నాగవంశీ- ఒకే ఏడాది.. రెండు సార్లు

పరిస్థితి చూస్తుంటే నాగవంశీ సినిమాల మీద చిన్న సినిమాలు వేసి, మంచి హంగామా చేసి విజ‌యం దిశగా నడవడం అనేది కూడ ఓ ఫార్ములా గా మారుతుందేమో?

నిర్మాత నాగవంశీ 2024 లో రెండు సార్లు ఒకే తరహా సమస్య ఎదుర్కొన్నారు. నిర్మాత దిల్ రాజు తన విషయంలో కొన్ని అపోహలకు గురవుతుంటారు. తాను పెద్ద సెలబ్రిటీ, ఇండస్ట్రీలో కింగ్ పిన్. అంటే పళ్లున్న చెట్టు.. అందుకే అన్ని విషయాల్లో తననే టార్గెట్ చేస్తుంటారు అని అనుకుంటూ వుంటారు.

నిజానికి ఇండస్ట్రీలో ఓపెన్ గానో, తెర వెనుకో, సోషల్ మీడియాలోనో ఈ ఏడాది ఎక్కువగా టార్గెట్ అయినది సితార సంస్ధ నాగవంశీ. తెలిసో, తెలియకో, కావాలనో, అనుకోకుండానో నాగవంశీ మాట్లాడే మాటలు వైరల్ అవుతున్నాయి. ఇచ్చే ఇంటర్వూలు, మీడియా మీట్ లు హడావుడిగా మారుతున్నాయి. ఈ విషయంలో దిల్ రాజు వెనుక బడినట్లే.

ఈ ఏడాది అరంభంలో గుంటూరుకారం, హనుమాన్ సినిమాలు ఢీ కొన్నాయి. నిజానికి నాగవంశీ నిర్మాతగా గుంటూరు కారం సినిమాను బయ్యర్ లకు ఇచ్చేసారు. బయ్యర్లు అంతా కాకలు తీరిన వాళ్లు. ఏపీలో కూడా అంతే. కానీ హనుమాన్ కు తక్కువ థియేటర్లు దొరకడానికి, గుంటూరు కారం సినిమాకు ఎక్కువ థియేటర్లు దొరకడానికి నాగవంశీ టార్గెట్ అయ్యారు. సోషల్ మీడియా అంతా చిన్న సినిమా హనుమాన్ వెనుక పడింది. హనుమాన్ కు బోలెడు సింపతీ జ‌నరేట్ అయింది. అదే టైమ్ లో నాగవంశీ ఖాతాలో బోలెడు నెగిటివిటీ పడింది. అయితే గుంటూరు కారం సినిమాకు నష్టం ఏమీ రాలేదు కానీ గడబిడ అయితే జ‌రిగింది.

ఇది జ‌రిగిన పదకొండ నెలలకు మళ్లీ నాగవంశీ నిర్మాతగా లక్కీ భాస్కర్ సినిమా వచ్చింది. చిన్న సినిమా సినిమా కూడా విడుదలైంది. మళ్లీ సీన్ రిపీట్. ఈసారి నాగవంశీని ఎవరూ అంత టార్గెట్ చేయలేదు. హీరో కిరణ్ అబ్బవరం వైపు నుంచి కూడా అలాంటిది ఏమీ లేదు. కానీ కిరణ్ బాధలు, అవేదనలు విని క సినిమాకు సింపతీ జ‌నరేట్ అయింది. మీడియా అడగడంతో తనకు కిరణ్ తో ఏముంటుంది అని నాగవంశీ, తనకు వంశీతో ఏముంటుందని కిరణ్ అనాల్సి వచ్చింది. అ విధంగా లేని యుద్దంలోకి నాగవంశీ ఎంటర్ అయిపోవాల్సి వచ్చింది.

ఈ పరిస్థితి చూస్తుంటే నాగవంశీ సినిమాల మీద చిన్న సినిమాలు వేసి, మంచి హంగామా చేసి విజ‌యం దిశగా నడవడం అనేది కూడ ఓ ఫార్ములా గా మారుతుందేమో?

6 Replies to “నాగవంశీ- ఒకే ఏడాది.. రెండు సార్లు”

Comments are closed.