తిరుమలేశుని సేవలో ఇంతటి అహంకారి తగునా?

క్షమాపణ చెప్పడంలో తప్పులేదు. కానీ చెబితే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా? ఎవరో ఏదో అన్నారని వాటన్నింటికీ స్పందించాల్సిన అవసరం లేదు

రాజకీయాలలో ఇదివరకు ‘నైతిక బాధ్యత’ అనే ఒక పదం ఉండేది. ఏదైనా ఒక ప్రమాదమో విపత్తూ జరిగినప్పుడు.. ఆ రంగానికి, విభాగానికి సంబంధించిన ఉన్నత పదవిలో ఉండేవారు తమ పదవికి రాజీనామా చేసేవారు. తమ నాయకత్వం సవ్యంగా ఉండి ఉంటే.. తమ కింది వారందరూ సక్రమంగానే పనిచేస్తూ ఉంటారు కదా.. అలా అందరూ సక్రమంగా పనిచేసినప్పుడు ఆ పొరబాటు జరిగి ఉండకూడదు కదా.. అనే భావన అది!

కేంద్ర బడ్జెట్ లోని అంశాలు ముందే బయటకు వస్తే చాలు.. ఆర్థిక మంత్రి రాజీనామా చేసిన సందర్భాలు.. ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే రైల్వే మంత్రి రాజీనామా చేసిన సందర్భాలు ఈ దేశంలో ఉన్నాయి. ఇప్పుడు రోజులు మారాయి. పదవిని అంటిపెట్టుకుని వేళ్లాడడం ఒక్కటే అందరికీ తెలిసిన సంగతి. స్పష్టంగా తమ వైఫల్యం కారణంగా ఎంత ఘోరాలు జరిగినా సరే.. చీమకుట్టినట్టు కూడా పరితాపం చెందకపోవడం ఇప్పటి నాయకుల శైలి. మొక్కుబడి స్పందనలే తప్ప.. పశ్చాత్తాపం లేని స్పందనలు వారివి.

ఇందుకు అతిపెద్ద ఉదాహరణ.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు! తాజాగా టీటీడీ వైఫల్యం కారణంగా ఆరుగురు దుర్మరణం పాలైతే.. తదనంతర పరిణామాల్లో ఆయన మాటలను గమనిస్తే.. ఇంతటి అహంకారి దేవుడి సేవకు తగునా? అనే అనుమానం ప్రజలకు కలుగుతుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే.. ఏమాత్రం నైతికత ఉన్న వ్యక్తి అయినా సరే.. ఆరుగురు మరణించిన సంగతి తెలిసిన వెంటనే.. తన ఛైర్మన్ పదవికి రాజీనామా చేసి ఉండాలి. దేవుడి మీద నమ్మకం ఉండే, విధి లాంటి వాటిని నమ్మే వ్యక్తి అయితే.. తాను ఛైర్మన్ కావడం అనేదే దేవుడికి ఇష్టం లేదని కూడా అనుకోవాలి. గౌరవంగా పక్కకు తప్పుకోవాలి. కానీ ఆయన ఆ పనిచేయలేదు. అప్పటినుంచి ఇప్పటిదాకా అధికారుల మీద నిందలు వేసి బురద పులమడానికి చూస్తున్నారు.
డిప్యూటీ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఛైర్మన్, ఈవోలు మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని తేల్చేశారు.

అయితే బీఆర్ నాయుడు మాత్రం క్షమాపణ చెప్పలేదు. ఆ విషయాన్ని బోర్డు సమావేశం తర్వాత విలేకరులు ప్రస్తావిస్తే.. ‘క్షమాపణ చెప్పడంలో తప్పులేదు. కానీ చెబితే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా? ఎవరో ఏదో అన్నారని వాటన్నింటికీ స్పందించాల్సిన అవసరం లేదు’ అని అహంకారంగా సమాధానం చెప్పారు.

