టాలీవుడ్ లో మరో సెలబ్రిటీ కేసు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు దగ్గుబాటి కుటుంబ సభ్యులైన సురేష్ బాబు, వెంకటేశ్, రానా, అభిరామ్ పై కేసులు నమోదు చేయాల్సిందిగా ఫిలింనగర్ పోలీసుల్ని ఆదేశించింది

వరుస వివాదాలతో టాలీవుడ్ ఉక్కిరిబిక్కిరవుతోంది. జానీ మాస్టర్, మంచు మోహన్ బాబు, అల్లు అర్జున్.. ఇలా చాలామంది కేసుల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి దగ్గుబాటి హీరోలు కూడా చేరారు. నిజానికి ఇది కొత్త వివాదం కాదు, కాకపోతే కేసు ఫ్రెష్.

హైదరాబాద్ ఫిలింనగర్ లో ఉన్న డెక్కన్ కిచెన్ కూల్చివేతపై సినీ హీరో వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు, మరో ఇద్దరు హీరోలు రానా, అభిరామ్ పై కేసులు నమోదు చేయాలని నాంపల్లి హైకోర్టు పోలీసుల్ని ఆదేశించింది. ఈ మేరకు వీళ్లందరిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

దక్కన్ కిచెన్ హోటల్ ఉన్న స్థలంతో దగ్గుబాటి కుటుంబానికి వివాదం ఉంది. దీంతో హోటల్ కు చెందిన నందకుమార్, దగ్గుబాటి కుటుంబంపై సిటీ సివిల్ కోర్టులో దావా వేశారు. ఓవైపు వివాదం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ, 2022లో ఓసారి పాక్షిక కూల్చివేతలు జరిగాయి. ఆ తర్వాత రెండేళ్లకు అంటే, 2024లో దగ్గుబాటి కుటుంబం మిగతా హోటల్ ను కూల్చివేసిందని ఆరోపిస్తున్నారు నందకుమార్.

దీంతో దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కేసు నమోదుచేయాలని కోరుతూ, నందకుమార్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు దగ్గుబాటి కుటుంబ సభ్యులైన సురేష్ బాబు, వెంకటేశ్, రానా, అభిరామ్ పై కేసులు నమోదు చేయాల్సిందిగా ఫిలింనగర్ పోలీసుల్ని ఆదేశించింది కోర్టు. 448, 452, 458, 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, త్వరలోనే వీళ్లకు నోటీసులు జారీచేయబోతున్నారు.

4 Replies to “టాలీవుడ్ లో మరో సెలబ్రిటీ కేసు”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.