నరాలు ఉండాలి. అవే శరీరాన్ని నడిపించి కదిలించి ఉంచే సాధనాలు. అయితే మామూలుగా చమత్కారంగా అంటూంటే మాటేంటంటే నాకు కోపం రాదురా ఎందుకంటే కోపం నరం తెగిపోయింది అని. అప్పట్లో వైఎస్సార్ పాదయాత్ర ముంగించుకుని వచ్చాక మీడియా ఆయనను ప్రశ్నించింది. ఈ పాదయాత్ర ద్వారా మీరు ఏమి నేర్చుకున్నారు అంటే నాకు కోపం ఉండేది. దానిని తగ్గించుకున్నాను అని అలా చెబుతూ కోపం నరం తెగింది అని చమత్కరించారు.
మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత ఆ మాటను అన్నది కింజరాపు అచ్చెన్నాయుడు. ఆయన ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం కీలకమైన వ్యవసాయ మంత్రిగా ఉన్నారు. ఆయన నాకు కోపం లేదు తగ్గింది అని మీడియాకు చెబుతూ తనకు కోపం నరం ఎపుడో తెగిపోయింది అని చెప్పారు. లేకపోతేనా అని ఒక దీర్ఘం కూడా తీశారు.
తనకే కోపం ఉంటే అధికారం తోడు అయితే కక్ష సాధింపు రాజకీయాలకు తెర తీస్తే ప్రత్యర్ధులు ఎవరూ ఉండేవారు కాదని హాటెస్ట్ వార్నింగే ఇచ్చేశారు. ఆయన అలా అనడానికి కారణం ఆయన టెక్కలి నియోజకవర్గంలోనే ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండు రోజుల క్రితం తనపైన పోలీసులు పెట్టిన కేసు గురించి మాట్లాడుతూ ప్రభుత్వం మీద కామెంట్స్ చేశారు. కక్ష సాధింపుతో తమ మీద కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. తాను అధికారంలోకి వస్తే ఇంతకు ఇంత చెల్లిస్తామని కూడా ప్రతిజ్ఞ చేశారు.
దానికి జవాబు అన్నట్లుగా అచ్చెన్న కోపం నరం తెగిపోయింది కానీ అని అంటూ చెప్పారన్న మాట. వైసీపీ హయాంలోనే తమను జైళ్ళలో పెట్టి ఇబ్బందుల పాలు చేశారు అని కూడా అచ్చెన్న ఆరోపించారు. పనిలో పనిగా జగన్ 13 లక్షల కోట్లు అప్పు చేశారని కూడా విమర్శించారు. అప్పు తొమ్మిది లక్షలే అని కూటమి ప్రభుత్వం బడ్జెట్ లో పెట్టిందని దానిలో టీడీపీ వాటా కూడా సగం ఉందని జగన్ చెబుతూంటే మళ్లీ 13 లక్షల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి అచ్చెన్నా అంటున్నారు.
ఆ సంగతి అలా ఉంచితే అచ్చెన్నకు కోపం నరం తెగింది కాబట్టి ప్రత్యర్ధులు బతికిపోయారు. మిగిలిన వారికి కోపం నరం తెగిపోలేదు అపుడు ఏమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కక్షలు కార్పణ్యాలు ఎవరు చేసినా తప్పే అని అంటున్నారు. కోపం అదుపులో ఉంచుకోవాలి కానీ నరాలు తెంపుకోవడం దాకా ఎందుకు అన్న వారూ ఉన్నారు.
GA,
comparision ki kuda ohh meaning undali..
where is YSR..and where is achanna ane naidu..
ysr kaali goti ki kuda sariporu ippudunna politicians..
never articles like this.
Mari ide vetakaram maha Metha ki kudaa cheppavaa?
Vollu perigindhi kani mind peragaledhu
ఒళ్ళు పెరిగిన కొద్దీ బుర్ర తగ్గుతుంది..బుర్ర తగ్గిన కొద్దీ కోపం తగ్గుద్దీ……అంతే
నారం తెగిందా.. రక్త స్రావం జరుగుతోంది ఏమో చెక్ చేయించుకోండి మంత్రి సార్
నరాలు తెగటం అతకటం అంతా మన మ..హా..మే..త కుటుంబం పేటెంట్ .
hard chutney….always …with full of fun….antoehr comedian….lol
మంత్రి సార్ కు అర్థమైంది ఎల్లకాలం మన ప్రభుత్వమే ఉండదు
అని
గతంలో ఈ మంత్రి సర్ 2014-2019 లో చేసిన హడావిడి మాములుగా ఉందా తర్వాత వచ్చిన ప్రభుత్వం కోపమనే నరాన్ని తెంచి లైన్ లోకి తెచ్చింది
250 crores ESI scam…total scamster veedu..
veediki malli kopam kuda..evari meeda???
looks like he is challenging Indian Constitutional laws..because of 250 crores tinna kuda evaru emi cheyaleru ane dyryam