చేతకాని మాటలతో వంచిస్తే ప్రజలు ఊరుకుంటారా?

చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఇచ్చే హామీలకు ఆచరణలో ఆయన పాటించే పద్ధతులకు పరిపాలనకు పొంతన ఉండనే ఉండదని జగన్మోహన్ రెడ్డి ప్రచార సమయంలో నెత్తీ నోరూ మొత్తుకుని చెప్పారు. అబద్ధపు హామీలు చెబితే తాను…

చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఇచ్చే హామీలకు ఆచరణలో ఆయన పాటించే పద్ధతులకు పరిపాలనకు పొంతన ఉండనే ఉండదని జగన్మోహన్ రెడ్డి ప్రచార సమయంలో నెత్తీ నోరూ మొత్తుకుని చెప్పారు. అబద్ధపు హామీలు చెబితే తాను మళ్లీ ముఖ్యమంత్రిని కాగలను గానీ.. ప్రజలను మోసం చేయడం తనకు ఇష్టం లేదని ఆయన ముందే అన్నారు.

కానీ.. ప్రజలకు ఆకర్షణీయ హామీలు మాత్రమే నచ్చాయి. వాస్తవాలు వారికి రుచించలేదు. చంద్రబాబు చేతికి అధికారం అప్పగించారు. అమలు చేయకుండా పెండింగులో పెట్టిన ఇతర హామీల సంగతి మొత్తం పక్కన పెట్టినా సరే.. విద్యుత్తు చార్జీలను పెంచడం అనేది చంద్రబాబు ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్యగా ప్రజలు ఈసడించుకుంటున్నారు.

చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో విద్యుత్తు చార్జీల గురించి మోసపూరితమైన హామీ ఇచ్చారు. తమను గెలిపిస్తే రాబోయే అయిదేళ్లపాటూ చార్జీలు పెంచబోమని అన్నారు. పైపెచ్చు.. వీలైతే జగన్ పెంచిన చార్జీలు తగ్గిస్తాం అని కూడా ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా పేర్కొన్నారు. విద్యుత్తు చార్జీలకు సంబంధించిన వ్యవహారం అనేది ధనికపేద కులమతాల తేడాల్లేకుండా ప్రతి ఒక్కరి జీవితాల మీద ప్రభావం చూపించే అంశం కాబట్టి.. ప్రజలను అలా మోసం చేయగలనని అనుకున్నారు. దానికి తగ్గట్టే ప్రజలు కూడా నమ్మారు.

తీరా గెలిచిన తర్వాత నాలుగు నెలలు గడిచే సరికే విద్యుత్తు చార్జీల పెంపు పేరుతో ప్రజల నడ్డి విరిచేలా వడ్డించారు. మాట తప్పడం ఒక దుర్మార్గం అయితే.. ఈ చార్జీల పెంపు అనేది జగన్ పరిపాలన నాటి అసమర్థత పుణ్యమే అని బుకాయించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఒకవేళ ఆయన అందించినది అసమర్థ పాలనే అని అనుకుందాం. దానిని చక్కదిద్దగల సమర్థుడు అనే భ్రమతోనే కదా ప్రజలు అధికారం అప్పజెప్పారు. మళ్లీ జగన్ మీద నెపం పెట్టి.. చార్జీలు పెంచితే ఎలా అని ప్రజలు ఆగ్రహిస్తున్నారు. హామీల్లో చెప్పినట్టు మందు బాబుల కోసం.. మద్యం ధర తగ్గించామని డప్పు కొట్టుకుంటున్న సర్కారు… సార్వజనీనంగా అందరికీ ఉపయోగపడేలా విద్యుత్తు చార్జీలు తగ్గించలేకపోవడం అసమర్థత కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఇంకా జగన్ మీద కారణాలు చెబుతూ.. చార్జీలు పెంచడం అనేది కేవలం చేతకాని మాటలు మాత్రమే అని వ్యాఖ్యానిస్తున్నారు.

అయిదేళ్లు పాటూ చార్జీలు పెంచబోం అనే మాటతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అయిదు నెలలైనా గడవక ముందే పెంచారు. ఇప్పుడంటే జగన్ ను బూచిగా చూపిస్తున్నారు.. కనీసం మిగిలిన నాలుగున్నరేళ్ల పాటూ విద్యుత్తు చార్జీలు పెంచకుండా పరిపాలన సాగిస్తాం అనే మాట చెప్పగల ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

26 Replies to “చేతకాని మాటలతో వంచిస్తే ప్రజలు ఊరుకుంటారా?”

  1. నువ్వు నెత్తి నోరు బాడుకొని ఇలాంటి ఆర్టికల్స్ ఎన్ని రాసినా ప్రజలు పట్టించుకోరు

  2. సీబీఎన్ ది మనసు బలం, జగన్ ది డబ్బు మధ బలం. ఎపుడూ కూడా మనసు పెట్టి చేసే వాళ్ళు బలవంతులు ప్రయోజకులు, కేవలం డబ్బు కోసం చేసే వాళ్ళు అప్రయోజకులు. ఎవరు ఏంటో ప్రజలకు బాగా తెలుసు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడమకా జీఏ.

    1. హహహ మరింకె గట్టిగా వాయించడానికి ఆన్న అసెంబ్లీ కు వస్తుడన్నమాట

        1. హహహ రాకుండా ఉండడానికి అన్న డైవర్షన్ టాపిక్ వేతుకోక పోతే చాలు మాకు

          1. మామని ఏంటి మన పార్టీ లో పతివ్రత అయిన lk పార్వతి నీ మరియు జంట తోడేళ్ళు అయినా జగ్గ అండ్ కచ్రను కూడా

  3. 99 % హామీలు అమలు చేసేసిన, ప్రతి ఇంటికి మంచి చేసేసిన, మేనిఫెస్టో మొత్తం అమలు చేసేసిన , అన్న నెత్తి నోరు కొట్టుకుని బాబుని నమ్మదు అన్నకూడా, జనాలు మా అన్నకి ఇచ్చింది పదకొండు .. ఎందుకో ఇంకా తెలియలేదా మీకు ..పథకాలే పాలనా కాదు అని అర్ధం తమరికి గని అన్నకి గని అవ్వదు .. మీరు మారారు .. మీకు మల్లి అధికారము రాదు ..

Comments are closed.