Game Changer Review: మూవీ రివ్యూ: గేమ్ చేంజర్

ఆర్డినరీగా మొదలయ్యి, ప్రెడిక్టబుల్ గా ఇంటర్వల్ పడి, పేలవంగా ముగిసి డేంజర్లో పడేసింది.

చిత్రం: గేమ్ చేంజర్
రేటింగ్: 2.25/5
తారాగణం: రామ్ చరణ్, కియరా అద్వాని, అంజలి, సముద్రఖని, ఎస్. జె సూర్య, శ్రీకాంత్ తదితరులు
కెమెరా: తిరు
ఎడిటింగ్: షమీర్ మొహమ్మద్, రూబెన్
సంగీతం: ఎస్. తమన్
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం: ఎస్. శంకర్
విడుదల: 10 జనవరి 2025

చాలా కాలంగా ఎదురుచూస్తున్న శంకర్- రామ్ చరణ్ కాంబినేషన్ నేడు థియేటర్లకి వచ్చేసింది. “ఆర్ ఆర్ ఆర్” లాంటి అతి పెద్ద విజయం తర్వాత రామ్ చరణ్ ఈ చిత్రంతో పలకరిస్తే, “ఇండియన్ 2” అనే పెద్ద ఫ్లాప్ అందించిన శంకర్ కూడా ఇదే చిత్రంతో ముందుకొచ్చారు. ట్రైలర్ కి మిశ్రమ స్పందన వచ్చింది. ఇక సినిమా ఎలా ఉందో చెప్పుకుందాం.

కథలోకి వెళితే.. రాం నందన్ (రామ్ చరణ్) ఐపీఎస్ నుంచి ఐఏఎస్ గా మారిన సివిల్ సర్వెంట్. రాష్ట్ర ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి (శ్రీకాంత్) పెంపుడు కొడుకులు మోపిదేవి (ఎస్ జె సూర్య), మాణిక్యం (జయరాం) గోతికాడ నక్కల్లా ముఖ్యమంత్రి కుర్చీని ఎప్పుడు లాక్కోవాలా అని చూస్తుంటారు. ముఖ్యమంత్రి తనయులు తమ రాజకీయ పొగరుని చూపిస్తుంటే, ఒక ఐఏఎస్ గా తనకున్న పవర్ ని రాం నందన్ చూపిస్తుంటాడు. ఇదిలా ఉంటే గతంలో రాం నందన్ ప్రేయసి (కియారా) ఒక మెడికల్ స్టూడెంట్. స్వతహాగా కంట్రోల్ లేనంత కోపిష్టి అయిన రాం ని తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి డ్రైవింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అంతకు మించి అసలు కథతో పెద్దగా సంబంధంలేని లవ్ స్టోరీ వీళ్లది. ఇక ప్రస్తుతానికి వస్తే ఒక వృద్ధ మహిళ (అంజలి) ముఖ్యమంత్రి బహిరంగ సభలోకి ప్రవేశించి కొన్ని అంశాల మీద నిలదీస్తుంది. ఆమెని ఎదుర్కున్న కాసేపటికి ముఖ్యమంత్రి ఏదో గతం గుర్తొచ్చి మూర్ఛబోతాడు. ఏమిటా గతం? ఎవరామె? ఆమెకి, హీరోకి సంబంధమేంటి? అసలీ చిత్రంలో గేం ఏంటి.. దాని చేంజ్ ఏంటి అనేది తెరమీద చూడాలి.

దర్శకుడు శంకర్ ఆలోచనలు అన్ని సినిమాల్లోనూ గొప్పగానే ఉంటాయి. సామాజిక స్పృహ, ఏదో మార్పు జరగాలనే తపన, నాయకుల బాధ్యత- ప్రజల హక్కులు…ఇలా సాగుతూ ఉంటాయి ఆయన కథాంశాలు. ఆ కథలతోనే ఆయన ఎన్నో హిట్స్ కొట్టారు. అందుకే ఆయనంటే మూడు దశాబ్దాల ప్రేక్షకులకి గౌరవం. అయితే ఈ సినిమా ఆ కోవలో, ఆ స్థాయిలో ఉందా.. అంటే ఆ కోవలో ఉన్నమాట నిజమే కానీ ఆ స్థాయిలో కచ్చితంగా లేదు.

