పుత్తాతో క‌డ‌ప రెడ్డెమ్మ ఢీ!

వైఎస్సార్ జిల్లాలో క‌డ‌ప ఎమ్మెల్యే ఆర్‌.మాధ‌వీరెడ్డి, క‌మ‌లాపురం ఎమ్మెల్యే పుత్తా చైత‌న్య‌రెడ్డి కుటుంబం మ‌ధ్య ఆధిప‌త్య న‌డుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవ‌ల అసెంబ్లీ స‌మావేశాల‌లో క‌డ‌ప న‌గ‌రంలోని బిల్డ‌ప్ ఏరియాలో మార్పు పేరుతో డీ-ఆడిక్ష‌న్…

వైఎస్సార్ జిల్లాలో క‌డ‌ప ఎమ్మెల్యే ఆర్‌.మాధ‌వీరెడ్డి, క‌మ‌లాపురం ఎమ్మెల్యే పుత్తా చైత‌న్య‌రెడ్డి కుటుంబం మ‌ధ్య ఆధిప‌త్య న‌డుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవ‌ల అసెంబ్లీ స‌మావేశాల‌లో క‌డ‌ప న‌గ‌రంలోని బిల్డ‌ప్ ఏరియాలో మార్పు పేరుతో డీ-ఆడిక్ష‌న్ సెంట‌ర్ మేడ‌పై నిర్వ‌హిస్తుంటే, దాని కింద మ‌ద్యం దుకాణం వుంద‌నే ప్ర‌స్తావ‌న మాధ‌వీరెడ్డి తీసుకొచ్చారు. దీని వెనుక క‌మ‌లాపురం ఎమ్మెల్యే వ‌ర్గీయుడి మ‌ద్యం దుకాణాన్ని లేపే ఎత్తుగ‌డ దాగి వుంద‌నే చ‌ర్చ క‌డ‌ప‌లో జ‌రుగుతోంది.

క‌డ‌ప‌లో క‌మ‌లాపురం టీడీపీ నేత పుత్తా న‌ర‌సింహారెడ్డి పెత్త‌నం ఏంట‌నేది మాధ‌వీరెడ్డి ప్ర‌శ్న‌. అయితే క‌డ‌ప‌లో పుత్తా కుటుంబానికి వ్యాపారాలున్నాయి. క‌డ‌ప‌లో మాధ‌వీరెడ్డి ఎవ‌రో ఈ మ‌ధ్య తెలుస‌ని, చాలా ఏళ్ల నుంచి తాము వ్యాపారాలు చేసుకుంటున్నామ‌నేది పుత్తా వాద‌న‌. అయితే క‌డ‌ప‌లో త‌న మాటే శిలాశాస‌నం అని మాధ‌వీరెడ్డి భావిస్తుండ‌డం వ‌ల్లే స‌మ‌స్య ఉత్ప‌న్న‌మైంద‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు.

బిల్డ‌ప్ స‌మీపంలో క‌మ‌లాపురం ఎమ్మెల్యే వ‌ర్గీయుడు మ‌ద్యం దుకాణం ఏర్పాటు చేయ‌డం ఎమ్మెల్యే మాధ‌వీరెడ్డి స‌హించ‌లేక‌పోతున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. బ‌డి, గుడి నిబంధ‌న‌ల‌ను తెర‌పైకి తీసుకొచ్చి క‌మ‌లాపురం ఎమ్మెల్యే వ‌ర్గీయుడి మ‌ద్యం దుకాణాన్ని ఉన్న చోట నుంచి, దానికి కొంచెం దూరంలో ఉన్న ప్రాంతానికి పంప‌గ‌లిగారు. అయితే అక్క‌డ కూడా లేకుండా చేసేందుకు, దుకాణం ఏర్పాటు చేసిన భ‌వ‌నానికి మున్సిప‌ల్ అనుమ‌తులు లేవంటూ, అధికారుల‌తో నోటీసుల్ని ఎమ్మెల్యే ఇప్పించారు.

కానీ భ‌వనానికి అనుమ‌తులున్నాయ‌ని సంబంధిత య‌జ‌మాని చూపారు. దీంతో క‌మ‌లాపురం టీడీపీ నేత మున్సిప‌ల్ అధికారుల్ని పిలిపించుకుని ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యార‌ని స‌మాచారం. దీంతో మ‌న‌కెందుకీ గొడ‌వ అని మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు తోక ముడిచారు. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీలోనే మ‌ద్యం దుకాణం విష‌య‌మై ప్ర‌స్తావించి, పుత్తా వ‌ర్గీయుడిని దెబ్బ‌తీసే ఎత్తుగ‌డ ఎమ్మెల్యే వేశారు. రోజురోజుకూ క‌డ‌ప ఎమ్మెల్మే, పుత్తా న‌ర‌సింహారెడ్డి మ‌ధ్య వైరం పెరుగుతోంది. చివ‌రికి ఇది ఏ మ‌లుపు తిరుగుతుందో అనే ఆందోళ‌న టీడీపీ శ్రేణుల్లో వుంది.

6 Replies to “పుత్తాతో క‌డ‌ప రెడ్డెమ్మ ఢీ!”

  1. అక్కను మన పార్టీలోకి లాగేసి, ఇద్దరికీ రాజీ చేసేస్తే అంతా సద్దుకొంటుంది.

  2. ఇలానె over action చెసి చెసి నగరి లొ ఒ అక్క సం..క నా..కిపొ..యింది

    నువ్వు కూడా అంతె

    మొగుళ్ళని ముండమొపులని చెసి రొడ్ కెక్కారు కదక్కా

Comments are closed.