రఘురామ ఎపిసోడ్‌లో నిందితుడికి టీడీపీ ఎమ్మెల్యే అండ!

తనను చావబాదిన వ్యక్తికి సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే మద్దతు ఇవ్వడం ఏంటనే ఆలోచన రఘురామలో ఉంటుంది.

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వైసీపీ హయాంలో కస్టడీలో కొట్టాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసిబాబును కోర్టు ఆవరణలో టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పరామర్శించడం చర్చనీయాంశమైంది.

తన రొమ్ములపై కూచుని, గుండె ఆపరేషన్ చేయించుకున్న తనపై అక్కడే బాదాడని తులసిబాబుపై రఘురామ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తులసిబాబును విచారించి, అరెస్ట్ కూడా చేసిన సంగతి తెలిసిందే.

అరెస్ట్ అయిన తులసిబాబు గుడివాడ ఎమ్మెల్యే రాముకు అత్యంత సన్నిహితుడిగా పేరు. దీంతో తన అనుచరుడిని కాపాడుకునేందుకు గుడివాడ ఎమ్మెల్యే ముందూ వెనుకా ఆలోచించలేదు. డిప్యూటీ స్పీకర్‌పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని తెలిసినా, వెనిగండ్ల రాము మాత్రం లెక్క చేయకపోవడం విశేషం.

ఒకవైపు ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్‌తో నీకున్న సంబంధాలేంటి? అని విచారణలో తులసిబాబును ప్రశ్నిస్తుంటే, మరోవైపు ఆయనకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అండగా నిలబడడం ఆసక్తికర పరిణామం. కోర్టు ఆవరణలో ఏకంగా గంటసేపు తులసిబాబుతో గుడివాడ ఎమ్మెల్యే చర్చించడం… డిప్యూటీ స్పీకర్‌కు తప్పకుండా కోపం తెప్పిస్తుంది. తనను చావబాదిన వ్యక్తికి సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే మద్దతు ఇవ్వడం ఏంటనే ఆలోచన రఘురామలో ఉంటుంది. తులసిబాబును ఎలాగైనా కాపాడుకోవాలన్న గుడివాడ ఎమ్మెల్యే ప్రయత్నం ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి.

6 Replies to “రఘురామ ఎపిసోడ్‌లో నిందితుడికి టీడీపీ ఎమ్మెల్యే అండ!”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు రెండు, ఐదు, ఐదు

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  3. ఇలాంటి ఎపిసోడ్లు టీడీపీ కి కామన్ అయ్యిపోయాయి . ప్రస్తుత పరిపాలన కూడా అంతత మాత్రంగానే జరుగుతుంది అనిపిస్తుంది .ఇదే విధంగా ఉంటె 2029 నాటికి 175 సమర్పిచేస్తారు జగన్ కి . అందులో నో డౌట్ .

  4. What is happening in TDP. Seeing the insidents by public no command and desi plain in the party on the MLAs&Ministers. N C NAIDU, CM MUST observe the actions of the MLAs&Ministers and prevent those.

Comments are closed.