దర్శకుడు త్రివిక్రమ్ కూడా భారీ పాన్ ఇండియా సినిమాల లైన్ లోకి వస్తున్నారు. బన్నీ హీరోగా ఇవ్వాళో..రేపో అనౌన్స్ చేయబోతున్నారు ఓ సినిమాను. గీతా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో హారిక హాసిని సంస్థ కూడా భాగస్వామి.
ఈ సినిమాతో త్రివిక్రమ్ భారీ సినిమాల లీగ్ లోకి అడుగుపెడుతున్నారట. పాన్ ఇండియా లెవెల్ లో భారీ సినిమాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని తెలుస్తోంది.
సుమారు ఏడాదికి పైగా త్రివిక్రమ్, బన్నీ తరచు కలుస్తూ ఈ స్టోరీని డెవలప్ చేస్తూ వస్తున్నారట. త్రివిక్రమ్ భాషలో చెప్పాలంటే ఎన్నో పదుల సాయంత్రాలు బన్నీ-త్రివిక్రమ్ కలిసి ఈ కథ కోసం ఖర్చు చేసారట.
పాన్ ఇండియా లెవెల్ భారీ సినిమా తీయాలని త్రివిక్రమ్ కోరిక. రాజమౌళి తరువాత సుకుమార్ ఆ రేంజ్ కు వెళ్లిపోయారు. త్రివిక్రమ్ నే వుండిపోయారు. అలాగే అవుట్ అండ్ అవుట్ భారీ యాక్షన్ సినిమా తీయాలనే కోరిక కూడా త్రివిక్రమ్ కు వుంది.
ఎన్టీఆర్ తో యాక్షన్ సినిమా అనుకున్నారు. అది సెట్ కాలేదు. మహేష్ తో అనుకున్నారు. వీలు కాలేదు. ఇప్పుడు బన్నీ తో ఆ కోరిక తీర్చుకుంటున్నారు అనుకోవాలి. ఎందుకంటే త్రివిక్రమ్ స్టయిల్ ఫ్యామిలీ మూవీలు పాన్ ఇండియాకు అస్సలు పనికి రావు. అల వైకుంఠపురములో సినిమా హిందీలో తీస్తే బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నేసింది. పాన్ ఇండియా జనాలకు పంచ్ లు కావాలి కానీ పంచ్ డైలాగులు కాదు.
ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల నుంచి త్రివిక్రమ్ జనవరికి ఫ్రీ అవుతారు. బన్నీ సమ్మర్ వేళకు ఫ్రీ అవుతారు. అంత వరకు బన్నీ-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ వార్తల్లో వుంటూ వస్తుంది.