సాధారణంగా యూనివర్సిటీల్లో 70 శాతం మార్కులు దాటితే డిస్టింక్షన్ అంటారు. ఆ లెక్కన విరాళాల దందాలు సాగించడంలో దేశంలోని ప్రాంతీయ పార్టీలు అన్నింటిలోను భారాస డిస్టింక్షన్ సాధించింది. అసలు దీనిని డిస్టింక్షన్ అనాలో లేదా మార్కెట్ షేర్ అనాలో కూడా అర్థం కాని సంగతి.
డిస్టింక్షన్ అనేది జనరల్ గా ఇద్దరు ముగ్గురికి కూడా వచ్చే చాన్సుంటుంది. కానీ.. భారత రాష్ట్ర సమితి దందా చాలా స్పెషల్. దేశంలోని దాదాపు 57 ప్రాంతీయ పార్టీల్లో 18 పార్టీలు మాత్రం తమకు అందిన చందాల వివరాలను ఎన్నికల సంఘానికి నివేదించగా, వారందరిలోనూ కలిపి ఏకంగా 70 శాతానికి మించి భారాసకే విరాళాలు అందాయి. ఈ గణాంకాలు గమనిస్తే చాలు. ఎన్నికలు ముంచుకురావడానికి ముందు ఆర్థిక సంవత్సరంలో ఆ పార్టీ ఏ స్థాయి దందాలు సాగించిందో ప్రజలకు అర్థమవుతున్నదని అంతా అనుకుంటున్నారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రాంతీయ పార్టీలు తాము తీసుకున్న విరాళాలను ఎన్నికల సంఘానికి తెలియజేశాయి. దేశంలోని 18 పార్టీలు కలిసి వెల్లడించిన వివరాల ప్రకారం .. ఈ అన్ని పార్టీలు కలిపి 216.76 కోట్ల రూపాయలు విరాళాలు స్వీకరించాయి. వీటన్నింటిలో ఒక్క భారత రాష్ట్ర సమితికి మాత్రమే 154.03 కోట్ల విరాళాలు వచ్చాయి. ఆ తర్వాతి స్థానాల్లో వైసీపీ, తెలుగుదేశం ఉన్నాయి.
వైసీపీకి 16 కోట్లు రాగా, తెలుగుదేశానికి 11.92 కోట్లు వచ్చాయి. ఆ కాల వ్యవధిలో వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ వారికి 16 కోట్లే వచ్చాయి. అదే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశానికి ఏకంగా 12 కోట్ల దాకా రావడం గమనార్హం. మొత్తానికి పారిశ్రామికవేత్తలనుంచి దందాలు వసూలు చేయడంలో తెలుగు రాష్ట్రాల పార్టీలను మించిన వారు లేరని అంతా కలిసి నిరూపిస్తున్నారు.
తమాషా ఏంటంటే.. చాలా పార్టీలు అసలు వివరాలే వెల్లడించలేదు. ఎన్నికల సంఘానికి నివేదికలు ఇచ్చినది 18 పార్టీలు మాత్రమే. కాగా, బిజేడీ, నేషనల్ కాన్ఫరెన్స్, తదితర ఏడు పార్టీలు అసలు తమ పార్టీకి విరాళాలే రాలేదని పేర్కొన్నాయి.
తెలంగాణలో భారత రాష్ట్ర సమితి వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చింది. రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత.. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ వచ్చారనే ఆరోపణలు కూడా పెరిగాయి. ప్రభుత్వ సొమ్మును మళ్లించి.. తిరిగి అదే సంస్థల నుంచి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పార్టీకి నిధులు తీసుకుని రకరకాల వక్రమార్గాలు కనిపెట్టారంటూ.. ఫార్ములా ఈ1 కార్ రేస్ వ్యవహారం నిరూపిస్తోంది. ఇలాంటి సమయంలోనే.. 2022-23 సంవత్సర కాలంలో.. అత్యధిక దందాలు వసూలుచేసిన ప్రాంతీయ పార్టీగా భారాస కీర్తిగడించడం విశేషం.
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
70 దటితే డిస్టింక్షన్.. ఇది ఏపట్నుంచి..