బన్నీ భార్య ఆస్తి విలువ ఎంతో తెలుసా?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా కొనసాగుతోంది స్నేహారెడ్డి. ఆమె నిరక ఆస్తుల విలువ 42 కోట్ల రూపాయలు.

పుష్ప-2 సక్సెస్ తో దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు మార్మోగిపోతోంది, అదే సమయంలో అతడి భార్య స్నేహా రెడ్డి ఎవరు అనే ఆరాలు కూడా ఎక్కువయ్యాయి. అల్లు అర్జున్ తో పోలిస్తే, స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఎప్పటికప్పుడు తన ఫొటోలు, డైలీ రొటీన్ ను ఆమె ఇనస్టాగ్రామ్ లో పెడుతుంటారు. అంతేకాదు, పిల్లల ఫొటోలు కూడా ఎక్కువగా ఇందులోనే కనిపిస్తాయి.

2011లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి పెళ్లి చేసుకున్నారు. వీళ్లది లవ్ కమ్ ఎరేంజ్డ్ మ్యారేజీ. వీళ్లకు ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు అయాన్, కూతురు పేరు అర్హ. మసాటుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్నేహారెడ్డి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత అమెరికాలోనే కంప్యూటర్స్ లో మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేసింది.

అల్లు అర్జున్ లాగే స్నేహారెడ్డిది కూడా డబ్బున్న కుటుంబమే. ఆమె తండ్రి సయంట్ (SCIENT) ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ఛైర్మన్. అంతేకాదు, రాజకీయ నాయకుడు కూడా. తండ్రికి చెందిన కంపెనీలో స్నేహారెడ్డి డైరక్టర్ గా వర్క్ చేస్తోంది. పెళ్లి తర్వాత సొంతంగా పికాబూ అనే ఆన్ లైన్ ఫొటోస్టూడియో కూడా ఏర్పాటు చేసింది.

ఈ రెండు వ్యాపారాలతో పాటు ఆమె సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయన్సర్ గా, పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తోంది. ఇనస్టాగ్రామ్ లో ఆమెకు 9 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా కొనసాగుతోంది స్నేహారెడ్డి. ఆమె నిరక ఆస్తుల విలువ 42 కోట్ల రూపాయలు. పుష్ప-2 సక్సెస్ తో సోషల్ మీడియాలో స్నేహాకు కూడా ఫాలోవర్స్ పెరుగుతున్నారు.

13 Replies to “బన్నీ భార్య ఆస్తి విలువ ఎంతో తెలుసా?”

    1. Ra mo ji.. cb n den gesi ndi lekkeyadanki.. jeevitam pattufdi… Pa kk a lese ja thi kada.. ah matram sam pa dana undalante entha man di di kud avalo.. entha man di th opad kopet talo

    2. Ra mo ji.. c b n den gesi ndi lekkey adanki.. jeevit am patt uddi… Pa kk a lese ja thi kada.. ah mat ram sam pa dana undal ante entha man di di kud avalo.. ent ha man di th opad kopet talo

  1. అల్లు అర్జున్ ఒక యాడ్ కి తీసుకునే అంత విలువ చేయదు వాళ్ళ మొత్తము ఆస్తి, వాళ్ళది కూడా డబ్బు ఉన్న కుటుంబమేనా 😂

Comments are closed.