అబ్బే.. ముంద‌స్తు ఎన్నిక‌లుండ‌వ్‌!

జ‌మిలి ఎన్నిక‌ల‌కు రెడీ అని ప్ర‌క‌టించిన చంద్ర‌బాబునాయుడే, ఇప్పుడు ముంద‌స్తు రావ‌ని చెప్ప‌డం విశేషం. 2027లోనే జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని వైసీపీ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తూ, ఆ మేర‌కు స‌న్న‌ద్ధం అవుతున్న సంగ‌తి…

జ‌మిలి ఎన్నిక‌ల‌కు రెడీ అని ప్ర‌క‌టించిన చంద్ర‌బాబునాయుడే, ఇప్పుడు ముంద‌స్తు రావ‌ని చెప్ప‌డం విశేషం. 2027లోనే జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని వైసీపీ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తూ, ఆ మేర‌కు స‌న్న‌ద్ధం అవుతున్న సంగ‌తి తెలిసిందే. జ‌మిలి ఎన్నిక‌ల బిల్లు పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ప్ర‌వేశ పెడ‌తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇవాళ్టి మ‌హారాష్ట్ర ఫ‌లితాల ఆధారంగా జ‌మిలి ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రుగుతాయ‌నేది ఆధార‌ప‌డి వుంటాయి.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబునాయుడు జ‌మిలి ఎన్నిక‌ల‌పై కీల‌క కామెంట్స్ చేశారు. పార్ల‌మెంట్‌, అసెంబ్లీల‌కు కేంద్రం జ‌మిలి ఎన్నిక‌లు పెట్టినా అవి షెడ్యూల్ ప్ర‌కారం 2029లోనే వ‌స్తాయ‌ని ఆయ‌న అన్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ముందుగా రావ‌ని చంద్ర‌బాబు చెప్ప‌డం వెనుక‌, త‌మ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు ధైర్యం చెప్పే ఉద్దేశం క‌నిపిస్తోంది.

ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌నే ప్ర‌చారం కూట‌మి నేత‌ల్ని భ‌య‌పెడుతోంది. దీపం వుండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవాల‌నే ఉద్దేశంతో విచ్చ‌లివిడి దోపిడీకి పాల్ప‌డుతున్నార‌నే విమ‌ర్శ లేక‌పోలేదు. అందుకే ఐదేళ్లు అధికారంలో వుంటామ‌నే భ‌రోసా క‌ల్పించ‌డానికి చంద్ర‌బాబు ముంద‌స్తు ఎన్నిక‌లు రావ‌ని చెబుతున్నారు. పార్ల‌మెంట్‌లో జ‌మిలి బిల్లు ప్ర‌వేశ పెట్ట‌డం, అనంత‌రం ఎన్నిక‌ల‌కు వెళ్లాలా? వ‌ద్దా? అనేది కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యిస్తుంది. చంద్ర‌బాబు వ్య‌తిరేకించే ప‌రిస్థితి లేదు. అయితే త‌మ పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు, శ్రేణుల్లో ఐదేళ్ల అధికారంపై భ‌రోసా నింప‌డానికి చంద్ర‌బాబు అలా మాట్లాడ‌క త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి.

21 Replies to “అబ్బే.. ముంద‌స్తు ఎన్నిక‌లుండ‌వ్‌!”

  1. ఒరేయ్.. రాజకీయాల్లో బేసిక్ తెలివి ఉన్నవాడు ఎవడైనా లెక్కలేసుకుని చెప్పగలరు.. 2027 లో జమిలి ఉండదని..

    వైసీపీ జగన్ రెడ్డి చెప్పాడని.. ఎన్నికలు వాడికోసం పెట్టేయరు .. వాడు ఎలాగూ కొండెర్రిపప్ప అయిపోయాడు.. కనీసం ఆర్టికల్ రాసే నువ్వయినా కాస్త తెలివి వాడాలి కదా..

    ….

    నిన్న గాక మొన్న మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి.. ఆ ఫలితాలు ఈ రోజే వస్తున్నాయి..

    వాటి కాలపరిమితి రెండేళ్లే అంటే.. ఆ రాష్ట్రాలు ఎందుకు ఒప్పుకొంటాయి..?

    ….

    పైగా.. నియోజకవర్గాల పునర్విభజన 2026 లో మొదలు పెడుతున్నారు.. ఆ ప్రాసెస్ మొత్తం రెండేళ్లు పడుతుంది..

    అంటే.. 2028 కి నియోజకవర్గాల పునర్విభజన కంప్లీట్ అవుతుంది..ఆ తర్వాతే .. అంటే 2029 లోనే జమిలి పెట్టగలరు..

    ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ రెడ్డి గెలిచే ప్రసక్తే లేదు.. వాడు పార్టీ ని కాపాడుకోవడం కోసం ఎదో సొల్లు వాగేసి.. బెంగుళూరు పారిపోతాడు..

    ఈసారి పులివెందుల లో గెలిచినా.. వార్తే..

    1. మీకు మన అన్న కెపాసిటీ ఇంకా తెలిసినట్టు లేదు …తిరుమల సెట్ నే వేసినవాళ్ళం ఆఫ్టర్ అల్ ఎలక్షన్స్ జరిపించుకోలేమా…మా ఓటర్లే వేరు…మా రాజ్యాంగం వేరు….మాది అంత పిచ్చోళ్లా స్వర్గం ..

      1. మీరు మమ్మల్ని బాగా తక్కువ గా అంచనా వేస్తున్నారు. మేమంటో next ఎలక్షన్స్ లో చూపిస్తాం… హమ్మా… బొత్తిగా భయం లేకుండా పోయింది మేమంటే.. రజనీ గారి అంతటి వారినే నానా మాటలు అని భయపెట్టాం… తెలుగు హీరోలను 1km నడిపించాం.. మాకు దండం పెట్టుకునేలా చేశాం. 2029 లో పవర్ లోకి వచ్చి మీ పీచమడుస్తాం.

    2. గత ప్రభుత్వం 2019-2024లో ఎవరైనా జమిలి ఎన్నికలు అంటే వారిని జోకర్ గా రాసేవారు మన GA గారు..

  2. ఇప్పుడు మారిన పరిస్తుతులని బట్టి అంటే అదానీ – జగన్ రెడ్డి కుంభకోణం తర్వాత మోడీ ఇమేజ్ మసక బారింది … సీబీన్ ఏది చెప్తే అది చేసే పరిస్థితిలో ఉంది బీజేపీ … టాపిక్ ఓవర్

  3. టీడీపీ బయపడుతోంది సరే మనకి అబిర్దులేరి ? 
    అసలు 6 నెలలు కూడా కాలేదు ప్రభుత్వ రూపం చేసి కడుపు నిండా విషం పెట్టుకుంటే ఇలాంటి రాతలే రాస్తరు

Comments are closed.