నాగచైతన్య-అఖిల్… అప్పుడు-ఇప్పుడు..!

సరిగ్గా ఇప్పుడు కూడా.. ఓవైపు నాగచైతన్య-శోభిత పెళ్లికి రెడీ అవుతున్న వేళ.. అఖిల్ ఎంగేజ్ మెంట్ విషయాన్ని నాగార్జున బయటపెట్టారు.

ఓవైపు అన్నయ్య అక్కినేని నాగచైతన్య పెళ్లికి రెడీ అవుతుంటే.. మరోవైపు తమ్ముడు అక్కినేని అఖిల్ నిశ్చితార్థం చేసుకున్నాడు. అవును.. ఎవ్వరూ ఊహించని విధంగా అఖిల్ తన ఎంగేజ్ మెంట్ విషయాన్ని ప్రకటించాడు. అటు అక్కినేని నాగార్జున కూడా ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాడు.

జైనాబ్ రౌజీ అనే అమ్మాయితో అఖిల్ ఎంగేజ్ మెంట్ జరిగింది. వీళ్లిద్దరూ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారట. ఉపాసన కొణెదల, రానా దగ్గుబాటి లాంటి చాలామంది ఇప్పటికే ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు.

మరో వారం రోజుల్లో (డిసెంబర్ 4న) నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్నాడు. ఓవైపు అంతా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారని భావిస్తున్న టైమ్ లో చిన్న కొడుక్కి ఎంగేజ్ మెంట్ పూర్తి చేశారు నాగార్జున. అయితే ఇంత సీక్రెట్ గా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో..!

సరిగ్గా కొన్నేళ్ల కిందట కూడా ఇదే విధంగా జరిగింది. ఏడేళ్ల కిందట నాగచైతన్య-సమంత పెళ్లి టైమ్ లోనే అఖిల్ కు కూడా ఎంగేజ్ మెంట్ చేశారు నాగార్జున. అయితే కొన్నాళ్లకు ఆ పెళ్లిని రద్దు చేసుకున్నారు.

సరిగ్గా ఇప్పుడు కూడా.. ఓవైపు నాగచైతన్య-శోభిత పెళ్లికి రెడీ అవుతున్న వేళ.. అఖిల్ ఎంగేజ్ మెంట్ విషయాన్ని నాగార్జున బయటపెట్టారు. సో.. వచ్చే ఏడాది అఖిల్ పెళ్లి కూడా చేయబోతున్నారన్నమాట.

4 Replies to “నాగచైతన్య-అఖిల్… అప్పుడు-ఇప్పుడు..!”

Comments are closed.