ధూమ్ ధామ్ గా స్వాగతాలు

ఎట్టకేలకు మంత్రి అయ్యారు. ఇక సొంత ఊళ్ళో హవా చూపించాలిగా. అందుకే ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన మంత్రులు ఒకటి రెండు రోజులలో తమ సొంత జిల్లాలకు రానున్నారు. వారి రాక కోసం వేయి కళ్లతో…

ఎట్టకేలకు మంత్రి అయ్యారు. ఇక సొంత ఊళ్ళో హవా చూపించాలిగా. అందుకే ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన మంత్రులు ఒకటి రెండు రోజులలో తమ సొంత జిల్లాలకు రానున్నారు. వారి రాక కోసం వేయి కళ్లతో క్యాడర్ ఎదురుచూస్తోంది. అంతే కాదు వారికి స్వాగత సత్కారాలు ఒక లెవెల్ లో ఉండాలన్నది కూడా అభిమానుల పట్టుదలగా ఉంది. 

ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే, కీలకమైన శాఖలతో విశాఖకు రానున్న గుడివాడ అమరానాధ్ కి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అనకాపల్లి అంతా గుడివాడ అంటూ ఇపుడు కలవరిస్తోంది

అలాగే మంత్రి పదవి దక్కుతుందా అన్న డౌట్లో ఉన్న బూడి ముత్యాలనాయుడుకు ఏకంగా ప్రధామైన శాఖలతో పాటు పంచాయతీ రాజ్ శాఖను ఇచ్చేశారు. దాంతో మాడుగులలో వైసీపీ జోరు మామూలుగా లేదు. మా బూడిని ఇప్పటిదాకా ఎవరూ చూడని తీరులో అదిరిపొయే లెవెల్ లో అహ్వానించి మాడుగులకు తెస్తామని అంటున్నారు.

ఇక సీనియర్ మోస్ట్ నేత ధర్మాన ప్రసాదరావు రెవిన్యూ మంత్రి అయ్యారు. ఆయన ఫ్యాన్స్ ది మూడేళ్ల కల. దాంతో ధర్మాన కోసం ఏకంగా జిల్లా మొత్తం శ్రీకాకుళం తరలివచ్చేలా ధూమ్ ధామ్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే సాలూరుకి చెందిన డిప్యూటీ సీఎం రాజన్నదొర రాక కోసం కూడా చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

మొత్తానికి వైసీపీ ఒక్కసారిగా అలెర్ట్ అయింది. పార్టీకి పూర్వం కళ వచ్చింది. ఎటు చూసినా ఒక విధంగా పండుగ వాతావరణం కనిపిస్తోంది.