సిట్చుయేష‌న్ షిప్.. ఇదో ట్రెండింగ్ రిలేష‌న్షిప్!

ప‌రిస్థితుల‌కు త‌లొగ్గి అనాలో.. ప‌రిస్థితుల‌ను క్యాష్ చేసుకోవ‌డం అనాలో కానీ.. రిలేష‌న్ షిప్ విష‌యంలో ఇప్పుడు వినిపిస్తున్న మాట‌ల్లో ఒక‌టి సిట్చుయేష‌న్ షిప్!

ప‌రిస్థితుల‌కు త‌లొగ్గి అనాలో.. ప‌రిస్థితుల‌ను క్యాష్ చేసుకోవ‌డం అనాలో కానీ.. రిలేష‌న్ షిప్ విష‌యంలో ఇప్పుడు వినిపిస్తున్న మాట‌ల్లో ఒక‌టి సిట్చుయేష‌న్ షిప్! ల‌వ్ రిలేష‌న్ షిప్ ల‌కు ఇది ప్ర‌త్యామ్నాయ ప‌దాల్లో ఒక‌టిగా వినిపిస్తూ ఉంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. ఆల్రెడీ గ‌ర్ల్ ఫ్రెండో, భార్యో ఉన్నా.. తాత్కాలికంగా మ‌రో సంబంధం ఉండ‌ట‌మే ఈ సిట్చుయేష‌న్ షిప్ అనాలేమో. ఒక‌వేళ సింగిల్ అయినా దీనికి మిన‌హాయింపు ఏమీ లేదు. సిట్చుయేష‌న్ షిప్ లో ఉన్నారంటే.. అది దీర్ఘ‌కాలం కొన‌సాగే బంధం కాద‌ని, దాన్ని కొన‌సాగించే ఉద్దేశం కూడా ఇద్ద‌రికీ లేద‌ని, సాగిన‌న్ని రోజులు సాగ‌డం లేదా, అది వ‌న్ నైట్ స్టాండ్ తోనే ఎండ్ కావ‌డ‌మే దీని అర్థ‌మ‌ని గూగుల్ ను అడిగితే చెబుతోంది.

వివాహం అనేది మొద‌లైన‌ప్పుడే మ‌రో సంబంధం ఉండ‌టం అనేది కూడా మొద‌లై ఉంటుంది మాన‌వ నాగ‌రిక‌త‌లో! ఎంతైనా మ‌నిషి కూడా జంతువే క‌దా, కాక‌పోతే సామాజిక జంతువు. మ‌నం జంతువులు అనుకునే వాటిల్లో కూడా కొన్నింటికి ఏక‌ప‌త్నీవ్ర‌తం త‌ర‌హా ఉంటాయ‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతూ ఉంటాయి. అయితే మ‌నిషి మ‌నసు రీత్యా, మేధ‌స్సు రీత్యా.. ఒకే బంధానికి క‌ట్టుబ‌డి ఉండ‌టం మంచిద‌ని నిర్ధారించుకున్నాడు. క‌నీసం నియ‌మం లాంటిది పెట్టుకున్నాడు. అయితే అందులో సంద‌ర్భాల‌ను, నాగ‌రిక‌త‌ల‌ను బ‌ట్టి.. మిన‌హాయింపుల‌ను పెట్టుకున్నాడు. ఇలా ఎన్నో మారాయి. వ్య‌వ‌హారం విశృంఖ‌లంగా మారిన‌ప్పుడ‌ల్లా.. మ‌తాలు ప్ర‌బోధించాయి. అలా కాదు, ఇలా అని చెప్పాయి. దేవుడి భ‌యాన్ని పెట్టాయి. అయితే మ‌నిషి ఆయా సంద‌ర్భాల్లో మారిన‌ట్టు న‌టించాడంతే!

