మరికొన్ని రోజుల్లో వాలంటైన్స్ డే రాబోతోంది. ప్రేమలో పడిన యువతీయువకులు, ఆల్రెడీ ప్రేమలో ఉన్న కుర్రాళ్లు.. ఆ రోజున ముద్దు కోసం పరితపిస్తారు. మరీ ముఖ్యంగా అప్పటివరకు రుచి చూడని లిప్ కిస్ ను టేస్ట్ చేయడానికి ఆరోజు చాలామంది వెయిట్ చేస్తుంటారు. అయితే ఇలాంటి వాళ్లందరికీ కరోనా ఇప్పుడు పెద్ద అడ్డంకిగా మారింది.
ఈసారి ప్రేమికుల రోజుకు లిప్ కిస్సుల హంగామా తక్కువగానే ఉంటుంది. ఈ సంగతి పక్కనపెడితే.. అసలు లిప్ కిస్ పెట్టుకునేముందు కొన్ని విషయాలు గుర్తుంచుకుంటే మంచిదని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. మరీ ముఖ్యంగా నోరు, లాలాజలం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల గురించి అవగాహన కలిగి ఉన్న తర్వాత, పెదవుల్ని ముద్దాడితే బాగుంటుందని సూచిస్తున్నారు.
నష్టాలు ఇవి…
వైరస్ లేదా బ్యాక్టిరియా సోకిన వ్యక్తుల్ని ముద్దాడితే వారి పెదవులు, నోటి ద్వారా లాలాజలం మరో వ్యక్తి శరీరంలోకి వేగంగా పాకిపోతుంది. ఇన్ ఫ్లూయంజా ప్రభావంతో దగ్గులు, తుమ్ములు, జ్వరం, కండరాల నొప్పి లాంటి సమస్యలు వస్తాయి. నోటి పూత ఉన్న వ్యక్తుల పెదాల్ని ముద్దాడితే ఆ దుష్ప్రభావం మరింత ఎక్కువ.
మెనింజైటిస్ వ్యాపించేది ముద్దులతోనే అనే విషయం చాలామందికి తెలియదు. జ్వరం, కండరాల నొప్పి అనేవి వీటి లక్షణాలు. అంతేకాదు, శ్వాసకోస వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇక చిగుళ్ల సమస్య, దంతక్షయం వంటి ఇబ్బందులతో బాధపడేవారు పెదవులు కలిపితే దంతాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు హెపటైటిస్-బి లాంటి ప్రమాదకర వ్యాధులు కూడా సోకే ప్రమాదం ఉంది.
లిప్ కిస్ తో లాభాలు…
అయితే నష్టాలతో పాటు లిప్ కిస్ తో లాభాలు కూడా ఉన్నాయి. భాగస్వామి పెదాలను ఎక్కువ సేపు ముద్దాడితే శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది. పల్స్ రేటు నిమిషానికి 110 బీట్స్ వరకు వేగవంతమై గుండెకు బాగా బలాన్నిస్తుంది. లిప్ కిస్ తర్వాత ఊపిరితిత్తులు ఆక్సిజన్ ను ఎక్కువగా శోషిస్తాయి. దీని వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.
నోటి సమస్యలు లేని వాళ్లు లిప్ కిస్సు పెట్టుకుంటే నోటిలో సెల్వియా ప్రసారం ఎక్కువై, పళ్లపై ఉన్న యాసిడ్ ను తొలిగిస్తుంది. ఒత్తిడిగా ఉన్నప్పుడు భాగస్వామిని దాదాపు 3 నిమిషాల పాటు లిప్ కిస్ చేస్తే.. ఒత్తిడి ఊదేసినట్టు ఎగిరిపోతుంది. ఆఫీస్ కు వెళ్లముందు భాగస్వామిని కిస్ చేయడం వల్ల జీవితకాలం ఐదేళ్లు పెరిగినట్టు ఇప్పటికే అధ్యయనంలో తేలింది.
నిమిషం పాటు ముద్దుపెట్టుకుంటే 3 కెలొరీలు కరుగుతాయి. జీవక్రియలన్నీ వేగవంతం అవుతాయి. రోజుకు 3 ముద్దులు (ప్రతి ముద్దు కనీసం 20 సెకెన్లు) పెడితే ఒంటికి, మైండ్ కు చాలా మంచిదంటున్నారు నిపుణులు. ముద్దాడడం వల్ల ముఖంలో 30 రకాల కండరాలకు ఎక్సర్ సైజ్ దొరుకుంది. తద్వారా ముఖ చర్మం మరింత నిగారిస్తుంది. పెదాల్ని ముద్దుపెట్టడం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ మోతాదు పెరుగుతుంది. దీనివల్ల ఆత్రుత, ఒత్తిడి లాంటివి తగ్గి, మనసు-శరీరం కుదుటపడుంది.
చూశారుగా.. పెదాల్ని అందుకోవడం వల్ల కొన్ని నష్టాలతో పాటు ఎన్నో లాభాలున్నాయి. కాబట్టి ఈసారి ప్రేమను పంచుకునే ముందు మీ భాగస్వామి ఏదైనా అనారోగ్యం లేదా నోటి సమస్యతో బాధపడుతున్నారేమో చెక్ చేసుకోండి. అంతా ఓకే అనుకున్న తర్వాత ఇక ముద్దుల్లో మునిగి తేలడమే ఆలస్యం.