ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా వైసీపీలో జోష్‌

ఉమ్మ‌డి చిత్తూరు వైసీపీలో ఇవాళ జోష్ క‌నిపించింది. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్య‌క్షుడిగా భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి ఆదివారం ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. త‌న గురువు ఉమ్మ‌డి చిత్తూరు వైసీపీ జిల్లా అధ్య‌క్ష బాధ్య‌త…

ఉమ్మ‌డి చిత్తూరు వైసీపీలో ఇవాళ జోష్ క‌నిపించింది. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్య‌క్షుడిగా భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి ఆదివారం ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. త‌న గురువు ఉమ్మ‌డి చిత్తూరు వైసీపీ జిల్లా అధ్య‌క్ష బాధ్య‌త స్వీక‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని శిష్యుడైన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌రరెడ్డి ఘ‌నంగా నిర్వ‌హించారు.

చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో తిరుప‌తి న‌గ‌ర స‌మీపంలోని చెన్నై-బెంగ‌ళూరు హైవేలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి వేలాదిగా వైసీపీ కార్య‌క‌ర్త‌లు త‌ర‌లి వ‌చ్చారు. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని 14 నియోజ‌క‌వ‌ర్గాల నుంచి వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు భారీగా ప్ర‌మాణ స్వీకారానికి వెళ్లారు. ఐదు నెల‌ల క్రితం సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత తీవ్ర నిరాశ‌నిస్పృహ‌ల్లో ఉన్న వైసీపీ శ్రేణుల్లో, ఇవాళ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మం జోష్ నింపింది.

మ‌రీ ముఖ్యంగా భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డికి ఉద్య‌మాల్లో ప‌ని చేసిన నేప‌థ్యం వుండ‌డంతో కూట‌మి నేత‌ల దాడుల్ని స‌మ‌ర్థ‌వంతంగా తిప్పి కొట్ట‌గ‌ల‌మ‌నే భ‌రోసా, ధైర్యం వైసీపీ శ్రేణుల్లో క‌నిపించింది. ఈ స‌మావేశంలో ప‌లువురు వైసీపీ నాయ‌కులు ప్ర‌సంగిస్తూ రానున్న రోజుల్లో చంద్ర‌బాబునాయుడు సొంత జిల్లా నుంచే ఆయ‌న ప్ర‌భుత్వంపై పోరాటానికి శ్రీ‌కారం చుడుతామ‌ని హెచ్చ‌రించారు. అలాగే 2027లో జ‌మిలి ఎన్నిక‌లు రావొచ్చ‌ని, కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు సిద్ధంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు.

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా బాధ్య‌త‌ల్ని స్వీకరించిన సంద‌ర్భంగా క‌రుణాక‌ర‌రెడ్డి మాట్లాడుతూ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పార్టీలో వ‌ర్గాల‌ను ప్రోత్స‌హించ‌న‌ని తేల్చి చెప్పారు. వైసీపీని అధికారంలోకి తెచ్చుకునేందుకు త‌లొగ్గి ప‌ని చేయ‌డానికి సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. ఇంత ఘ‌నంగా ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన ఘ‌న‌త చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డికే ద‌క్కుతుంద‌ని ఆయ‌న అన్నారు.

9 Replies to “ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా వైసీపీలో జోష్‌”

  1. పిల్లి పద్మనాభ సింహ సీన్ లాగా ఎంతో నీ పైత్యం హైప్..

    ”పోరాటానికి శ్రీకారం”

    “ఉద్యమాల్లో పనిచేసిన నేపద్యం”

    .

    నీ బండ బడ..

Comments are closed.