బంపర్ ఆఫర్ ఇస్తున్న జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీలో కొత్త మార్పులకు రెడీ అవుతున్నారు. పార్టీలో సీనియర్ల ప్లేస్ లో బాగా పనిచేసే వారికి యూత్ కి జూనియర్ నేతలకు చాన్స్ ఇస్తున్నారు. Advertisement శ్రీకాకుళం జిల్లాలోని…

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీలో కొత్త మార్పులకు రెడీ అవుతున్నారు. పార్టీలో సీనియర్ల ప్లేస్ లో బాగా పనిచేసే వారికి యూత్ కి జూనియర్ నేతలకు చాన్స్ ఇస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలసలో చింతాడ రవికుమార్ అనే యువ నేతకు చాన్స్ ఇచ్చిన జగన్ ఇపుడు అదే బాటలో మరింత మందికి పార్టీలో కీలక స్థానాలు కల్పించాలని చూస్తున్నారు.

వైసీపీకి జవసత్వాలు కల్పించడానికి యువ జనసత్వాలు ఉపయోగపడతాయని జగన్ వినూత్నంగా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

ఇటీవల జగన్ శ్రీకాకుళం జిల్లా నేతలలో నిర్వహించిన సమావేశం సందర్భంగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఫీడ్ బ్యాక్ ని తీసుకున్నారని తెలుస్తోంది.

పార్టీకి చెందిన ద్వితీయ తృతీయ నేతలతో ఆయన మాట్లాడటం ద్వారా పార్టీకి ఎవరైతే కో ఆర్డినేట్ చేయగలిగే నాయకుడు అన్నది ఆరా తీశారని అంటున్నారు జగన్ తీసుకుంటున్న ఈ చర్యలతో కొత్త రక్తం పార్టీలో ముందుకు వస్తుందని అంటున్నారు

వచ్చే ఎన్నికల్లో సమర్ధులకు బాగా పెర్ఫార్మ్ చేసిన వారికే టికెట్లు దక్కుతాయని అంటున్నారు. జగన్ సైతం సీనియర్లు కలసి వస్తే వారికి బాధ్యతలు ఇస్తున్నారు. ఒక వేళ ఎక్కడైనా వారు నెమ్మదించినా లేక అనాసక్తి చూపించినా చాన్స్ జూనియర్లకు వెళ్తోంది అని అంటున్నారు.

టీడీపీ సైతం కొత్త ముఖాలకే పట్టం కడుతున్న క్రమంలో వైసీపీ కూడా జూనియర్ నేతలకు ఇప్పటి నుంచే పార్టీ పగ్గాలు ఇవ్వడం ద్వారా రాజకీయంగా రాటు దేలేలా చర్యలు తీసుకుంటోంది అని అంటున్నారు.

వైసీపీ అధినాయకత్వంలో వచ్చిన ఈ మార్పు పార్టీ కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తున్న నేతలకు వరంగా మారనుందని అంటున్నారు. పార్టీ అప్పగించే బాధ్యతలను వారు స్వీకరించి తన సత్తాను నిరూపించుకోవాల్సి ఉందని అంటున్నారు.

21 Replies to “బంపర్ ఆఫర్ ఇస్తున్న జగన్”

  1. ఇది చదివాక అదేదో సినిమా లో బ్రహ్మానందం “నువ్వు లైన్ లో వుండవే నువ్వు లైన్ లో ఉండు, వీడేదో

    మంచి ఆఫర్ ఇస్తున్నాడు. నువ్వు లైన్ లో ఉండు” కామెడీ సీన్ గుర్తుకొస్తుంది భయ్యో..

  2. బట్ ఈవీఎం ల వల్లే ఓడిపోయాము అని మీరు, మీ బ్యాచ్ బలంగా నమ్మితే ఈ ప్రయత్నాలు, బంపర్ ఆఫర్స్ వేస్ట్ కదా..

  3. బట్-ఈవీఎం-ల-వల్లే-ఓడిపోయాము-అని-మీరు, మీ-బ్యాచ్-బలంగా-నమ్మితే-ఈ-ప్రయత్నాలు, బంపర్-ఆఫర్స్ ఇవన్నీ-వేస్ట్-కదా..

  4. టిడిపి సైతం కొత్త ముఖాలకే పట్టం కడుతున్నారు కాబట్టి మా అన్నయ్య కూడా అదే బాటలో నడుస్తున్నాడంటారు..

  5. ఓడిపోయిన పార్టీని ఏ నాయకుడు భుజాలకి ఎత్తుకోడు అని తెలిసి ఇపుదు కింది స్థాయి వాళ్ళు కావలిసి వచ్చింది.

  6. ఇప్పుడు చొక్కా లు విప్పుకొని పోరాడి సర్ కి అధికారం తెస్తే అయన వీళ్ళ మొఖాలు కూడా చూడడు పదవులకు రెడ్డి సర్ లు వస్తారు వీళ్ళ బతుకులు టీడీపీ వాళ్ళ భార్యలను తిట్టే పోస్ట్లు దానికి నెలవారీ ముష్టి పడేస్తారు

Comments are closed.