సినిమా తీయడంలో కథ, కథనం ఎలా ఉన్నా, అంతిమంగా కుదరాల్సింది చూసేవారికి అనుభూతి కలిగించడం. హీరో ఎలివేషన్ కావొచ్చు, సంభాషణలే కావొచ్చు, నేపథ్య సంగీతమే కావొచ్చు..ఇంకేదైనా కావొచ్చు..ప్రేక్షకుల్ని కట్టి పారేసినప్పుడే అనుభూతి కలుగుతుంది. ఆ పరిస్థితి ఈ చిత్రంలో అస్సలు లేదు.

శంకర్ 1990ల్లో సినిమాలు తీసినప్పటికి, ఇప్పటికి టేకింగ్ లో చాలా మార్పులొచ్చేసాయి. కథనాన్ని నడిపే విధానం, రాసుకునే ట్రాకులు అన్నీ మారాయి. శంకర్ 1990ల ప్యాటర్న్ లోనే స్టక్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. ఆయన అనుకునే కామెడీ నేటి తరానికి కామెడీ అనిపించుకోవట్లేదు. ఆయన ఊహించుకునే గూజ్ బంప్స్ మొమెంట్ నేటి ప్రేక్షకులు పట్టించుకోని పరిస్థితి.

సైడ్ సత్యం అనే సునీల్ క్యారెక్టర్ సైడ్ కి నడవడం ఎందుకు పెట్టారో అర్ధం కాదు. అసలది కామెడీ ఎందుకవుతుంది? పర్పస్ లేకుండా బలవంతంగా పెట్టినట్టుగా ఉంది ఈ అసహజమైన మేనరిజం. దానికి తోడు సీరియస్ క్యారెక్టర్ అయిన తల్లి పాత్రకి కూడా తల పక్కకి పెట్టి మాట్లాడడమనే మేనరిజం పెట్టారు. అది కూడా చూడ్డానికి చిరాకుగానే అనిపించింది.

ఎక్కడా ఎమోషనల్ ఫ్లో లేకుండా తెరమీద కథ ఒక ఇంఫర్మేషన్ లా నడుస్తుందంతే. ఫ్లాష్ బ్యాకులో వచ్చే అప్పన్న పాత్ర కథని వింటేజ్ స్టైల్లో తెరకెక్కించాడు శంకర్. ఉన్నంతలో ఆ ట్రాక్ కనెక్ట్ అవుతుంది.

ప్రధమార్ధం వీక్ గా ఉన్నా, ఇంటర్వెల్ కి వచ్చేసరికి సెకండాఫులో అయినా స్ట్రాంగ్ అవుతుందని ఆశపడడం సగటు ప్రేక్షకుడికి సహజం. కానీ ఆ ఆశ మీద కూడా నీళ్లు చల్లేయడం జరిగిపోయింది.

సాంకేతికంగా చూస్తే, అంజలి కేరెక్టర్ సీఎం ఉన్న వేదిక మీదకు వస్తున్నప్పుడు సీన్ లో తప్ప, మిగిలిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతా పరమ వీక్ గా ఉంది. ఎక్కడా ఒక్క హై కూడా లేదు. పాటలు ఒకటి రెండు పర్వాలేదు. చూడడానికి మాత్రం గ్రాండ్ గా ఉన్నాయి. కెమెరా, ఎడిటింగ్ విభాగాలు బాగా పనిచేసాయి. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.

శంకర్ గతంలో రాజకీయ నేపథ్యంలో సినిమాలు చాలానే తీసారు. అవి ఉన్నంతలో నమ్మశక్యంగా అనిపించేవి. అయితే, కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ప్రజలు ఇప్పుడు బాగా అప్డేట్ అయ్యారు. ఈజీ ఎమోషనల్ ప్లేకి పడిపోరు. పుస్తకాల్లో ఉన్న రూల్స్ ఏమో కానీ, కొన్ని సీన్లు కన్విన్సింగ్ గా లేక ప్రేక్షకులని తెల్లమొహం వేయించాయి. మచ్చుకి మూడు చెప్పుకుందాం:

– ఒక కలెక్టర్ తన ప్రియురాలిని కలవడానికి పొరుగు జిల్లాలోకి ప్రవేశించడానికి ప్రధాన కార్యదర్శి అనుమతి తీసుకోనందుకు పొరుగు జిల్లా కలెక్టర్ అడ్డుపడి డిస్మిస్ చేస్తానని బెదిరిస్తాడు

– అసెంబ్లీ నియోజకవర్గంలో ఏకంగా 14 లక్షల ఓట్లుంటాయి!