ఇప్పుడు ట్రెండ్ ఇప్ప‌టిది. మ‌నిషిగా పుట్టినందుకు అనుభ‌వించి వెళ్లిపోవాలి.. అనే థియ‌రీకి మంచి ఊపుందిప్పుడు! తిండా, తిర‌గ‌డ‌మా, రిలేష‌న్ షిప్సా… ఆస‌క్తి కొద్దీ! సంపాదించి సంపాదించి కూడ‌బెట్టి.. త‌రాల‌కు మ‌గ్గ‌బెట్టాల‌నే ఆలోచ‌న‌ల‌కు పెద్ద విలువ లేకుండా పోయింది. సంపాదించి, దాచితే దాచు కానీ.. దాచ‌డ‌మే ప‌నిగాపెట్టుకోవ‌ద్ద‌నే నియ‌మాన్ని అనుస‌రిస్తూ ఉన్నారు. ఈ ధోర‌ణిలోనే.. ఇలాంటి సిట్చుయేష‌న్ షిప్ ల‌కు కూడా ఊపు ల‌భిస్తూ ఉంది.

డ‌బ్బులాగే రిలేష‌న్ షిప్ కూడా! ప్రేమించు, పెళ్లి చేసుకో.. అయితే ఒక‌రినే అనే నియ‌మం పెట్టుకోన‌క్క‌ర్లేద‌నే ధోర‌ణి క‌నిపిస్తూ ఉంది. గ‌మ‌నిస్తే.. ప్రేమ పేరుతో జ‌రిగే ఆత్మ‌హ‌త్య‌లు బాగా త‌గ్గుముఖం ప‌ట్టాయి! ప్ర‌త్యేకించి గ‌త ద‌శాబ్ద‌కాలం లో.. ప్రేమించ‌ట్లేద‌ని జ‌రిగే హ‌త్య‌లే ఎక్కువ‌గా ఉంటాయి ప్రేమించుకున్నామ‌ని ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునే వారి క‌న్నా! ఇష్టం లేని పెళ్లిళ్లు జ‌రుగుతుండ‌వ‌చ్చు, అయితే ఆ త‌ర్వాత వాటిని ఎలా ప‌రిష్క‌రించుకోవాల‌నే అంశం మీద కాన్స‌న్ ట్రేట్ చేసుకుని కూల్ గా ఉంటున్నారు!

స‌మాజం మొత్తం బ‌రితెగించేసి తిరుగుతోంద‌ని కాదు కానీ, ఐటీ కంపెనీల క్యాంప‌స్ ల‌ను గ‌మ‌నిస్తే.. ఎవ‌రికి ఎవ‌రు ఏమ‌వుతారో అర్థం కాదు. ఏది ఫ్రెండ్షిప్పో, ఏది మ‌రోటో ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌దు! ఎవ‌రి జీవితం వారిద‌న్న‌ట్టుగా ఎవ‌రి ప‌ని వారు చూసుకుంటూ ఉంటారు! అన‌డ‌దానికి ఐటీ ఉద్యోగులే దొరికారా అని కాదు కానీ, దీనికి ఎవ్వ‌రూ మిన‌హాయింపు కాదు. అవ‌కాశాలు దొరికి కొంద‌రు, అవ‌కాశాలు దొర‌క‌క కొంద‌రంతే! అంతా మ‌నుషులంతే! మ‌నిషి కూడా జంతు ప్ర‌వృత్తి నుంచి ప‌రిణామం చెందిన‌వాడంతే!

16 Replies to “సిట్చుయేష‌న్ షిప్.. ఇదో ట్రెండింగ్ రిలేష‌న్షిప్!”

  1. ఏ పార్టీ అధికారం లో ఆ పార్టీ లోకి జంప్ చేసే రాజకీయ నాయకులది కూడా ఇదే రిలేషన్షిప్ ఆయా పార్టీ లతో!

    1. Not only dabbulu/fame unnaa vaallu, miru kuda chesukovachu, mana chattam lo adhi vundhi, it’s not ileagal. Any citizen of India can do it with divorce. Don’t blame with half knowledge

      1. Correcte gaani but I am not preaching world ..

        that too kashaya dusthulu vesukuni asalu evaru cheyaru…..nanganachulu tappa…

        basically what you are supporting is that with money muscle, you can play with any number of women…

        mana karma enti ante nee lanti educated persons support cheyadam….

        1. Chaar nikha ప్రశ్నించ గలవా…ప్రశ్నించి batakagalavaa pislims సంగతి తెలుసు గా…ucc caa అడుగు భారతీయుడివి ఐతే…. నేను రోజూ onoff line asking

Comments are closed.