ఆ ఒక్క మూమెంట్ కోసం సలార్-2

సలార్-2 సినిమా నా బెస్ట్ మూవీ అవుతుంది. సలార్-2 రైటింగ్ నా బెస్ట్ వర్క్స్ లో ఒకటిగా నిలిచిపోతుంది.

సీక్వెల్ తీయడానికి ఒక్కో సినిమాకు ఒక్కో కారణం ఉంటుంది. ఉదాహరణకు బాహుబలి ఫ్రాంచైజీనే తీసుకుంటే, దీన్ని 2 భాగాలుగా చెబితే బాగుంటుందని షూటింగ్ మధ్యలో ఫీల్ అయ్యాడు రాజమౌళి. అలాగే దేవరలో కూడా చాలా పాత్రలు, చాలా కథ ఉంది కాబట్టి 2 భాగాలుగా తీయాలని షూటింగ్ మధ్యలోనే తెలుసుకున్నాడు కొరటాల.

అయితే సలార్ సినిమాకు మాత్రం రైటింగ్ దశ నుంచే 2 భాగాలు అనుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. కేవలం ఒకే ఒక్క మూమెంట్ వల్ల సలార్ ను 2 భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఒక్క మూమెంట్ ను బయటపెట్టాడు కూడా.

“దేవా-వరద లాంటి స్నేహితుల్ని ఎలా విడదీయగలం. అలా విడదీయడం కూడా కరెక్ట్ కాదు. ఓ పెద్ద అపార్థం వల్ల ఇద్దరూ విడిపోతారు. ఓ మూమెంట్ ఉంటుంది, దాన్ని నేను రివీల్ చేయలేను. ఆ సందర్భాన్ని ఇద్దరూ ఒక్కో రకంగా అపార్థం చేసుకుంటారు. వాళ్లు శత్రువులుగా మారడానికి ఆ ఒక్క మూమెంట్ కారణం. నేను సలార్ కు పార్ట్-2 తీయడానికి కూడా కారణం అదే.”

సలార్-2లో ఆ మూమెంట్ ను బయటపెడుతున్నాడు దర్శకుడు. ఆ ఒక్క సీన్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెబుతున్నాడు. ఈ విషయంలో తనది గ్యారెంటీ అంటున్నాడు. అంతేకాదు, సలార్-2ను తన బెస్ట్ వర్క్ గా చెబుతున్నాడు.

“సలార్-2 సినిమా నా బెస్ట్ మూవీ అవుతుంది. సలార్-2 రైటింగ్ నా బెస్ట్ వర్క్స్ లో ఒకటిగా నిలిచిపోతుంది. సలార్-2 గురించి ప్రేక్షకులు ఎలా ఊహించుకుంటున్నారో అంతకుమించి నా ఊహలున్నాయి. వాటన్నింటినీ తెరపైకి తీసుకొస్తాను. చాలా తక్కువ విషయాల్లో మాత్రమే ను చాలా నమ్మకంగా ఉంటాను. సలార్-2 సినిమా అలాంటిదే. ఇది నా బెస్ట్ వర్క్. ఇందులో మరో ప్రశ్నకు తావులేదు.”

ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు ప్రశాంత్ నీల్. తారక్ తో ఓ పీరియాడికల్ మూవీ చేస్తున్నట్టు స్పష్టం చేశాడు.

2 Replies to “ఆ ఒక్క మూమెంట్ కోసం సలార్-2”

Comments are closed.