‘సంక్రాంతి’ సినిమాకు ఇలా చేస్తే బెటరేమో!

నిర్మాత దిల్ రాజు ఈ కోణంలో ఆలోచిస్తే మంచిదేమో. సంక్రాంతికి థియేటర్లలోకి వస్తున్న 3 సినిమాలూ రాజువే.

వెంకీకి సంక్రాంతి బాక్సాఫీస్ కొత్త కాదు. ఆ మాటకొస్తే సంక్రాంతి బరిలో మంచి విజయాలందుకున్న హీరో ఇతడు. చంటి, కలిసుందాం రా, లక్ష్మి, ధర్మచక్రం, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, ఎఫ్-2.. ఇలా చెప్పుకుంటే లిస్ట్ లో చాలా చిత్రాలు కనిపిస్తాయి.

అయితే రీసెంట్ టైమ్స్ లో వెంకటేశ్ కు సంక్రాంతి హిట్ లేదు. 2019 సంక్రాంతికి ఎఫ్-2 రూపంలో సక్సెస్ కొట్టారు. ఈ ఏడాది సైంధవ్ రూపంలో పెద్ద డిజాస్టర్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా రెడీ అయ్యారు.

వెంకీ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా జనవరి 14న రిలీజ్ అవుతోంది. అనీల్ రావిపూడి అండతో ఈసారి కచ్చితంగా హిట్ కొడతానంటున్నారు వెంకటేశ్. అయితే అదంత ఈజీనా?

ఈసారి సంక్రాంతికి పోటీ మామూలుగా లేదు. 10న గేమ్ ఛేంజర్ వస్తోంది. 12న డాకూ మహారాజ్ వస్తోంది. ఈ రెండు సినిమాల తర్వాత వెంకీ మూవీ వస్తోంది. రామ్ చరణ్, బాలకృష్ణ సినిమాల పోటీని తట్టుకొని వెంకీ నిలబడాల్సి ఉంటుంది.

3 పెద్ద సినిమాల్ని భరించే సత్తా సంక్రాంతి బాక్సాఫీస్ కు ఉందనేది దిల్ రాజు లాంటి పెద్దల మాట. అది నిజమే కానీ టికెట్ రేట్లు భారీగా పెంచేస్తున్న ఈ రోజుల్లో.. సంక్రాంతి బరిలో చివరిగా వస్తున్న వెంకీ సినిమాకు భారీగా ఖర్చుపెట్టి ఎంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారనేది డౌట్.

సో.. ఇలాంటి టైమ్ లో ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేయాలంటే, టికెట్ రేట్లు పెంచకుండా సినిమాను విడుదల చేయడం ఉత్తమమైన పద్ధతి. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ కు ఎలాగూ టికెట్ రేట్లు పెంచుతారు. అదే టైమ్ లో రెగ్యులర్ టికెట్ రేట్లకే వెంకటేశ్ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తే.. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువమంది దీనివైపు వచ్చే అవకాశం ఉంది.

నిర్మాత దిల్ రాజు ఈ కోణంలో ఆలోచిస్తే మంచిదేమో. సంక్రాంతికి థియేటర్లలోకి వస్తున్న 3 సినిమాలూ రాజువే. గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో వెంకటేష్ సినిమాపై ఆయన సేఫ్ గేమ్ ఆడితే బెటరేమో. అలా కాదు, అందినకాడికి పిండుకోవాలని డిసైడ్ అయితే మాత్రం ఇక చేసేదేం లేదు, ప్రేక్షకుడి జేబుకు చిల్లు పడడం తప్ప.

14 Replies to “‘సంక్రాంతి’ సినిమాకు ఇలా చేస్తే బెటరేమో!”

      1. జనాలు ఖచ్చితంగా డబ్బు గురించి ఆలోచిస్తారు. బెటర్ మూవీ థియేటర్ లో చూస్తారు. బాలేంది ott లో చూస్తారు. ఏది బాలేకపోతే అన్నీ oot లో చూస్తారు. లేదా అసలు చూడరు

        1. నేను అనేది అదే సార్…… బాగుంటే మూడు సినిమాలు కూడా థియేటర్లో చూడొచ్చు…… మూడూ కూడా బాహుబలి లాగా, కల్కి లాగా విజువల్ వండర్ అనుకోండి తప్పకుండా థియేటర్ లోనే చూస్తారు, అదే మూడూ కూడా అంత గొప్ప సినిమాలు కావనుకోండి, ఒక్కటి కూడా థియేటర్లో చూడకపోవచ్చు

Comments are closed.