మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఏ3 నిందితుడైన గజ్జల ఉమాశంకర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు షరతులు కూడా కోర్టు విధించడం గమనార్హం. వివేకా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా 2021, సెప్టెంబర్ 10న ఉమాశంకర్‌రెడ్డిని కడప కేంద్ర కారాగార గెస్ట్‌హౌస్‌లో ఉమాశంకర్‌రెడ్డిని విచారిస్తూ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇదే కేసులో ఇటీవల నిందితుడైన సునీల్‌యాదవ్‌కు బెయిల్ లభించింది. ఈ ఏడాది ఆగస్టులో ఉమాశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టి వేసింది. వివేకా హత్యకు కుట్రతో పాటు సంఘటన స్థలంలో సాక్ష్యాలను ధ్వంసం చేశాడనే ఆరోపణలు ఉమాశంకర్‌రెడ్డిపై ఉన్నాయి.
సీబీఐ కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో అనంతరం అతను హైకోర్టును ఆశ్రయించాడు. తాజాగా ఉమాశంకర్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. ప్రతి శనివారం పులివెందుల సీఐ ఎదుట హాజరు కావాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
ప్రస్తుతం హైదరాబాద్ చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉమాశంకర్‌రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. పులివెందులలో ఇతను పాల వ్యాపారి. బెయిల్ మంజూరైన నేపథ్యంలో జైలు నుంచి విడుదల కానున్నాడు. ఇప్పటికే బెయిల్‌పై వచ్చిన సునీల్ యాదవ్ పలు యూట్యూబ్ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అప్రూవర్‌గా మారిన దస్తగిరి గురించి ప్రస్తావించడం మినహా, చాలా విషయాలు అతను మాట్లాడుతున్నాడు.
vc estanu 9380537747