కొన్ని రోజుల కిందటి సంగతి. తను నిర్మిస్తూ నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమాకు సెన్సార్ లైన్ క్లియర్ అయిందని, సర్టిఫికేట్ కూడా వచ్చిందని ఘనంగా ప్రటించింది నటి కమ్ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్. త్వరలోనే ఓ మంచి డేట్ ఫిక్స్ చేసి సినిమా విడుదల తేదీని ప్రకటిస్తానని చెప్పుకొచ్చింది.
ఆమె ఈ మాట చెప్పి వారాలు గడుస్తున్నప్పటికీ ‘ఎమర్జెన్సీ’ సినిమాకు విడుదల తేదీ లాక్ అవ్వలేదు. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయినప్పటికీ సినిమాకు ఏంటి అడ్డంకి? నిజానికి అసలైన సెన్సార్ ఇంకోటి ఉంది. అదే కేంద్ర ప్రభుత్వం.
ప్రస్తుతం కేంద్రంలో తన పార్టీనే అధికారంలో ఉంది కాబట్టి కంగనా సినిమాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అంతా భావిస్తున్నారు. కానీ అసలు సమస్య అక్కడే ఉంది. సిసలైన సెన్సార్ బోర్డు గా వ్యవహరిస్తోంది బీజేపీ సర్కారు. పార్టీ అనుమతి లేనిదే కంగనా తన సినిమాను రిలీజ్ చేయలేని పరిస్థితి.
భారత్-కెనడా సంబంధాల గురించి అందరికీ తెలిసిందే. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కెనడాలో ఎక్కువగా నివశిస్తున్న సిక్కుల ఓట్ల కోసం ఆ దేశ అధికార పార్టీ రాజకీయాలు చేస్తోంది. భారత్ ను రెచ్చగొడుతోంది. ఖలిస్తాన్ ఉద్యమానికి పరోక్షంగా మద్దతిస్తోంది. ఇది భారత్ కు నచ్చడం లేదు, గట్టిగా తిప్పికొడుతోంది.
ఇలాంటి టైమ్ లో సిక్కులు, ఇందిరాగాంధీ హత్య అంశాలతో తెరకెక్కిన ఎమర్జెన్సీ సినిమాను విడుదల చేస్తే మరిన్ని చిక్కులు వస్తాయని బీజేపీ సర్కారు భావిస్తోంది. అందుకే కంగనా సినిమాకు లైన్ క్లియర్ చేయడం లేదు. ఇప్పటికే అప్పులు పాలయ్యానని చెప్పుకుంటున్న కంగనా, ఈ సినిమాను ఇంకెన్నాళ్లిలా మోస్తుందో చూడాలి.
Call boy jobs available 9989793850
vc estanu 9380537747
Movie ni release cheyandi