హైదరాబాద్ లోని బండ్లగూడ సన్ సిటీ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు ఓవర్ స్పీడ్ తో మార్నింగ్ వాకర్స్ మీదికి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు మహిళలు, చిన్నారి మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కాగా మృతులంతా బండ్లగూడ లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.