విశాఖ మీద అదేనా ప్రేమ బాబూ…?

విశాఖలో భూముల ధరలు ఎక్కడ పెరిగాయి అని హైదరాబాద్‌తో పోలుస్తూ చంద్రబాబు తాజాగా వ్యాఖ్యలు చేశారు విశాఖలో కంటే కూడా హైదరాబాద్‌లోనే భూముల ధరలు పెరిగాయి. అక్కడే అభివృద్ధి అంటున్నారు. కేసీఆర్ చెప్పిన మాటలనే…

విశాఖలో భూముల ధరలు ఎక్కడ పెరిగాయి అని హైదరాబాద్‌తో పోలుస్తూ చంద్రబాబు తాజాగా వ్యాఖ్యలు చేశారు విశాఖలో కంటే కూడా హైదరాబాద్‌లోనే భూముల ధరలు పెరిగాయి. అక్కడే అభివృద్ధి అంటున్నారు. కేసీఆర్ చెప్పిన మాటలనే బాబు పట్టుకుని వల్లించారు.

తామున్నపుడే ఏపీ అభివృద్ధి చెందిందని మరో మాట కూడా అన్నారు. ఏపీలో ఒక ఎకరం నాడు అమ్మితే హైదరాబాద్ లో మూడెకరాలు కొనేలా ఉండేదలి, ఇపుడు అంతా రివర్స్ అయిందని ఆయన అంటున్నారు. కేసీఆర్ ఇటీవల ఏపీ కంటే తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించింది అని అంటే దానిని విశాఖకు చెందిన మంత్రి గుడివాడ అమరనాధ్ ఖండిస్తూ విశాఖలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణాలో పది ఎకరాలు కొనవచ్చు అని గట్టి కౌంటర్ ఇచ్చారు.

కేసీఆర్ అయితే తన రాష్ట్రం గురించి ప్రేమతో ఎక్కువో తక్కువో చెప్పుకుంటారు. కానీ ఏపీకే చెందిన చంద్రబాబు మరోసారి సీఎం అవుదామనుకుంటున్న బాబు కూడా అవే మాటలను అంటూ విశాఖలో ఎక్కడ పెరిగాయి భూముల ధరలు అనడమే ఆయనకు విశాఖ సిటీ మీద ఉన్న ప్రేమ ఏంటో తెలుస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు.

విశాఖలో ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో హైదరాబాద్ తప్పించి ఇతర ప్రాంతాలలో ఇంతకు రెండింతలు  భూములు కొనలేరా ఎవరైనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కేవలం హైదరాబాద్ పరిసరాల అభివృద్ధిని మాత్రమే అక్కడ ప్రభుత్వం కొలమానంగా చూపిస్తోందని వైసీపీ మంత్రి దానికి జవాబు చెబితే చంద్రబాబు కూడా విశాఖను తక్కువ చేసి మాట్లాడడం ఏంటి అని వైసీపీ నేతలు మండుతున్నారు.

చంద్రబాబు హైటెక్ సిటీ కట్టాను అక్కడ భూముల ధరలు పెరిగాయి అని అంటున్నారు. అమరావతి రాజధాని వస్తే అక్కడ భూముల ధరలు పెరిగిపోయి ఉండేవని అంటున్నారు కానీ విశాఖకు ఆయన ఏమీ చేయలేదు కాబట్టే ఈ ప్రాంతంలో భూముల ధరల మీద అభివృద్ధి మీద ఇలా విష ప్రచారం చేస్తున్నారు అని అంటున్నారు.

ఆ మంత్రి ఎక్కడ ధరలు పెరిగాయో చూపించమను అంటున్న బాబుకు దేశంలో విశాఖ తొలి పది టాప్ సిటీస్ లో ఒకటి అన్నది తెలియదా అని అంటున్నారు. విశాఖను వైసీపీ ప్రభుత్వం రాజధాని అన్నందుకే టీడీపీ నేతలు ఇలా ప్రతీ విషయంలో పోలిక తెచ్చి తక్కువ చేస్తున్నారు అని అంటున్నారు.