పుష్ప 2 సినిమా టాలీవుడ్‌లో సంచలనాలకు తెరతీసినట్లే, వివాదాలకు కూడా తెరతీసింది. ముఖ్యంగా హైదరాబాద్ తొలి మల్టీప్లెక్స్ అయిన ప్రసాద్ ఐమ్యాక్స్‌తో మైత్రీ డిస్ట్రిబ్యూటర్లకు గట్టి లంకె పడింది. కేవలం 2.5 శాతం షేరింగ్ దగ్గర ఇరు వర్గాలు బిగుసుకుపోయాయి. పంతాలకు పోయాయి. ఇప్పుడు ఈ పంచాయతీ టోటల్ మల్టీప్లెక్స్‌ల అసోసియేషన్‌కు చేరింది.
విషయం ఏమిటంటే, మల్టీప్లెక్స్‌లలో సినిమాను రెంట్ పద్ధతిలో కాకుండా ఆదాయాన్ని షేర్ చేసుకునే పద్ధతిలో ప్రదర్శిస్తారు. ఐనాక్స్, పీవీఆర్ లాంటి సంస్థలు టికెట్ ఆదాయంలో పన్నులు పోనుచేసి, మిగిలిన దాంట్లో 45 శాతం తాము ఉంచుకుని, 55 శాతం నిర్మాత లేదా డిస్ట్రిబ్యూటర్‌కి పంపిస్తాయి. ఇది యాభై-యాభై కింద మార్చాలని కొన్ని జిల్లాల్లో వివాదం ఉంది; అది వేరే సంగతి.
అయితే ప్రసాద్ ఐమ్యాక్స్‌కు వేరే అలవాటు ఉంది. తాము 47.5 శాతం ఉంచుకుని బయ్యర్ లేదా డిస్ట్రిబ్యూటర్‌కు 52.5 శాతం ఇస్తుంది. అంటే, పీవీఆర్/ఐనాక్స్‌ల కంటే 2.5 శాతం తక్కువ ఇస్తుందన్న మాట. పుష్ప 2 దగ్గర ఇదే వివాదం అయింది. 55 శాతం ఇస్తేనే సినిమా ఇస్తామని మైత్రీ సంస్థ అధినేతలు పట్టు పట్టారు. అలా ఇవ్వకపోతే సినిమా ఇవ్వమని తెగేసి చెప్పారు. “ఇవ్వకపోతే ఇవ్వద్దు,” అని ప్రసాద్ పుష్ప 2ను ప్రదర్శించలేదు.
సరే, ఇప్పుడు ఈ పంచాయతీ అక్కడితో ఆగలేదు. ప్రసాద్ ఐమ్యాక్స్ అధినేతలు ఈ విషయాన్ని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ముందుకు తీసుకెళ్లారు. “ఎప్పటినుంచో తాము 52.5 శాతం ఇస్తుంటే, ఇప్పుడు పీవీఆర్/ఐనాక్స్‌లు 55 శాతం ఇవ్వడం ఏమిటి?” అన్నది పాయింట్. దీని మీద డిస్కషన్లు నడుస్తాయి. ఒకవేళ ఇకపై పీవీఆర్/ఐనాక్స్‌లు కూడా 52.5 శాతం మాత్రమే ఇవ్వాలని తీర్మానం చేస్తే, మైత్రీ సంస్థ అనవసరంగా చిక్కులో పడినట్లవుతుంది.
రాబిన్ హుడ్ సంగతేమిటి?
ఈ నెలలోనే మైత్రీ సంస్థ రాబిన్ హుడ్ విడుదలవుతోంది. ఈ సినిమాను 52.5 శాతం షేర్ మీద ఇవ్వడానికి మైత్రీ ముందుకు వస్తే, తగ్గినట్లవుతుంది. లేదా ప్రసాద్ యాజమాన్యం తాము ప్రదర్శించమని పట్టుబడితే, అనవసరంగా సినిమాకు నష్టం జరుగుతుంది. పుష్ప 2 కనుక మైత్రీ సంస్థ బలంగా పట్టు పట్టింది. అదే రాబిన్ హుడ్ కు అలా పట్టుపట్టడం కష్టం కదా?
మొత్తం మీద ఈ పంచాయతీ ఎక్కడ తేలుతుందో, ఎలా ముగుస్తుందో చూడాలి.
Free market lo vunnama leka monopolies leda cartels lo pani nadustunda. istham vunte vesukovali lekapothe ledu. Anthegaani andaram kalisikattugaa oke rate pettukovali anatam enti.
emira dum , block cesinav
good news