పవన్ తో మ్యూజిక్ ఓ మేజిక్

టెక్నాలజీ అంటే ఇష్టపడే ఈ సంగీత దర్శకుడు, అమెరికాలో ఓ మల్టీ నేషనల్ కంపెనీకి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డేటా ఎనలటిక్స్ విభాగాల్లో పనిచేశాడు.

పవన్ కల్యాణ్, రమణ గోగుల.. ఒకప్పుడు ఓ ఊపు ఊపిన కాంబినేషన్ ఇది. వరుసగా పవన్ సినిమాలకు సంగీతం అందిస్తూ వచ్చాడు గోగుల. నిలకడగా మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు. తాజాగా మరోసారి పవన్ తో పనిచేయడంపై స్పందించాడు. అదొక గొప్ప అనుభూతి అంటున్నాడు.

పవన్ కల్యాణ్ చాలా క్రియేటివ్ పర్సన్ అంటున్నాడు రమణ గోగుల. ఆయన చాలా కొత్తగా ప్రయత్నిస్తారని, తెలుగు సినిమాలో ఇంగ్లిష్ పాట పెట్టామంటే ఆ క్రెడిట్ పవన్ కల్యాణ్ దే అన్నాడు. అప్పట్లో పవన్ సినిమాలకు పాటలు కంపోజ్ చేయడం ఓ మేజిక్ లా జరిగిపోయిందన్నాడు.

వెంకటేశ్ హీరోగా నటిస్తున్న “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో మరోసారి టాలీవుడ్ లో అడుగుపెట్టాడు రమణ గోగుల. ఈ సినిమాలో అతడు ఓ పాట పాడాడు. మరోసారి సినిమాలకు సంగీతం అందించడానికి తను సిద్ధంగా ఉన్నానని, అయితే అన్నీ కుదరాలని అన్నాడు.

టెక్నాలజీ అంటే ఇష్టపడే ఈ సంగీత దర్శకుడు, అమెరికాలో ఓ మల్టీ నేషనల్ కంపెనీకి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డేటా ఎనలటిక్స్ విభాగాల్లో పనిచేశాడు. అందుకే గ్యాప్ వచ్చిందని, ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లో వర్క్ చేయడానికి రెడీ అని ప్రకటించాడు.

One Reply to “పవన్ తో మ్యూజిక్ ఓ మేజిక్”

Comments are closed.