మ‌హారాష్ట్ర‌లో దూసుకెళుతున్న ఎన్డీఏ

మ‌హారాష్ట్ర‌లో ఎన్డీఏ కూట‌మి దూసుకెళుతోంది. మొత్తం 288 స్థానాల‌కు గాను ప్ర‌స్తుతానికి 210కి పైగా స్థానాల్లో ఎన్డీఏ అభ్య‌ర్థులు ఆధిక్య‌తలో ఉండ‌డం విశేషం.

మ‌హారాష్ట్ర‌లో ఎన్డీఏ కూట‌మి దూసుకెళుతోంది. మొత్తం 288 స్థానాల‌కు గాను ప్ర‌స్తుతానికి 210కి పైగా స్థానాల్లో ఎన్డీఏ అభ్య‌ర్థులు ఆధిక్య‌తలో ఉండ‌డం విశేషం. ఇండియా కూట‌మి కేవ‌లం 68 స్థానాల్లో మాత్రం ఆధిక్య‌త క‌న‌బ‌రుస్తోంది.

ఇండియా కూట‌మి మ‌హారాష్ట్ర‌లో అధికారంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. అందుకు త‌గ్గ‌ట్టుగా సీట్ల పంపిణీ, ప్ర‌చారం జ‌రిగింది. మ‌హారాష్ట్ర‌లో అధికార మార్పిడికి సంబంధించి అనేక రాజ‌కీయ ప‌రిణామాలు అంత‌కు ముందు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఎంపీ ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మి మంచి ఫ‌లితాలు సాధించ‌డంతో మ‌న‌దే అధికారం అనే ధీమా క‌నిపించింది.

ఇవాళ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డ‌వుతున్నాయి. మొద‌టి రౌండ్ల‌లో హోరాహోరీ అనిపించినా, ఆ త‌ర్వాత ఎన్డీఏ కూట‌మి పూర్తిస్థాయిలో ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించ‌డం గ‌మ‌నార్హం. మ్యాజిక్ ఫిగ‌ర్ 145 ఎప్పుడో దాటిపోయింది. ప్ర‌స్తుతం 210కి పైగా స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్య‌త క‌న‌బ‌రుస్తుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. అధికారం మారుతుంద‌ని ఆశ‌లు పెట్టుకున్న ఇండియా కూట‌మికి ఇది చావు దెబ్బే.

ఇదే సంద‌ర్భంలో జార్ఖండ్ ఫ‌లితాలు కూడా వెలువ‌డుతున్నాయి. అక్క‌డ 81 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ్గా… ఇండియా కూట‌మి 51, ఎన్డీఏ 28 స్థానాల్లో ఆధిక్య‌త‌లో ఉన్నాయి. ఇండియా కూట‌మికి జార్ఖండ్ ఫ‌లితాలు కొంచెం ఊర‌ట ఇస్తున్నాయి. మ‌హారాష్ట్ర ఫ‌లితాలు మాత్రం తీవ్ర నిరాశ మిగిల్చుతున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

9 Replies to “మ‌హారాష్ట్ర‌లో దూసుకెళుతున్న ఎన్డీఏ”

  1. KK survey became true again…. he projected 220 seats for Mahayuti in Maharashtra exceeding all other exit polls, which was ridiculed two days ago…. In andhra he projected 160+ for NDA which became reality on June 4….

  2. మొదటి రౌండ్లలో హోరాహోరి ఉందా? నేను 9.20 నుంచి చూస్తున్నాను, ఎలక్షన్ కమిషన్ వెబ్సైటు లో అప్పటి నుంచి కూడా ఇండి కూటమి బీజేపీ కూటమి లో సగం కంటే తక్కువే ఉన్నాయి.

  3. కాంగ్రెస్ వాడి ఫోటో వెయ్యలేదు, మీరు కూడా ఫిక్స్ అయిపోయారా కాంగ్రెస్ ముక్త భారత్ కి

Comments are closed.