కనగరాజ్ కి పదవి ఇచ్చారనే ఆక్రోశం అయనలో ఎంతో కొంత ఉండొచ్చని భావించారు. కానీ ఆయనలో కడుపుమంట ఓ రేంజ్ లో ఉందనే విషయం రోజులు గడిచేకొద్దీ బయటపడుతోంది.

చిత్తూరు, గుంటూరు జిల్లాల ఏకగ్రీవాలను నిలిపివేయడంతో ఇది పరాకాష్టకు చేరుకుంది అనుకుంటే.. అంతకు మించి అన్నట్టుగా రేషన్ వాహనాల రంగులు మార్చాలంటూ నిమ్మగడ్డ ఆదేశాలిచ్చారు. ఇంటి వద్దకు రేషన్ పంపిణీ గతంలోనే ప్రారంభమైందని, పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా దాన్ని ఆపడం సరికాదనేది ప్రభుత్వం వాదన. దీనిపై ఎస్ఈసీని సంప్రదించాలని కోర్టు సూచించడంతో.. ఇక నిమ్మగడ్డ ఎక్కడలేని వేషాలు వేయడం  మొదలుపెట్టారు.

ఆ ట్రక్కులపై ఉన్న రంగులు నిమ్మగడ్డకు నచ్చలేదట, రంగులు మార్చి తీసుకొస్తే అప్పుడాయన పరిశీలించి ఆలోచిస్తారట. కొత్తగా వేయాల్సిన రంగులేవో తాను చెప్పరట, వైసీపీ రంగులు కాకుండా తటస్థ రంగులు వేసుకోవాలట. ఇలా చినరాయుడు నిమ్మగడ్డ తన తీర్పునిచ్చారు.

కోర్టు అనుమతిస్తే, వాహనాలలో సరకులు పంపిణీ చేయాలనే ఉద్దేశంతోటే.. గ్రామాల్లో రేషన్ పంపిణీ ఇంకా మొదలు పెట్టలేదు. ఇప్పటికే వారం గడిచిపోయింది, ఇంకా నిమ్మగడ్డ మీనమేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే గ్రామాల్లో ఇబ్బంది ఎదురవుతుంది. ఈలోగా రంగులు మార్చడం, అవి అయ్యగారికి నచ్చడం, ఒకవేళ నచ్చకపోతే.. తీసుకుపోయి మళ్లీ రంగులేసుకు రండి అంటే అది మరీ ఇబ్బంది.

ఇదంతా జరిగేలోపు ఎన్నికలైపోతాయి, కోడ్ మారిపోతుంది. ఇంతోటిదానికి రంగులు మార్చడం ఎందుకు, వాటిని ఎండబెట్టడం ఎందుకు? అంటే.. నేరుగా వద్దు అని చెప్పకుండా పరోక్షంగా రంగుల పేరుతో నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. సరిగ్గా 20రోజులు కూడా లేని కోడ్ కోసం లక్షల రూపాయలు వృథా చేయాలని పరోక్షంగా నిమ్మగడ్డ చెప్పడం ఎంతవరకు సమంజసం.

పోనీ తనకు నచ్చకపోతే ఈ సారికింతే అని చెప్పేసేయొచ్చు కదా? అలా చెప్తే ప్రభుత్వం తనపై మరోసారి కోర్టుకెక్కుతుందోమోనని నిమ్మగడ్డకు భయం. ఇప్పటికే యాప్ విషయంలో బాగా తలంటించుకున్న ఆయన, ఈసారి తెలివిగా రంగుల పేరు చెప్పి తప్పించుకుంటున్నారు. 

అంతే కాదు, వైఎస్ఆర్, జగన్ బొమ్మలు, నవరత్నాల లోగో కూడా తీసేయాలట. కడుపులో ఇంత కుట్ర పెట్టుకుని బయటకు నీతి సూత్రాలు వల్లెవేస్తూ తీర్థయాత్రలు చేస్తున్న నిమ్మగడ్డను చూస్తుంటే.. చంద్రబాబు నక్కజిత్తులు కూడా ఆయన ముందు బలాదూర్ అని చెప్పక తప్పదు.

రేషన్ వాహనాలను అడ్డు పెట్టుకుని పనిలో పనిగా సీఎం జగన్ పై కూడా విమర్శలు సంధించారు నిమ్మగడ్డ. పంచాయతీ ఎన్నికలు ఆపేయాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ, డివిజనల్ బెంచ్ జనవరి 21న తీర్పు ఇచ్చిందని, అప్పటినుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినట్టేనని చెప్పారు నిమ్మగడ్డ.

ఆ విషయం తెలిసి కూడా సీఎం జగన్ అదే రోజు ఇంటి వద్దకే రేషన్ పథకాన్ని ప్రారంభించి, వాహనాలకు జెండా ఊపారని అన్నారు. సీఎం జగన్ కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టేనని పరోక్షంగా దెప్పిపొడిచారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ తనలోని అపరిచితుడ్ని తట్టి నిద్రలేపుతున్నారు నిమ్మగడ్డ. 

మెగాఫ్యామిలీ మొత్తానికి నచ్చేసింది

గెట‌ప్ శీను యాక్టింగ్ సినిమాకే హైలెట్