– ముఖ్యమంత్రి తన కుర్చీకి వారసుడిగా ఒక ర్యాండం ఐఏఎస్ అధికారిని ప్రకటించేస్తాడు. (ఒకే ఒక్కడు లో చూసినప్పుడు వన్-డే సీఎం ఆలోచన గొప్పగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ అతకనట్టుగా ఉంది)

ఇలాంటివాటితో పాటూ కథనంలో లూజ్ ఎండ్స్ కి లెక్కలేదు.

– అప్పన్న పోలికలతో ఉన్న రాం నందన్ ని చూసి బొబ్బిలి సత్యమూర్తి ఎందుకు షాకవ్వలేదు?

– అంజలి హీరోయిన్ దగ్గరకి ఎలా వచ్చి చేరింది? (కథనంలో చెప్పకుండా ప్రేక్షకుల ఊహకి వదిలేస్తే ఎలా?)

నటుల ప్రతిభా విశేషాల్లోకి వెళితే రామ్ చరణ్ రెండు పాత్రల్లోనూ బాగానే చేసాడు. అప్పన్నగా నత్తి డైలాగ్స్ చెబుతూ “ఆపద్బాంధవుడు” లోని ఒక సీన్లో చిరంజీవిని తలపించాడు. రాం నందన్ గా వైవిధ్యం చూపించాడు.

కియారా అద్వానిది సగటు కమర్షియల్ హీరోయిన్ పాత్ర అంతే. ఒక చిన్నపాటి లవ్ ట్రాక్ కి, పాటల్లో గ్లామర్ షోకి పనికొచ్చిందంతే.

అంజలిది నిజానికి గ్రేవిటీ ఉన్న పాత్ర. కానీ ఆమెకి మెడ పక్కకి పెట్టిన మేనరిజం పెట్టి సీరియస్నెస్ ని చంపేసారు. ఆమె ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వీక్. ఎండయ్యే విధానం బరువుగా ఉన్నా దానిని ఎమోషనల్ గా మలచలేకపోయాడు దర్శకుడు.

ఎస్ జె సూర్యా హైలైట్. సినిమా అంతా పూర్తయ్యాక ఎవరి నటన ఇంపాక్ట్ ఫుల్ గా ఉందంటే ఇతని పేరే చెప్పాలి.

శ్రీకాంత్, సముద్రఖని, జయరాం, రాజీవ్ కనకాల తదితరులు తమ తమ పాత్రల్లో న్యాయం చేసారు. వెన్నెల కిషోర్ ఎందుకున్నాడో తెలీదు. బ్రహ్మానందం ది సింగిల్ సీన్ రోల్. రఘుబాబు, శుభలేఖ సుధాకర్ లాంటి టేలెంటెడ్ నటులున్నా జూనియర్ ఆర్టిస్టులకున్నంత నిడివి ఉందంతే.

చివరిగా చెప్పేదేంటంటే, ఐఏఎస్ ఆఫీసర్ల పవరేంటో, ఎలక్షన్ ఆఫీసర్ శక్తేంటో చెబుతూనే రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉంటాయో చూపిస్తూ నడిపిన చిత్రం ఇది. విషయం అర్ధమైనా వినోదం కానీ, విశేషం లేకుండా ముగిసింది. శంకర్ మీద అంచనాలు పెట్టుకుని వెళ్లితే భంగపడక తప్పదు. కాస్త పాజిటివ్ గా చెప్పుకోవాలంటే, ఈ మధ్యన ఆయనే తీసిన ఇండియన్-2 కంటే ఇది కాస్త నయమని చెప్పాలి. అంతకంటే పాజిటివ్ ఏమీ లేదు. కంటి ముందు అన్ని హంగులూ ఉన్నా ఏదీ మనసుకి తాకకుండా తేలిపోయింది. ఆర్డినరీగా మొదలయ్యి, ప్రెడిక్టబుల్ గా ఇంటర్వల్ పడి, పేలవంగా ముగిసి డేంజర్లో పడేసింది.

