2 వారాలు.. 400 బాంబ్ బెదిరింపులు

భారతీయ విమానయాన సంస్థల ప్రతిష్ఠ దిగజారింది. వరుసగా బాంబ్ బెదిరింపులు వస్తున్నప్పటికీ ఏం చేయలేకపోతోంది. విమానాల్ని అత్యవసరంగా ల్యాండ్ చేయడం కామన్ అయిపోయింది. ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయల నష్టం వచ్చింది. Advertisement అయితే…

భారతీయ విమానయాన సంస్థల ప్రతిష్ఠ దిగజారింది. వరుసగా బాంబ్ బెదిరింపులు వస్తున్నప్పటికీ ఏం చేయలేకపోతోంది. విమానాల్ని అత్యవసరంగా ల్యాండ్ చేయడం కామన్ అయిపోయింది. ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయల నష్టం వచ్చింది.

అయితే ఇక్కడ చూడాల్సింది కేవలం నష్టం మాత్రమే కాదు, అంతర్జాతీయంగా ఇండియన్ ఎయిర్ లైన్స్ పరువు పోతోంది. భారతీయ విమానాలు ఎక్కాలంటేనే వెనకడుగు వేస్తున్నారు ప్రయాణికులు.

గడిచిన 2 వారాల్లో భారతీయ విమానాలకు 400 బాంబ్ బెదిరింపులు వచ్చాయంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం, నిఘా సంస్థలు ఏం చేయలేకపోతున్నాయి.

నిన్నటికినిన్న ఏకంగా 62 విమానాలకు బాంబ్ బెదిరింపులొచ్చాయి. వీటిలో ఎయిరిండియా విమానాలు 21, ఇండిగో విమానాలు 21, విస్తారా విమానాలు 20 ఉన్నాయి. ఎక్కువగా బాంబ్ బెదిరింపు ఈ-మెయిల్స్ లండన్, జర్మనీ నుంచి వస్తున్నట్టు గుర్తిస్తున్నప్పటికీ చర్యలు మాత్రం తీసుకోలేకపోతున్నారు.

ఇప్పటివరకు వచ్చిన బాంబ్ బెదిరింపులన్నీ ఫేక్. అలా అని వాటిని తేలిగ్గా తీసుకోలేరు. అందులో నిజమైన బెదిరింపు లేదా సమాచారం ఒక్కటి ఉన్నప్పటికీ ప్రమాదం తీవ్రస్థాయిలో ఉంటుంది. అందుకే అధికారుల్లో ఈ ఉరుకులు పరుగులు.

ఇప్పటికే ప్రయాణికులతో పాటు, విమానయాన గ్రౌండ్ సిబ్బంది అలసిపోయారు. దేశంలోని అన్ని ముఖ్యమైన విమానాశ్రయాల్లో సిబ్బంది 14 గంటలకు మించి పనిచేస్తున్నారు. బాంబ్ బెదిరింపులతో తనిఖీలు ముమ్మరం చేయాల్సి రావడంతో సిబ్బంది సరిపోవడం లేదు. అటు ఆన్-ఎయిర్ క్రూ కూడా అవస్థలు పడుతున్నారు.

బెదిరింపుల వెనక వ్యక్తుల్ని గుర్తించడంలో అధికారులు ఇప్పటివరకు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. విమానాశ్రయ భద్రత, సేవలకు అంతరాయం కలిగించే వాళ్లకు, బెదిరింపులకు పాల్పడే వారికి గరిష్టంగా జీవిత ఖైదు విధిస్తామని హెచ్చరిస్తున్నప్పటికీ, ఈ-మెయిల్స్ ఆగకపోవడం గమనార్హం.

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థల్లో భారత విమానయాన రంగం కూడా ఒకటి. గతేడాది 150 మిలియన్లకు పైగా ప్రయాణికులు దేశీయంగా ప్రయాణించారు. 150 విమానాశ్రయాల నుంచి 3 వేలకు పైగా విమానాలు ప్రతి రోజూ దేశంలో ప్రయాణాలు సాగిస్తున్నాయి.

370 శాతం వృద్ధి చెందడానికి అత్యధిక అవకాశాలున్న ఏకైక రంగంగా విమానయాన రంగం కొనసాగుతోంది. ఇలాంటి రంగాన్ని అప్రతిష్టపాలు చేయడానికే ఈ బాంబ్ బెదిరింపుల పరంపర కొనసాగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

7 Replies to “2 వారాలు.. 400 బాంబ్ బెదిరింపులు”

  1. పాకిస్థాన్ సపోర్ట్ తో కెనడా, యుకె లోని ఖలిస్టాన్ వాళ్ళు టెక్నాలజీ ముసుగులో దొరక్కుండా చేస్తున్న అరాచకం.

    1. ఇస్లాం కి వ్యతిరేఖంగా పుట్టిందే శిక్ఖు మతం.

      సిక్కు మతం ఆది గురువులు ఇస్లాం చేతిలో తమ ప్రాణాలు కోల్పోయారు.

      ఇప్పుడు ఆ ఖలిస్తన్ వాళ్ళు వెళ్లి ఆ పాకిస్తాన్ వాళ్ళ కింద బానిస లుగా తయారు అయ్యారు.

      సిక్కు మతానికి అవమానం.

Comments are closed.