తెలుగు సినిమాలకు ఒకప్పుడు క్లబ్ డ్యాన్స్ లు, ఇప్పుడు ఐటమ్ సాంగ్ లు లేదా స్పెషల్ సాంగ్ లు. జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్కు స్మిత, డిస్కోశాంతి ల తరువాత హీరోయిన్ లే ఈ పాటలకు కూడా సై అనడం ప్రారంభించారు.
ప్రత్యేక గీతాల పేరిట రెండు రోజులు డ్యాన్స్ చేసి, మాంచి రెమ్యూనిరేషన్ అందుకుంటున్నారు. సినిమా జనాలు కూడా స్పెషల్ గీతం లేదా ఐటమ్ సాంగ్ అనే సరికి ఎక్కడెక్కడో వెదికి, ఎవరెవర్నో తెస్తున్నారు.
హీరో కళ్యాణ్ రామ్ లేటెస్ట్ సినిమా కోసం కూడా ఇలాగే ఓ బాలీవుడ్ భామను తీసుకువచ్చారు. వారినా హుస్సైన్ ఇప్పటికే బాలీవుడ్ లో నొటెడ్. ఈమెను తెలుగుకు పరిచయం చేస్తున్నారు.
మల్లిడి వేణు అనే కొత్త దర్శకుడితో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమా కోసం ఐటమ్ సాంగ్ ను ఇటీవల రామకృష్ణ హార్టీ కల్చర్ స్టూడియోలో చిత్రీకరించారు.