చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు కూట‌మి అనుకూల‌మా? వ్య‌తిరేక‌మా?

బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, బండారు స‌త్య‌నారాయ‌ణ మీడియాతో ఇద్ద‌రూ క‌లిసి మాట్లాడారు.

బెన్‌ఫిట్ షోలపై పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. బెన్‌ఫిట్ షోల‌కు అనుమ‌తి ఇచ్చిన ప్ర‌భుత్వాలు, ఇప్పుడు అందుకు భిన్నమైన వాద‌న చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. హైద‌రాబాద్‌లో సంధ్య థియేట‌ర్ వ‌ద్ద దుర్ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డంతో ఇక‌పై బెన్‌ఫిట్ షోల‌కు అనుమ‌తి ఇచ్చే ప్ర‌స‌క్తే లేద‌ని రేవంత్‌రెడ్డి స‌ర్కార్ తేల్చి చెప్పింది.

అయితే బెన్‌ఫిట్ షోలు వుండాల‌ని ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇవాళ ప‌ల్లా అభిప్రాయాల్ని కూట‌మి నేత‌లే త‌ప్పు ప‌ట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, బండారు స‌త్య‌నారాయ‌ణ మీడియాతో ఇద్ద‌రూ క‌లిసి మాట్లాడారు. బెన్‌ఫిట్ షోలు ఉండాల‌ని ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు అన‌డాన్ని చూశాన‌ని, కానీ ఎందుకు వుండాల‌ని విష్ణుకుమార్‌రాజు ప్ర‌శ్నించారు. బెన్‌ఫిట్ షోల వ‌ల్ల విప‌రీతంగా క్రేజ్ ఉన్న వాళ్లు రూ.300 టికెట్‌ను రూ.900కు అమ్ముకుంటున్నార‌ని విమ‌ర్శించారు. ఏంటిది అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

అల్లు అర్జున్ విష‌యంలో క‌క్ష‌పూరితంగా చేశార‌ని కిష‌న్‌రెడ్డి, అలాగే ఎలా అరెస్ట్ చేస్తార‌ని పురందేశ్వ‌రి అనుకోవ‌చ్చ‌ని, కానీ రేవంత్‌రెడ్డి బ్ర‌హ్మాండంగా చేశాడ్రా బాబు అని నిన్న‌నే తాను మెసేజ్ పెట్టిన‌ట్టు విష్ణుకుమార్‌రాజు సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం విశేషం.

టీడీపీ ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ ఎవ‌రి బెన్‌ఫిట్ కోసం షో వేస్తున్నార‌ని నిర్మాత‌ల్ని ప్ర‌శ్నిస్తున్నాన‌న్నారు. ప్ర‌భుత్వం నుంచి అద‌నంగా ఎందుకు అనుమ‌తులు తీసుకుంటున్నార‌ని ఆయ‌న నిల‌దీశారు. మీ లాభాల కోసం ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇవ్వాలా? అని ఆయ‌న నిల‌దీశారు. ప్ర‌జాశ్రేయ‌స్సుతో ముడిప‌డి ఉన్న‌ప్పుడే బెన్‌ఫిట్ షోకు అనుమ‌తి ఇవ్వాల‌ని ఆయ‌న అన్నారు.

టికెట్ల ధ‌ర‌ల‌పై నియంత్ర‌ణ ఎక్క‌డ వుంద‌ని ఆయ‌న అడిగారు. కూట‌మిలో త‌లా ఒక మాట మాట్లాడ్డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. వీళ్ల అభిప్రాయాల్ని ప‌రిశీలిస్తే, ఇంత‌కూ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు కూట‌మి అనుకూల‌మా? వ్య‌తిరేక‌మా? అనే అనుమానం క‌లుగుతోంది.

6 Replies to “చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు కూట‌మి అనుకూల‌మా? వ్య‌తిరేక‌మా?”

  1. you can cry and cry but film industry is with kootami. Film industry is living because of kootami. Pawan sir is the biggest hope for film industry and he is leading Kootami. What more do you want.

  2. మా single సింహం.. మెగా and

    సూపర్ స్టార్ల కే ‘ఉచ్చ ‘ఉచ్చ పోయించి చేతులు కట్టుకుని వొంగి వొంగి దండాలు పెట్టేలా చేసాడు.. అదీ ప్యాలెస్ పవర్ అంటే

Comments are closed.