ఆరు ల‌క్ష‌ల పెన్ష‌న‌ర్ల‌పై వేటు త‌ప్ప‌దా?

కూట‌మి ప్ర‌భుత్వం సామాజిక పెన్ష‌న‌ర్ల‌పై దృష్టి సారించింది. ఆరు నెల‌ల్లో అన‌ర్హులుగా గుర్తించిన 1.57 లక్ష‌ల పింఛ‌న్‌దారుల‌పై ప్ర‌భుత్వం వేటు వేసింది.

కూట‌మి ప్ర‌భుత్వం సామాజిక పెన్ష‌న‌ర్ల‌పై దృష్టి సారించింది. ఆరు నెల‌ల్లో అన‌ర్హులుగా గుర్తించిన 1.57 లక్ష‌ల పింఛ‌న్‌దారుల‌పై ప్ర‌భుత్వం వేటు వేసింది. మొత్తానికి 6 ల‌క్ష‌ల పెన్ష‌న‌ర్ల‌పై వేటు వేసే అవ‌కాశం వుంద‌ని మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ అభిప్రాయం ప్ర‌కారం అర్థం చేసుకోవాల్సి వుంటుంద‌ని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్ప‌టికే పెన్ష‌న‌ర్ల ఏరివేత‌పై ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టింది.

పైలెట్ స‌ర్వేలో భాగంగా 10,958 మంది పెన్ష‌న‌ర్ల‌ను త‌నిఖీ చేయ‌గా, వాళ్ల‌లో 563 మంది అన‌ర్హులుగా అధికారులు గుర్తించారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా మ‌న రాష్ట్రంలో అధిక మొత్తంలో సామాజిక పింఛ‌న్ అంద‌జేస్తున్నారు. నెల‌కు రూ.4 వేలు చొప్పున సామాన్య పింఛ‌న్‌దారుల‌కు అంద‌జేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక విక‌లాంగులు, ఇత‌ర‌త్రా లోపాలున్న వారికి మ‌రో రెండు వేల రూపాయ‌లు అద‌నంగా అంద‌జేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఏదో ర‌కంగా విక‌లాంగ స‌ర్టిఫికెట్లు తెచ్చుకుని భారీ మొత్తంలో ప్ర‌తినెలా ప్ర‌భుత్వం నుంచి పింఛ‌న్ పొందుతున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ధ‌న‌వంతులు కూడా పేద‌ల‌మంటూ పింఛ‌న్ పొందుతున్నారు. ఓట్ల కోసం ప్ర‌భుత్వాలు చూసీచూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి.

అయితే కూట‌మి ప్ర‌భుత్వం మాత్రం ఈ విష‌యంలో సీరియ‌స్‌గా వుంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అన‌ర్హుల‌కు పింఛ‌న్ అందించ కూడ‌ద‌ని, అది కూడా ఇప్ప‌టి నుంచే మొద‌లు పెట్టాల‌నే ఉద్దేశంతో వేగం పెంచారు. ఇది మంచి ప‌రిణామ‌మే అనే వాళ్లు లేక‌పోలేదు. ఎందుకంటే, ప్ర‌భుత్వ సొమ్ము అంటే ఊరికే వ‌చ్చేద‌న్న అభిప్రాయం చాలా మెజార్టీ వ‌ర్గాల్లో వుంది. అందుకే అక్ర‌మాల‌కు పాల్ప‌డైనా ద‌క్కించుకోవాల‌నే తాప‌త్ర‌యం క‌నిపిస్తూ వుంటుంది. అయితే అన‌ర్హుల‌ను ఏరివేసే క్ర‌మంలో, నిజ‌మైన వాళ్ల‌కు అన్యాయం జ‌ర‌గ‌కూడ‌ద‌నే కీల‌క అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది.

11 Replies to “ఆరు ల‌క్ష‌ల పెన్ష‌న‌ర్ల‌పై వేటు త‌ప్ప‌దా?”

    1. ఇదే తాతలు 2019 లో పచ్చ తాత కి దింపారు, మళ్లీ దింపుతారు యిలానే ఏరివేతలు అని పెన్షన్ తొలగిస్తే…

  1. వైసీపీ ఏ పథకం పెట్టిన ఓటర్ లను కొనుగోలుకు మాత్రం పెట్టింది మొత్తం 80 % ఓటర్ లను కొనుగోలు చేసింది దాంతో నిజం గ అవసరమైన వారికీ ఇచ్చే అమౌంట్ తగ్గిపోయింది కూటమి మాత్రం కచ్చితం గ 40 % ఓటర్ లు తగ్గకుండా సంక్షేమ పథకాలు ఇవ్వాలి ఇక ఏమి చేసిన అప్పుడు వైసీపీ రాదు

Comments are closed.