‘తప్పెలా జరిగిందో విచారిస్తున్నాం’ అని అన్నారు. క్షమాపణ చెబితే ప్రాణాలు తిరిగి రావు అనే క్లారిటీ ఉన్న బీఆర్ నాయుడు, విచారణ జరిపిస్తే మాత్రం ప్రాణాలు తిరిగొస్తాయని అనుకుంటున్నారా? ప్రాణాలు తిరిగి రావు సరే.. క్షమాపణ చెబితే.. ఆయన సొమ్ము ఏమైనా అరిగిపోతుందని భయపడుతున్నారా? అనేది అర్థం కాని సంగతి.

విచారణ చేయించడం వలన.. ముందు ముందు జరగకుండా ఎలా జాగ్రత్తపడతారో.. క్షమాపణ ఒకసారి చెబితే.. ముందు ముందు మళ్లీ చెప్పాల్సిన అవసరం రాకుండా.. సిగ్గుతో ఇంకాస్త అప్రమత్తంగా ఉంటారు.. అని ప్రజలు అనుకుంటున్నారు. ఇంత అహంకారంతో వ్యవహరించే.. భక్తుల ప్రాణాల పట్ల చులకనగా వ్యవహరించే వ్యక్తిని టీటీడీ ఛైర్మన్ చేయడమే చంద్రబాబు తీసుకున్న భ్రష్ట నిర్ణయం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

27 Replies to “తిరుమలేశుని సేవలో ఇంతటి అహంకారి తగునా?”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. తిరుపతి రుయా ఆస్పత్రిలో Oxygen అందక కరోనా రోగుల మృతి చెందినప్పుడు అప్పటి సీఎం జగన్ సారీ చెప్పలేదు కదా . జగన్ ది అహంకారం కానప్పుడు బ్రా నాయుడు ది అహంకారం ఎలా అవుతుంది పిలగా ఎంకటి?

  3. Did Jagan sacked anyone

    1) for the death of 40 people in Annamayya Dam tragedy which is purely their negligence? He attended the place only after 3 weeks!

    2) for the death of 11 people in Ruia hospital for the lack of oxygen

    3) for the death of 11 people in LG polymners?

      1. మళ్ళీ జెగ్గులు ఎందుకు?? తిరుమల సెట్టింగ్ ప్యాలెస్ లో వేసుకుని అసలైన గుడికి పోటీగా నిలబెట్టి దర్శన యాపారం చెయ్యడానికా??

  4. కేవలం “ప్రమాదానికి” అహంకారం అంటే..

    సెట్టింగ్ తో ఏకంగా తిరుమల వెంకటేశ్వరస్వామి గుడినే తన ప్యాలెస్ కి రప్పించిన మావోడిది అస్సలు “అహంకారం కానే కాదు భక్తి మాత్రమే” తెలుసా??

  5. BJP jagan ni duvvuthundi. Jagan modi pet . Amul paalu andhra lo teeskuravadaaniki tirumala laddu kathi ki BJP jagan karanam . Jagan pawan tho BJP rajakeeya game aduthondi . Laddu ghatana pai jagan paina eega valanivvadu modi . Adaani power meeda kudaa jagan ni emi peekaleru ., ee thokkilaasata kudaa BJP jagan la kutra kaavachu . Modi BJP jagan dwara pawan dwara cheyinche neecha rAajakeeyalu inkaa enno AP prajalu chustaru. Babu ki nijam gaa savyamaina palana cheyyali ante BJP pawan la kabandha hastaala nundi bayatapadi India kutami tho kalavaali .AP ki modi emi cheyyadu . Idhi nijam . Idhe nijam

  6. మొన్న “ అదే ja*** హయాం లో .. అయితే “ అని టైటిల్ పెట్టి తెగ గింజుకున్నావు, ఇప్పుడు నిన్ను ఏ చె*ప్పుతో కొ*ట్టాలి?

Comments are closed.