తన సినిమాను పూజకు పనికిరాని పువ్వును చేయొద్దంటూ ఇప్పటికే రిక్వెస్ట్ చేశాడు సత్యదేవ్. థియేటర్లలో ఫ్లాప్ అయి, ఓటీటీలో హిట్టయితే ఎలాంటి ఉపయోగం ఉండదని, అలాంటి సినిమాను తను పూజకు పనికిరాని పువ్వు అంటానంటూ సభాముఖంగా ప్రకటించాడు.
ఇప్పుడు తననుంచి వచ్చిన జీబ్రా సినిమాను పూజకు పనికిరాని పువ్వుగా మార్చొద్దని విజ్ఞప్తి చేస్తున్నాడు. థియేటర్లలో హిట్ కొట్టాలనే తన ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఫలించిందని చెప్పుకున్న సత్యదేవ్.. అంతా థియేటర్లకు రావాలని కోరుతున్నాడు.
“బ్లఫ్ మాస్టర్ సినిమాను మీరు థియేటర్లలో మిస్సయ్యారు. ఆ తర్వాత ఓటీటీ, యూట్యూబ్ లో చూసి చాలా మెచ్చుకున్నారు. ప్రశంసలు కురిపించారు. దయచేసి జీబ్రాకు అలా చేయొద్దు. అంతా థియేటర్లలోనే సినిమాను చూడండి.”
ఇలా తన సినిమా కోసం థియేటర్లకు రావాలని కోరుతున్నాడు సత్యదేవ్. ఇంతలా అతడు వేడుకోవడం వెనక చాలా పెద్ద కథ ఉంది. కరోనా టైమ్ లో ఓటీటీ హీరో అనిపించుకున్నాడు సత్యదేవ్. అప్పుడు ఆ ఇమేజ్ తో అతడు సంబరపడి ఉండొచ్చు కానీ ఇప్పుడు అదే ఇమేజ్ అతడ్ని ఇబ్బంది పెడుతోంది.
సత్యదేవ్ నుంచి ఓ సినిమా వస్తోందంటే, ఓటీటీలో చూద్దాం అనే ఫీలింగ్ లోకి వెళ్లిపోయారు జనం. ఆ ఫీలింగ్ ను పోగొట్టడం సత్యదేవ్ ముందున్న తక్షణ కర్తవ్యం. అందుకే ఓవైపు తన సినిమా హిట్ అంటూనే, మరోవైపు థియేటర్లకు రండి బాబూ అని వేడుకుంటున్నాడు.
సినిమా రిలీజైన వారం పది రోజులకు లేదా 2-3 వారాలకే ఓటీటీకి ఇచ్చేస్తే ఏ హీరో పరిస్థితైనా సత్యదేవ్ లా తయారవుతుంది. ఇప్పటికీ ఓ యంగ్ హీరో తనకు ఓటీటీ మార్కెట్ ఉందని, సినిమా రిలీజైన వారం రోజులకే కావాలంటే ఓటీటీకి ఇచ్చుకోవచ్చని, మంచి రేటు వస్తుందని, అదేదో పెద్ద ఘనతగా చెప్పుకుంటున్నాడు. అలాంటి హీరోలు సత్యదేవ్ ను చూసి జాగ్రత్త పడితే మంచిది.
Call boy jobs available 7997531004
Good actor …kaaalam kalasi ravali.
9380537747 వీడియో కాల్ ఇస్తాను
ఓటిటిలో చుస్తాంలే
vc available 9380537747