పవన్ నాటకీయ స్పందన.. డైవర్ట్ చేయడానికేనా?

చనిపోయిన వాళ్ల ఇళ్లకు వెళ్లి పరామర్శించండి లాంటి పరిహారాలు చెబుతున్నారా?

తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు చనిపోయారు. ఇలాంటి ఘోరమైన దుర్ఘటన జరగడం కేవలం టీటీడీ మరియు పోలీసు అధికారుల వైఫల్యం మాత్రమే. ఎవ్వరూ కాదనలేని సత్యం ఇది. బాధ్యులైన వారిమీద చర్యలు తీసుకోకుండా.. ఎన్ని బుకాయింపు మాటలు చెప్పినా సరే.. మరణించిన వారి ఆత్మలు శాంతించవు.

అయితే.. ‘తన శాఖ కాకపోయినా’ అని స్వయంగా చెప్పుకుంటున్నప్పటికీ.. ‘డిప్యూటీ ముఖ్యమంత్రి హోదా ఉన్నదని’ చాటుకుంటున్న పవన్ కల్యాణ్ ఈ వ్యవహారం మీద నడిపించిన నాటకీయ స్పందన అసలు వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికేనా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది.

దుర్ఘటన జరిగిందని తెలిసిన తర్వాత.. పవన్ కల్యాణ్ హుటాహుటిన బయల్దేరి తిరుపతి వెళ్లారు. పరామర్శలు చేశారు. సమీక్షలు చేశారు. తన శాఖ కాదు గానీ.. ఉపముఖ్యమంత్రి హోదాలో తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నానని ప్రకటించారు. పారిపోవడం లేదు అని చెప్పారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి, వేంకటేశ్వరస్వామికి చేతులెత్తి క్షమాపణలు చెబుతున్నానని కూడా అన్నారు. ఈ స్పందన చాలా అపూర్వంగా ఉంది. ఆయన ఎంతో బాధ్యతగా స్వయంగా వెళ్లి పనిచేసినందుకు అభినందించాలి. అయితే ఆ తర్వాతి పరిణామాలే, మాటలే అనుమానాలు పుట్టిస్తున్నాయి.

ఈవో శ్యామలరావు, ఏఈఓ వెంకయ్య చౌదరి బాధ్యత తీసుకుని తప్పిదాలు సరిద్దాలట. బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు, పాలకమండలి సభ్యుల బాద్యత ఉంది గనుక.. మృతుల కుటుంబాలను పరామర్శించి క్షమాపణ చెప్పాలట. సంతాపం తెలపాలట.

ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి జరిగిన ఘోరానికి సూచిస్తున్న పరిష్కారం ఇదేనా? హైదరాబాదులో సినిమా థియేటరు వద్ద తొక్కిసలాట జరిగితే ఒక్క ప్రాణం పోయినందుకు అల్లు అర్జున్ మీద రకరకాల కేసులు పెట్టి ఎంతగా వేధిస్తున్నారో అందరికీ తెలుసు. నిజానికి ఆ దుర్ఘటనతో అల్లు అర్జున్ ప్రత్యక్ష ప్రమేయం ఏమీ లేదు. కానీ.. తిరుపతిలో జరిగిన చావులు అలా కాదు. ఇవి అచ్చంగా ఈవో, ఛైర్మన్ ల వైఫల్యాలే.

అల్లు అర్జున్ మీద పెట్టిన అన్ని రకాల పోలీసు కేసులు ఈవో, ఛైర్మన్ ల మీద పెట్టకుండా, వారిని స్టేషనుకు పిలిచి విచారించకుండా, అరెస్టు చేయకుండా.. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని పవన్ కల్యాణ్ ఎలా భావిస్తున్నారు.

ఈవో, ఛైర్మన్ ల మీద తీసుకోవాల్సిన అసలు చర్యల మీద నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి ఆయన ఈ నాటకీయ ఎపిసోడ్ నడిపిస్తున్నారా? చనిపోయిన వాళ్ల ఇళ్లకు వెళ్లి పరామర్శించండి లాంటి పరిహారాలు చెబుతున్నారా? వారిని కాపాడడానికి ఇది పవన్ కొత్త ఎత్తుగడా అనే అనుమానాలు పలువురికి కలుగుతున్నాయి.

33 Replies to “పవన్ నాటకీయ స్పందన.. డైవర్ట్ చేయడానికేనా?”

      1. అక్కడ జరిగింది ఆక్సిడెంట్ ..గొడ్డలి తో వేసేసి గుండెనొప్పి అని చెప్పినోళ్లు నీకు నచ్చుతారు అనుకుంట ..

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు తొమ్మిది, తొమ్మిది, ఏడు ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. మన anniyya 200 మంది జనం తో icu లో saline bottles ను తొక్కుకొంటూ చేసిన డ్రామా నాటకీయo గా అనిపించ లేదా GA….pawan kalyan యెప్పుడు నిజాయితీ గానే వుంటాడు…..

  3. పవన్ నిజాయితీ తో చెప్పిన క్షమాపణలు GA….అలాంటి నిజాయితీ వున్న నాయకుడిని మీరు ఇంత వరకు చూడలేదు కాబట్టే మీకు ఇలాంటి ఆలోచనలు….మెల్లగా అర్దం అవుతుందిలే….wait Chey

      1. అయినా ఏమి తీసుకున్న .. తీసుకోక పోయిన .. ఇంట్లో కూర్చో పెడతా అన్నాడు .. చేసి చూపించాడు .. .. ముప్పయేళ్ల కల మధ్యలో ఆగిపోయింది పాపం ..

  4. GA గానికి డీసీఎం పవన్ వస్తే తప్పు రాకపోయినా తప్పే ….

    వీడు బాదంతా జగన్ గాడు akkadiki వచినా పవన్ ముందు జగన్ తేలిపోయాడని బాధ. LOL GA

    1. “దేవుడు నీకు కొంచమైనా సిగ్గు, శరం ప్రసాదించాలనీ కోరుకుంటున్నాను.”

  5. “దేవుడు నీకు కొంచమైనా సిగ్గు, శరం ప్రసాదించాలనీ కోరుకుంటున్నాను.”

  6. Papikondalu boat accident appudu 50 mandi chanippyaaru… nee button somberi saale gaadu em action teeskunnaadu ah time lo chepparaa arikatla package button sa nka na ke reddy.

  7. దేవుడు నీకు కొంచమైనా సిగ్గు, శరం ప్రసాదించాలనీ కోరుకుంటున్నాను

  8. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  9. కరోనా సమయంలో తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక అక్షరాల 11 మంది చనిపోయారు. దానికి బాధ్యులు ఎవరు? రుయా ఆస్పత్రి సిబ్బందిదా, లేక అప్పటి సీఎం అయిన జగన్ మోహన్ రెడ్డి గారిదా?

      1. అయినా చేపినదానికి సమాధానం చెప్పి అప్పుడు ఇంకో ప్రశ్న అడగండి .. ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు ..

Comments are closed.