హీరోలు అప్పుడప్పుడు గొంతు సవరించుకోవడం కామన్. రెగ్యులర్‌గా పాడేవారు ఉంటారు. అకేషనల్‌గా పాడేవారు ఉంటారు. సీనియర్ హీరోలు ఇప్పుడు పాడడం అన్నది అరుదు. మెగాస్టార్ మంచి ఊపు మీద ఉన్నప్పుడు “తమ్ముడు…ఓ తమ్ముడు” అంటూ పాడేశారు. నాగ్ ఇలాంటి వాటి జోలికి వెళ్లలేదు. విక్టరీ వెంకటేష్ గతంలో గురులో ఓ చిన్న ప్రయత్నం చేశారు.
కానీ ఇప్పుడు వెంకీమామ ఓ ఫుల్ సాంగ్ పాడేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంది. పక్కా సంక్రాంతి పాట ఇది. ఈ పాటను విక్టరీ వెంకటేష్‌నే పాడేశారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం అలనాటి సింగర్ రమణ గోగులను తీసుకువచ్చారు. ఆ పాట సూపర్ హిట్ అయింది. ఇప్పుడు వెంకటేష్ చేత పాట పాడించేశారు సంగీత దర్శకుడు భీమ్స్, దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి.
నిజానికి వెంకటేష్ నోట తెలుగు మాటల కన్నా ఇంగ్లీష్ ఎక్కువ వస్తుంది ప్రసంగాల్లో. ఇప్పుడు పాడిన పాటలో కూడా ఎక్కువ ఇంగ్లీష్ పదాలు ఉంటాయని తెలుస్తోంది. త్వరలో ఈ పాటను బయటకు వదలబోతున్నారు. ఈ పాటను ఈ రోజు ఆర్ఎఫ్సీలో ఇద్దరు హీరోయిన్‌లు, హీరో మీద చిత్రీకరించారు.
నీకు సినిమాలు గురించి తెలియక పోతే మూసుకుని మూల కూర్చుని పనికిమాలిన గోసిప్స్ రాసుకో… నాగార్జున నిర్మలా కాన్వెంట్, సీతారామరాజు లో పాడాడు
PK konni songs padadu ,Thammudu, Atharinti ki daredi and Agnatavasi lo Aa vishayam rayataniiki siggu padutunnadu GA.
బాలకృష్ణ కూడా పూరి జగన్నాథ్ సినిమా లో పాడాడు. సినిమా నాలెడ్జ్ లేకపోతే ఆర్టికల్స్ రాయడం మానేసి ఇంకా ఏదైనా చేస్కోండి