రెహ్మాన్ నాకు తండ్రిలాంటి వాడు

ఏఆర్ రెహ్మాన్ నాకు తండ్రిలాంటి వారు. నా తండ్రికంటే ఆయన వయసులో కొంచెం చిన్న అంతే. రెహ్మాన్ కూతురుది నాది ఒకటే వయసు.

సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తన భార్య నుంచి విడిపోతున్నట్టు ప్రకటించిన రోజే, అతడితో కలిసి పని చేసే కళాకారిణి మోహినీ డే కూడా తన భర్తకు విడాకులిస్తున్నట్టు ప్రకటించింది.

దీంతో వీళ్లిద్దరిపై పుకార్లు మొదలయ్యాయి. వీటిని ఖండిస్తూ రెహ్మాన్, కొన్ని మీడియా సంస్థలపై లీగల్ గా చర్యలకు ఉపక్రమించాడు కూడా. అటు రెహ్మాన్ నుంచి విడిపోయిన ఆయన భార్య సైరా బాను కూడా అతడికి క్లీన్ చిట్ ఇచ్చారు.

ఇంత జరిగిన తర్వాత ఈ వ్యవహారంపై తాపీగా స్పందించింది మోహిని. రెహ్మాన్ తో తనకు ఎలాంటి సంబంధం లేదంటూనే, ఆయన తనకు తండ్రిలాంటివారని ప్రకటించింది.

“ఏఆర్ రెహ్మాన్ నాకు తండ్రిలాంటి వారు. నా తండ్రికంటే ఆయన వయసులో కొంచెం చిన్న అంతే. రెహ్మాన్ కూతురుది నాది ఒకటే వయసు. ఆయనంటే నాకు ఎంతో గౌరవం, ప్రేమ.”

రెహ్మాన్ తో తనది ఎనిమిదిన్నరేళ్ల అనుబంధమని ప్రకటించింది మోహిని. తర్వాత తను అమెరికాకు వెళ్లిపోయానని, ఇతర బ్యాండ్స్ తో కలిసి వర్క్ చేస్తున్నానని తెలిపింది. ఎప్పటికీ తనకు రెహ్మాన్ అంటే గౌరవం-ప్రేమ ఉంటాయంటోంది.

రెహ్మాన్ కు, తనకు ఇలాంటి సమయంలో ప్రైవసీ చాలా అవసరమని.. ఇలాంటి వ్యక్తిగత విషయాల్ని హైలెట్ చేయొద్దని, దయచేసి అంతా తమను అర్థం చేసుకోవాలని ఆమె కోరుతోంది.

9 Replies to “రెహ్మాన్ నాకు తండ్రిలాంటి వాడు”

  1. పంచదార నాన్న.. పటికబెల్లం నాన్న.. నాన్న లందు తీపి నాన్నలు వెరయా.. విశ్వధాబి నాన్న వినుర కన్నా…

      1. ఇద్దరూ ఒకే సారి విడాకులు ప్రకటించక పోతే ఏ అనుమానాలు ఉండేవి కావు.. అసలు ఇలా రకరకాల ప్రకటనలు.. పునః ప్రకటనలు.. ప్రతి ప్రకటనలు.. చేయకపోతే ఎవరూ పట్టించుకోరు.. ఇప్పుడు ఏదో కూడబలుక్కొని గూడుపుఠాణీ చేస్తున్న తోడు దొంగల్లా తయారైంది వ్యవహారం.. ఇది సరిపోదన్నట్టు పెళ్ళాం మళ్ళీ ముందుకొచ్చి మా ఆయన బంగారం అంటుంది…

Comments are closed.