లింగమనేని రమేష్‌కు ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. కృష్ణా నది కరకట్టపై ఉన్న లింగమనేని రమేష్ ఇంటి జప్తుపై ఏసీబీ కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. కరకట్టపై లింగమనేని నిర్మించిన గెస్ట్ హౌస్‌ను సీజ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించగా వారి కోర్టు అనుమతి మంజూరు చేసింది.
ముందుగా లింగమనేనికి నోటీసులు ఇవ్వాలని కోర్టు సూచిందింది. కాగా ఇటీవలే లింగమనేని రమేష్ గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో ఇచ్చింది. దీంతో గెస్ట్‌హౌస్ జప్తునకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తుది తీర్పు ఇవాళ వెలువరించింది.
కాగా ఈ గెస్ట్ హౌస్‌లో గతంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం ఉండేవారు. ఈ నిర్మాణం అక్రమమని గత కొంత కాలం నుండి వైసీపీ వాదిస్తోంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్మెంట్లలో అవకతవకలకు పాల్పడి లింగమనేనికి మేలు చేయడం వల్ల.. దానికి బదులుగా చంద్రబాబు కరకట్టపై లింగమనేని గెస్ట్‌హౌస్ పొందారని అభియోగాలున్నాయి.