అన్న కుమారుడికి అంతిమ వీడ్కోలు ప‌లికిన జ‌గ‌న్‌

పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయంగా త‌న‌కు అన్ని విధాలా అండ‌గా నిలిచిన అభిషేక్ మ‌ర‌ణాన్ని జ‌గ‌న్ జీర్ణించుకోలేకున్నారు.

వ‌రుస‌కు అన్న కుమారుడైన వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ వైఎస్ అభిషేక్‌రెడ్డి మృత‌దేహానికి మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అంతిమ వీడ్కోలు ప‌లికారు. అనారోగ్యంతో డాక్ట‌ర్ అభిషేక్‌రెడ్డి తుదిశ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. మృత‌దేహాన్ని శుక్ర‌వారం రాత్రికి హైద‌రాబాద్ నుంచి పులివెందుల‌కు త‌ర‌లించారు.

ఇవాళ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌త‌ల‌పెట్టారు. బెంగ‌ళూరు నుంచి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, ఆయ‌న భార్య భార‌తి పులివెందుల‌కు చేరుకున్నారు. పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయంగా త‌న‌కు అన్ని విధాలా అండ‌గా నిలిచిన అభిషేక్ మ‌ర‌ణాన్ని జ‌గ‌న్ జీర్ణించుకోలేకున్నారు.

చిన్న వ‌య‌సులోనే ప్రాణాలు కోల్పోయిన అభిషేక్ పార్థివ‌దేహాన్ని చూసి, తీవ్ర ఆవేద‌న‌కు లోన‌య్యారు. చివ‌రిసారిగా అభిషేక్‌కు నివాళుల‌ర్పించారు. కుటుంబ స‌భ్యుల్ని ఆయ‌న ఓదార్చారు. అభిషేక్ తండ్రి వైఎస్ మ‌ద‌న్‌మోహ‌న్‌రెడ్డి తొండూరు మండ‌ల వైసీపీ ఇన్‌చార్జ్‌. క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డికి అభిషేక్‌, అత‌ని తండ్రి మ‌ద‌న్‌మోహ‌న్‌రెడ్డి అండ‌గా వుండేవారు.

రాజ‌కీయంగా ఎంతో భ‌విష్య‌త్ ఉన్న అభిషేక్ ఈ లోకాన్ని శాశ్వ‌తంగా వీడ‌డం వైసీపీకి తీర‌ని న‌ష్టం. అభిషేక్‌కు భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. వాళ్ల వేద‌న వ‌ర్ణ‌నాతీతం.

18 Replies to “అన్న కుమారుడికి అంతిమ వీడ్కోలు ప‌లికిన జ‌గ‌న్‌”

  1. అప్పట్లొ అవినాష్ కి కాకుండా ఈయనకెనా kadapa MP టికెట్ ఇస్తారు అని వార్థలు వచ్చింది?

    అయ్యొ పాపం! ఎలా చనిపొయాడొ?

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  3. అధికారం లో ఉన్నది చంద్రబాబే కదా..

    సాక్షి లో నారాసురరక్తచరిత్ర – 2 వదలాల్సింది ..

    ఓహో.. ఇప్పటికి అయిన పెంట చాల్లే అని ఊరుకొన్నారా..?

    గులకరాయి నేర్పిన పాఠం..

  4. ఎదొ అన్న కుమారుడు.. అన్న కుమారుడు.. అంటావె కాని, అవినాష్ కి కాకుండా kadapa MP టికెట్ ఇస్తారు అని వార్తలు వచ్చిన అబిషెక్ రెడ్డి నె అని చెప్పవెమయ్యా!

  5. తన ఎంపీ సీట్ కి వ్యతిరేకం అనుకున్న వివేకా లేచి పోయాడు.

    అవినాష్ ఎంపీ సీటు కి పోటీ అనుకున్న అభిషేక కూడా లేచి పోయాడు.

    ఏమిటి ఈ బహిరంగ రహస్యం?

  6. మహానుభావులు.

    వైఎస్ రాజశేఖర్ రెడ్డి

    వైఎస్ వివేకానంద రెడ్డి

    వైఎస్ అభిషేక్ రెడ్డి..

    ఆకస్మిక మరణం మీద సీబీఐ ఎంక్వైరీ వెయ్యాలి.

    ఇం*టి దొం*గ లని చట్టా*నికి పట్టిం*చాలి.

    ఇదే నిజమైన వైఎస్ఆర్ అభిమాన లకి నివాళి.

  7. Idi CBN kutra, Vivekananda case lo tana involvement bayatiki vastundani CBN e maa jagananna tammudi health chedagotti champesaadu, CBN pedda donga…..and so on😂😅😛

Comments are closed.