టీడీపీ, వైసీపీ అధినేతలు చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ పార్టీల్ని నడిపించడంలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీలో కార్యకర్తల అభిప్రాయాలకు విలువ వుంటుంది. ఇదే వైసీపీ విషయానికి వస్తే కోటరీ అభిప్రాయాలకు మాత్రమే విలువ. అసలు కార్యకర్తల్ని పట్టించుకున్న పాపాన పోలేదు.
2019లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు. అధికారంలో ఉన్నంత కాలం పరిపాలనపై దృష్టి సారించి, కార్యకర్తల్ని పట్టించుకోలేదన్నారు. కార్యకర్తలు తనను మన్నించాలని, ఇకపై అలా వుండనని అన్నారు.
2024లో వైసీపీ ఘోర పరాజయంపాలైంది. ఇంత వరకూ జగన్ నుంచి తన వైపు తప్పు జరిగిందనే మాటే రాలేదు. పైగా ఈవీఎంలలో గోల్మాల్ జరగడం వల్లే ఓడిపోయామని, బ్యాలెట్ల ద్వారా ఎన్నికలు జరగాలంటూ పదేపదే డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ ఘోర పరాజయం జగన్‌లో ఇసుమంతైనా పశ్చాత్తాపం తీసుకురాలేదు. ఇంత వరకూ ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకున్నట్టుగా కనిపించడం లేదు.
కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఏం జరుగుతున్నదో అందరూ చూస్తున్నారు. టీడీపీలోనూ, అలాగే ప్రభుత్వంలోనూ ఏదైనా తప్పు జరుగుతోందని కార్యకర్తలు తమ అభిప్రాయాల్ని చెబితే, వెంటనే చంద్రబాబు, లోకేశ్ దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. అంటే టీడీపీ కార్యకర్తల అభిప్రాయాల్ని చంద్రబాబు, లోకేశ్ పరిగణలోకి తీసుకుంటున్నారు. లోకేశ్ ప్రజాదర్బార్ నిర్వహిస్తూ, కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజానీకంతో మమేకం అవుతున్నారు. అలాగే చంద్రబాబు వారానికో, రెండువారాలకు ఒకసారో పార్టీ కార్యాలయానికి వెళ్తూ వినతులు స్వీకరిస్తున్నారు.
పదికాలాల పాటు అధికారంలో ఉండాలని ఆకాంక్షించే నాయకులు చేయాల్సిన పనులివే. కానీ వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా వైసీపీ కార్యాలయానికి వెళ్లారా? ప్రజల నుంచి వినతులు స్వీకరించారా? అసలు వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి ఏర్పాటు ఉందా? అంటే…లేదనే సమాధానం వస్తుంది.
అలాగే వైసీపీ కార్యకర్తల అభిప్రాయాలకు ఇప్పటికీ విలువ లేదు. అయ్యా.. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరికొంత మంది కోటరీ నాయకుల్ని పక్కన పెడితే తప్ప వైసీపీకి మంచి రోజులు వచ్చే అవకాశమే లేదని నెత్తీనోరూ కొట్టుకుంటూ పదేపదే కార్యకర్తలు చెబుతున్నారు. కార్యకర్తల అభిప్రాయాల్ని పట్టించుకునే దిక్కులేదు. పైగా జగన్ తన అభిప్రాయాల్ని కేడర్‌పై రుద్దుతున్నారు.
ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిదీ సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడించి, చివరికి ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా సజ్జలను రాష్ట్ర కోఆర్డినేటర్‌ను చేసి, ప్రతిరోజూ ఆయనతోనే సమన్వయం చేయిస్తున్నారు. గతంలో సజ్జలను పక్కన పెట్టకపోగా, బోనస్‌గా ఆయన కుమారుడు భార్గవ్‌రెడ్డిని సోషల్ మీడియా అధిపతిని చేసి, ఇప్పుడు చాలా మంది జైలుపాలు కావడానికి కారణమయ్యారు.
ఏ ఇద్దరు వైసీపీ కార్యకర్తలు, నాయకులు మాట్లాడుకున్నా.. వేసుకుంటున్న ప్రశ్న ఏంటంటే, మన నాయకుడు జగన్‌లో ఇప్పటికైనా మార్పు వచ్చిందా? అని. మార్పు వచ్చినట్టు కనిపించడం లేదని, ఇప్పటికీ జగన్ చుట్టూ సజ్జల , విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డే కనిపిస్తున్నారని వైసీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి.
కూటమి ప్రభుత్వంపై జనంలో అసంతృప్తి మొదలైనప్పటికీ, దాన్ని క్యాష్ చేసుకోడానికి జగన్ పార్టీని బలోపేతం చేసుకోవాలి కదా? అని వైసీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. రేపు వైసీపీ అధికారంలోకి వస్తే, మళ్లీ ఆ ఐదారుగురు రెడ్లే కదా పాలించేది అని మాట్లాడుకునే పరిస్థితి. అందుకే వైసీపీ భవిష్యత్‌పై సర్వత్రా అనుమానాలు. అందుకే జగన్‌లో మార్పు వచ్చి, తన పని తాను చేసుకుంటే తప్ప, రాజకీయ భవిష్యత్ వుండదని గుర్తించాలి.
మీరు టైటిల్ తప్పుగా పెట్టారండి. బాబుల పట్టించుకోని అంతే బాబు గారు కూడా పట్టించుకోవట్లేదు అనే అర్థం వస్తోంది.
GA chaala strategic ga pedathadu titles intentionally so that manam unkonchem keen ga chaduvutham kada..y-e-d-a-v-a thelivithetalu ekkuva kada
Anna waste fellow paripalana chetakani yedava evari maata vinani murkhudu ani confirm chestunnavu anthe kada
Evm వల్ల ఓడిపోయినప్పుడు ఎందుకు మారాలి అని అనుకుంటున్నాడేమో.
“మళ్లీ ఆ ఐదారుగురు రెడ్లే కదా పాలించేది అని మాట్లాడుకునే పరిస్థితి.”
lol…tell this to SCST pendyala
😂
ఎదో ఒకటి రాసుకుంటూ సైట్ ని నడిపించే ఆలోచనేకాని…. జగ..న్ గాడు తల క్రిందులగా తప్పస్సు చేసినా..అదే ప్రార్థన లు చేసినా..కనీసం 15 ఏళ్ల వరకు ఇక్కడ అధికార మార్పిడి అనే ప్రశ్నే లేదు.mark my words…
15 కాదు 45
పార్టీకి నాలుగు స్థంబాల్లాంటి ఆ నలుగురు రెడ్లు +
మావోడు ఇంటింటికి చేసిన మంచి,
ఊరురికీ చేసిన అభివృద్ధి,
మావోడి అతి మంచితనం,
మావోడి అతి నిజాయితీ
వల్ల
కళ్ళు మూసుకున్నా, ఏ ఎన్నిక అయినా 175/175 గెలుస్తాం.. కాకపోతే కూటమి పోటీ చెయ్యకుండా,షర్మిల and KA పాల్ పార్టీలు మాత్రమే పోటీ చెయాలి..
దీనికి.. ఒప్పుకోవా చెంద్రబాబు ప్లీజ్
అతి నిజాయితీ ‘తనం’
Cadre ni pattinchukovatam ante janam meediki vadili dochukovatamaa leka public ga rowdism chesina ignore cheyyatama?
అతి నిజాయితీతో, అతి మంచితనము తో ఓడిపోయినవాళ్ళకి
కార్యకర్తలతో పనేంటి..
lol
అప్పుడప్పుడు మన గ్యాస్ ఆన్ లైన్ కూడా మాట్లాడుతాడు