కొన్ని రోజుల కిందటి సంగతి.. హైడ్రా రాకతో నాగార్జున ఎంతో ఇష్టపడి నిర్మించుకున్న ఎన్-కన్వెన్షన్ కుప్పకూలింది. దానిపై ఇంకా కోర్టు కేసులు నడుస్తున్నాయి. అయితే అదే టైమ్ లో నాగార్జునకు చెందిన ఓ జ్ఞాపకం కూడా మాయమైంది.
నాగార్జునకు మొక్కలంటే చాలా ఇష్టం. ఓసారి రాజమండ్రి షూటింగ్ కు వెళ్లినప్పుడు ఓ మర్రి మొక్క ఆయన్ను ఎంతగానో ఆకర్షించింది. ఎంతో ఇష్టంగా దాన్ని తీసుకొచ్చి ఎన్-కన్వెన్షన్ వద్ద నాటాడు. కూల్చివేతల్లో భాగంగా ఆ మర్రి చెట్టు కూడా దెబ్బతింది.
కేవలం ఈ చెట్టు మాత్రమే కాదు, కన్వెన్షన్ చుట్టూ నాగార్జునకు చాలా జ్ఞాపకాలున్నాయి. అవన్నీ ఎప్పుడు తిరిగొస్తాయో ఆయనే చెప్పలేకపోతున్నాడు. ఇప్పుడు ఎన్-కన్వెన్షన్ అంశం తెరపైకి రావడానికి మరో కారణం కూడా ఉంది.
నాగచైతన్య-శోభిత పెళ్లికి రెడీ అవుతున్నారు. డిసెంబర్ లో పెళ్లి పెట్టుకున్నారు. ముందుగా డెస్టినేషన్ వెడ్డింగ్ అనుకున్నారు. ఆ ఆలోచనను విరమించుకొని రాజస్థాన్ లోని ఓ మంచి ప్యాలెస్ లో పెళ్లి అనుకున్నారు.
ఇప్పుడు ఆ ప్లాన్ నుంచి కూడా బయటకొచ్చి హైదరాబాద్ లోనే కొడుకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు నాగార్జున. ఎన్-కన్వెన్షన్ అందుబాటులో ఉంటే మరో ఆలోచన లేకుండా చైతూ-శోభిత పెళ్లి అక్కడే జరిగి ఉండేది. కానీ అదిప్పుడు లేదు. చైతూ పెళ్లి హైదరాబాద్ లో అనగానే ఇలా ఎన్-కన్వెన్షన్ మేటర్ మరోసారి తెరపైకొచ్చింది.
తాజా సమాచారం ప్రకారం, నాగచైతన్య-శోభిత పెళ్లిని అన్నపూర్ణ స్టుడియోస్ లో నిర్వహించాలని భావిస్తున్నారట నాగార్జున. ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి తన స్టుడియోకు మించిన వేదిక మరొకటి ఉండదనే అభిప్రాయంలో ఉన్నారు.
హాయిగా ఫలక్ నుమా ప్యాలెస్ లో చేసుకోవచ్చు కదా..
Call boy jobs available 9989793850
Call boy works 9989793850