అలియా భట్ కు, దీపిక పదుకోన్ అంటే పడదు. ఎందుకో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే, అలియా కంటే ముందు దీపికా పదుకోన్ తోనే రణబీర్ కపూర్ డేటింగ్ చేశాడు కాబట్టి. సరిగ్గా ఇలాంటి శత్రుత్వమే దీపికాకు ఇంకోటి ఉంది. కాకపోతే దానికి పెద్దగా ప్రాచుర్యం దక్కలేదు.
దీపిక పదుకోన్ అంటే, అనుష్క శర్మకు కూడా పడదు. ఎందుకంటే, ప్రస్తుత దీపిక పదుకోన్ భర్త రణ్వీర్ సింగ్, ఆమెతో ప్రేమలో పడటానికి ముందు, అనుష్క శర్మతోనే డేటింగ్ చేశాడు. ఒక విధంగా రణ్వీర్ సింగ్ తో తను విడిపోవడానికి దీపికానే కారణమనే ఫీలింగ్ అనుష్క శర్మలో ఉంది.
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో తెలియదు. అదే విధంగా అనుష్క శర్మ వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అందులో ఆమె దీపిక పదుకోన్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించింది.
దీపిక పదుకోన్ తరహాలో ఇండస్ట్రీని మీరు ఎందుకు షేక్ చేయలేకపోయారనే ప్రశ్నకు అనుష్క శర్మ గట్టిగా స్పందించింది. వరుసగా మూడేళ్ల పాటు 3 హిట్స్ ఇచ్చానని, అయినా ఎందుకు తనకు బజ్ రాలేదో అర్థం కావడం లేదంది. అక్కడితో ఆగకుండా తను తను టాలెంట్ తో గుర్తింపు పొందానని, వేసుకున్న దుస్తులు, వివాదాల కారణంగా తనకు గుర్తింపు రాలేదని చెప్పింది. అలా పరోక్షంగా దీపిక పదుకోన్ పై ఆమె విమర్శలు గుప్పించింది.
ఈ వీడియోతో అనుష్క-దీపిక మధ్య కోల్డ్ వార్ పై చర్చ మరోసారి మొదలైంది. నిజానికి ఇప్పుడు వీళ్లిద్దరూ ఎవరి వ్యక్తిగత జీవితాలతో వాళ్లు బిజీగా ఉన్నారు. రీసెంట్ గా దీపిక పదుకోన్ తల్లయింది. అటు అనుష్క శర్మ కూడా ఇద్దరు పిల్లలతో, విరాట్ కోహ్లితో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.
Hi