మనిషి ఆశాజీవి. ఇక రాజకీయాల్లో ఉన్న వాళ్ల ఆశలు సరేసరి. ఒక్కో మెట్టు ఎదుగుతున్న కొద్ది, అందుకు తగ్గట్టుగానే కోరికలు కూడా పెరుగుతూ వుంటాయి. ఎంపీటీసీ లేదా సర్పంచ్‌గా ఎన్నికైన వ్యక్తికి కాలం గడిచేకొద్ది ఉన్నత పదవులు దక్కించుకోవాలనే ఆశ పుడుతుంది. అసలు మనిషిని నడిపించేది ఆశే. ఎంపీటీసీగా ఎన్నికైన వారు ఎంపీపీ కావాలని కోరుకుంటారు. జెడ్పీటీసీ లేదా ఎంపీపీగా ఎన్నికైన వాళ్లు, అవకాశాలు కలిసొస్తే ఎమ్మెల్యే కావాలని తహతహలాడతారు.
ఎమ్మెల్యేగా గెలిచాక అంతటితో సంతృప్తి చెందరు. కేబినెట్ పదవిని ఆశిస్తారు. మంత్రులుగా అయిన వారితో పోల్చుకుని, తానేం తక్కువా? అని ప్రశ్నించుకుంటారు. తనకు కూడా మంత్రి పదవి కావాలని అధినేతపై ఒత్తిడి చేస్తారు. కోరికలు నెరవేరకపోతే అసంతృప్తికి లోనవుతారు.
తాజాగా ఏపీలో మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ, అనంతర పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. మంత్రి పదవి రాని ప్రభుత్వ విప్, అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి ఆయన అనుచరులు వినూత్న షరతు విధించడం చర్చనీయాంశమైంది. మంత్రి పదవి రామచంద్రారెడ్డికి అనుచరులు ఓ షరతు విధించారు.
మంత్రి పదవి రాకపోవడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే నియోజకవర్గంలో అడుగు పెట్టాలనేది ఆ వినూత్న షరతు. కాపు రామచంద్రారెడ్డికి మంత్రి పదవి ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇవాళ రాయ దుర్గం బంద్‌కు వైసీపీ పిలుపు ఇవ్వడం గమనార్హం. ఈ సందర్భంగా వైసీపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం విశేషం.