ఇక నెట్ ఫ్లిక్ ఒరిజినల్స్!

హాట్ స్టార్ ఒరిజినల్స్ చూసాం.. అమెజాన్ ఒరిజినల్స్ చూసాం. ఇప్పుడు టాలీవుడ్ జ‌నాలకు, క్రియేటర్లకు మంచి చాన్స్ వచ్చింది. థియేటర్ కు కాకుండా డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ కు తమ టాలెంట్ చూపించి,…

హాట్ స్టార్ ఒరిజినల్స్ చూసాం.. అమెజాన్ ఒరిజినల్స్ చూసాం. ఇప్పుడు టాలీవుడ్ జ‌నాలకు, క్రియేటర్లకు మంచి చాన్స్ వచ్చింది. థియేటర్ కు కాకుండా డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ కు తమ టాలెంట్ చూపించి, తమ కంటెంట్ అందించవచ్చు. ఇప్పటికే ఈ మేరకు టాలీవుడ్ సంస్థలతో నెట్ ఫ్లిక్స్ చర్చలు ప్రారంభించింది. అగ్రిమెంట్లు చేసుకుంటోంది.

కొన్ని అగ్రిమెంట్ లను డైరెక్ట్ గా ఓటిటి కోసం కంటెంట్ నిర్మాణాలుగా చేసుకుంటోంది. కొన్నింటిని అటు థియేటర్.. ఇటు ఓటిటి అన్నట్లుగా అగ్రిమెంట్ లు చేసుకుంటోంది. అంటే డ్యూయల్ అగ్రిమెంట్ లు అన్న మాట. ప్రాజెక్ట్ రిపోర్ట్, కాస్టింగ్, బడ్జెట్ అన్నీ పరిశీలించి ఓ అమౌంట్ ఫిక్స్ చేస్తున్నారు. అ మేరకు తీసి ఇచ్చిన తరువాత, ఫైనల్ అవుట్ పుట్ చూసాక, థియేటర్ కు ఇవ్వాలా? లేదా డైరెక్ట్ ఓటిటి అన్నది డిసైడ్ చేసుకుంటారట.

ఇలాంటి అగ్రిమెంట్ లతో ఇప్పటికే ఒకటి రెండు ప్రాజెక్టులు ఓకె అయ్యాయి టాలీవుడ్ లో. సరైన కంటెంట్, ప్రపోజ‌ల్స్ వుంటే నెట్ ఫ్లిక్స్ ఓరిజినల్స్ అన్నది మన నిర్మాతలకు, క్రియేటర్లకు ఇప్పుడు ఓ మంచి అప్షన్. తెర మీదకు తెస్తే చూస్తారో చూడరో, అలాగే లెంగ్త్ ఎక్కువవుతుందేమో ఇలాంటి సందేహాలతో మంచి కంటెంట్ లు పక్కన పెట్టకుండా నెట్ ఫ్లిక్స్ ను కాంటాక్ట్ చేయచ్చు.

3 Replies to “ఇక నెట్ ఫ్లిక్ ఒరిజినల్స్!”

Comments are closed.