ఈ హెడ్డింగ్ చూడగానే ఆర్ఆర్ఆర్ అభిమానులకు మండుకు రావడం సహజం. ఎందుకంటే ఇప్పటికే వంద కోట్లు దాటించేసారు రకరకాల పోస్ట్ ల్లో. అందువల్ల కొత్తగా 87 కోట్లు మాత్రమే అంటే ఖస్సుమంటారు. కానీ ఇది పచ్చి నిజం.
నైజాం డిస్ట్రిబ్యూషన్ వర్గాలు నేరుగా చెప్పిన విషయం ఇది. ఇప్పటి వరకు ఎంత వచ్చింది అన్నదానికి ఇచ్చిన సమాధానం 87 కోట్లు. మరి ఈ వంద కోట్లకు పైగా అన్న ప్రచారం ఏమిటి? అన్నదానికి కూడా సమాధానం వచ్చింది. వాళ్లు గ్రాస్ మీద ఖర్చులు తీసి నెట్ వేస్తున్నారు. షేర్ కాదు అని.
అదీ సంగతి.
ఇక ఈస్ట్ గోదావరికి కట్టిన డబ్బులు వెనక్కు వచ్చాయి. కానీ ఖర్చులు ఇంకా రావాల్సి వుంది. వడ్డీలు సంగతి సరేసరి. అవే రావాల్సి వుండగా ఇంక కమిషన్ గురించి మాట్లాడడం వృధా. ఇది కూడా ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూషన్ వర్గాలు నేరుగా చెప్పిన సమాచారం.
వెస్ట్ గోదావరి బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా కోటి రూపాయలు రావాల్సి వుంది. కోటి వస్తే కట్టిన డబ్బులు వస్తాయి. ఆ పైన ఏమైనా వస్తే ఖర్చులు, ఇంకా వస్తే వడ్డీలు…ఇంకా..ఇంకా వస్తే అప్పుడు కమిషన్ అన్న పాయింట్. ఈ విషయం కూడా నేరుగా ఆ జిల్లా ఆర్ఆర్ఆర్ డిస్ట్రిబ్యూషన్ వర్గాల నుంచి తెలుసుకున్న సమాచారం.