బాటం లైన్: ప్రెడిక్టబుల్ డేంజర్

59 Replies to “Game Changer Review: మూవీ రివ్యూ: గేమ్ చేంజర్”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. 😂😂😂 ye political BACKDROP story ina mana anniyya ne VILLAIN laa kani pinchadam sahajam GA….daanike meeru inthala yedisthe yela cheppu….kavalante villain character ye bavundani rasuko GA…😂😂

    1. ఏ ఆర్టికల్ ఐనా అన్నయ్య కి ముడిపెట్టి కామెంట్ చేయడం నీకు కూడా సహజమేగా బ్రో… నిద్రపోతున్న నిల్చున్నా అన్నయ్యే గుర్తుకొస్తాడు నీకు, లాస్ట్ టైం బాగా పెట్టినట్టునాడు

  3. పోలీస్ ఆఫీసర్,కలెక్టర్, స్టూడెంట్,ఫార్మర్,ఎలక్షన్ ఆఫీసర్, ముఖ్యమంత్రి…ఇవన్నీ ఈ సినిమాలో రాంచరణ్ పాత్రలు!

    శంకర్ గాడికి ఇచ్చిన రెమ్యూనరేషన్ వసూల్ చెయ్యండి. ఇండియన్2 చూసి కూడా ఆరవ మేళం గాడితో సినిమా చేసిన దిల్ రాజు,రాం చరణ్ నిజంగా సాహస వీరులే!

    1. ఇంట్లో కూర్చో పెట్టినప్పుడే తెలియలేదా ..,30ఏళ్ల కల ముక్కలు అయినప్పుడు తెలియలేదా మీకు

  4. డిజాస్టర్ ఆఫ్ ద డికేడ్ ఈ రోట్ట సినిమా ఆరవ పైత్యం కనిపించింది ఎక్కువగా ,శంకర్ లో సరుకు అయిపోయి దశాబ్దం అయిపోయింది

  5. అన్నీయని అక్కడక్కడా మింగారు…30 ఇయర్స్ మేమే అని,బటన్ లు నొక్కడం..ఇలాంటి డైలాగ్స్ కి ఫుల్ njoyed ఆడియన్స్:)

  6. తండ్రి నీ చంపిన వాడిని తలకొరివి పెట్టించి ఒక్క డైలాగ్ తో వదిలేసారు…? అక్కడే ఈ సినిమా చచ్చిపోయింది..

    అసలు కొడుకులు లాగా చలామణి అయ్యే విలన్స్ సత్యమూర్తి ఆ వీడియో ఫేక్ అని ఎందుకు ముందుకు వెళ్ళలేదు..? (అంటే ఇలాంటివి వీడియోస్ ఈ రోజుల్లో చాలా కామన్ కదా)

    తండ్రి హత్య నీ కళ్ళరా చూసిన పిల్లాడు ఆ చావును ఎలా మర్చిపోయాడు (ఓకే మనం చెప్పిందే కథ )కానీ అక్కడ మిస్ అయినా పిల్లాడు నరేష్ దంపతులకు ….. ఎక్కడ…..ఎలా దొరికాడో..అది క్లారిటీ ఇవ్వలేదు. అతను ఎలా పోలీస్ అయ్యాడు..?

    తరువాత వెన్నల కిషోర్ క్యారెక్టర్… పరమ చెత్త క్యారెక్టర్. అతను పెట్టుకున్న స్పెడ్స్ ఓపెన్ అయ్యి అవతలి మనిషి నీ స్కాన్ చేసి వాళ్ళు వేసుకున్న బట్టలు చూసే క్యారెక్టర్ ల అనిపించింది. అది తప్ప అందులో ఏమైనా ఉందా..? ఒకవేళ ఆ క్యారెక్టర్ వేరే ఎవరో కొత్త ఆర్టిస్ట్ చేసి ఉంటే అతనికి ఎంత కొంత పేరు వచ్చేది..

    స్నేహితుడు సినిమా లో చెప్పినట్లు ఇలాంటివన్నీ శంకర్ సినిమా లోనే జరుగుతాయాన్నట్లు ఉంది.. 🤦🏻

  7. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  8. ఎంత నెగెటివిటీ చేసార్రా ఒక్కడి మీద!

    గెలుపుని జీర్ణించుకోలేని బాస్టర్డ్స్ కి – బ్లాక్బస్టర్ తో సమాధానం చెప్పాడు

  9. కంగారు పడకురా సుందరవదనా..మీ అన్నీయా Character గురించి ఏమి రాయలేదు ఏంటో.నీకు మీ కో Batch ki మడతపెట్టి మింగుతారు ..Just wait అమ్మా..

Comments are closed.