అరకుకు అత్యున్నత న్యాయస్థానం సీజే

ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏజెన్సీకి దేశంలోని అత్యున్నత న్యాయ స్థానం చీఫ్ జస్టిస్ జస్టిస్ సంజయ్ ఖన్నా రానున్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏజెన్సీకి దేశంలోని అత్యున్నత న్యాయ స్థానం చీఫ్ జస్టిస్  సంజయ్ ఖన్నా రానున్నారు. ఆయనతో పాటు పాతిక మంది దాకా న్యాయమూర్తులు వస్తున్నారు. ఈ అత్యున్నత స్థాయి న్యాయమూర్తుల బృందంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కూడా ఉన్నారు.

ఈ న్యాయమూర్తుల బృందం గిరిజన మ్యూజియం తో పాటు గిరిజన గ్రామ దర్శినిని సందర్శించనుంది. ఈ పర్యటనలో బొర్రా గుహలను కూడా తిలకిస్తారు అని అంటున్నారు. అనంతగిరిలోని కాఫీ తోటలను కూడా సందర్శిస్తారు అని అంటున్నారు. ప్రకృతి రమణీయతకు చిరునామాగా ఉన్న అరకులో దేశ అత్యున్నత స్థాయి ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులు అంతా ఇంత పెద్ద సంఖ్యలో రావడం ఇదే మొదటిసారి అని చెప్పాలి.

ఎన్నో తీర్పులను ఇస్తూ దేశంలో రాజ్యంగ బద్ధ పాలన సాగేలా న్యాయ వ్యవస్థ చూస్తోంది. అయితే గిరిజన ప్రాంతాలలో పరిస్థితులు అక్కడి వాతావరణం, గిరి పుత్రుల జీవన శైలి అన్నవి నేరుగా తెలుసుకునేందుకు న్యాయమూర్తులు అంతా గిరి సీమలకు రావడం అన్నది అరుదైన సందర్భంగా చెబుతున్నారు.

అతి పెద్ద సంఖ్యలో న్యాయమూర్తులు అంతా అరకుకు విడిది చేయడంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒక రోజు పర్యటనకు వస్తున్న న్యాయమూర్తులు గిరిజనులతో ఏమి మాట్లాడుతారు ఏ విషయాల మీద ఆసక్తి చూపిస్తారు అన్నది అంతా తర్కించుకుంటున్నారు.

One Reply to “అరకుకు అత్యున్నత న్యాయస్థానం సీజే”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.