అర‌రె.. ఇప్ప‌టం గ్రామ‌స్తులకు సుప్రీంలోనూ చీవాట్లే!

హైకోర్టు తీర్పును స‌మ‌ర్థిస్తూ, ఒక్కొక్క‌రికి రూ.25 వేలు చొప్పున జ‌రిమానా విధించ‌డం విశేషం.

గుంటూరు జిల్లా తాడేప‌ల్లి మండ‌లం ఇప్ప‌టం గ్రామంలో రోడ్ల విస్త‌ర‌ణ ఎంతో వివాద‌మైంది. దీనికి జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ నాడు ఆజ్యం పోశారు. గ్రామ‌స్తులంద‌రికీ నోటీసులు ఇచ్చిన తర్వాతే రోడ్ల విస్త‌ర‌ణ చేప‌ట్టామ‌ని వైసీపీ ప్ర‌భుత్వం నెత్తీనోరూ కొట్టుకుని మ‌రీ చెప్పినా, అబ్బే ప‌వ‌న్‌క‌ల్యాణ్ అస‌లు వినిపించుకోలేదు. 2022లో ఇప్ప‌టానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాను త‌ల‌పించేలా మందీమార్బ‌లంతో వెళ్లిన సంగ‌తి తెలిసిందే.

ఇప్ప‌టంలో ప్ర‌భుత్వ చ‌ర్య‌ల వ‌ల్ల న‌ష్ట‌పోయిన ప్ర‌తి కుటుంబానికి రూ.ల‌క్ష ఇస్తాన‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. ఇదే సంద‌ర్భంలో ఇప్ప‌టం గ్రామ‌స్తులు త‌మ‌కు నోటీసులు ఇవ్వ‌కుండానే రోడ్ల విస్త‌ర‌ణ పేరుతో ప్ర‌హ‌రీలు కూల్చారంటూ 14 మంది ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. వాళ్లంద‌రికీ నోటీసులు ఇచ్చిన త‌ర్వాతే, రోడ్ల విస్త‌ర‌ణ చేపట్టామ‌ని వైసీపీ హ‌యాంలో అధికారులు కోర్టుకు ఆధారాలు స‌మ‌ర్పించారు. త‌ప్పుడు పిటిష‌న్ వేసినందుకు 14 మందికి ఒక్కొక్క‌రికీ రూ.ల‌క్ష చొప్పున ఏపీ హైకోర్టు జ‌రిమానా విధించింది.

దీన్ని స‌వాల్ చేస్తూ ఆ 14 మంది ఇప్ప‌టం గ్రామ‌స్తులు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానంలోనూ వాళ్ల‌కు చీవాట్లు త‌ప్ప‌లేదు. కాక‌పోతే, జ‌రిమానా త‌గ్గింది. హైకోర్టు తీర్పును స‌మ‌ర్థిస్తూ, ఒక్కొక్క‌రికి రూ.25 వేలు చొప్పున జ‌రిమానా విధించ‌డం విశేషం.

ఇప్ప‌టంలో త‌మ అనుకూల వ‌ర్గాన్ని అడ్డు పెట్టుకుని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజకీయం చేశార‌ని మ‌రోసారి సుప్రీంకోర్టు తీర్పుతో తెలిసిపోయింది. నాడు ఈ త‌ర‌హా రాజ‌కీయం ఐదేళ్లు సాగింది. అయితే అడ్డుకోవ‌డంలో వైసీపీ త‌గిన విధంగా వ్య‌వ‌హ‌రించ‌క రాజ‌కీయంగా న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

16 Replies to “అర‌రె.. ఇప్ప‌టం గ్రామ‌స్తులకు సుప్రీంలోనూ చీవాట్లే!”

  1. Kevalam meeting ki bhumi icharane kaksha tho …..meeru chesina athi neechamaina aa panini inka support chesukuntunnaru ante…..🙏🙏🙏….chesina thappuku konchem kuda baadha leni meeku 11 kuda anavasaram GA….

    1. ప్రజలని కేసు వాపసు తీసుకోమని చెప్పి, ఒక కొత్త GO తీసుకు రావచ్చు కదా మన ఉపముఖ్యమంత్రి గారు, ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనుకుంటే కొత్త రోడ్ వేయొచ్చు కదా రూట్ మార్చి, రాజకీయల కోసం ఈ సొల్లు కబుర్లు ఎందుకు.

  2. ఐదు ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఎక్కడా వేయని రోడ్లు, పాపం ఆ ఊరులోనే ఎందుకు వేయాలని అనుకున్నారో ప్రజలకు తెలిసింది కాబట్టే 11 ఇచ్చారు.

    1. అది 100 అడుగుల రోడ్డు ఆ గ్రామానికి అప్రోచ్ రోడ్డు కనీసం 40 ఫీట్ రోడ్డు కూడా లేదు కానీ గ్రామంలో మాత్రం 100 అడుగుల రోడ్డుఅది కూడా కూల్చిన రెండు సంవత్సరాలకు వేశారు రోడ్డు

  3. కళ్యాణ్ గారు వెళ్ళింది కక్ష పూరితంగా చేసిన దానికి రా ..ఆలా చేసిన దానికే మీరు పెద్ద జోకర్లు అయ్యారు కదా 11 వచ్చి

Comments are closed.